• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, July 22, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా “అన్నగారు వస్తారు” ఉంటుంది- హీరో కార్తి

Maari by Maari
December 10, 2025
in Cinema, Latest News, Movies, special
0
80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా  “అన్నగారు వస్తారు” ఉంటుంది- హీరో కార్తి

Share and Enjoy !

Shares
Twitter

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో కార్తి.

– నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.

– నా వరకు చెప్పాలంటే ఇది రిస్కీ ప్రయత్నం. నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.

– హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ఈ సినిమా ఉంటుంది. ఇది పీరియాడిక్ మూవీ కాదు. నిన్నటితరం లెజెండరీ హీరోల సినిమాలు నేను థియేటర్స్ లో చూడలేదు గానీ మా పేరెంట్స్ చెప్పేవారు. ఆ దిగ్గజ నటుల ఫొటోస్ ఇప్పటికే చాలామంది ప్రేక్షకుల ఇళ్లలో ఉంటాయి. వాళ్లను దేవుళ్లలా చూస్తారు.

– కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు. డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన దర్శకుల్లో చాలామందిని పర్సనల్ గా నేను కలిశాను. వాళ్లు నాపై చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు కూడా వారిపై అలాంటి గౌరవమే ఉంది.

– మీరు ట్రైలర్ లో చూసి ఉంటారు. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది. పోలీస్ ఆఫీసర్ గా సఫారీ డ్రెస్ వేసుకుంటాను. ఆ విషయం జడ్జితో చెబుతాను. దర్శకుడు నలన్ చూపించిన కొత్తదనం ఇది. నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.

– హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.

– నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.

– ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

బాబు మోహన్ ముఖ్య అతిథిగా “ఫెయిల్యూర్ బాయ్స్” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ ఆవిష్కరణ వేడుక

Next Post
ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ ఆవిష్కరణ వేడుక

ఘనంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ ఆవిష్కరణ వేడుక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రెండు నేషనల్ అవార్డ్స్ సాధించిన “35 చిన్న కథ కాదు” సినిమా టీమ్ ను అభినందించిన “సమ్మర్ హాలిడేస్” మూవీ టీమ్

రెండు నేషనల్ అవార్డ్స్ సాధించిన “35 చిన్న కథ కాదు” సినిమా టీమ్ ను అభినందించిన “సమ్మర్ హాలిడేస్” మూవీ టీమ్

by Maari
July 22, 2026
0

జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కొత్త సినిమా!

జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కొత్త సినిమా!

by Maari
July 21, 2026
0

గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

by Maari
July 18, 2026
0

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

by Maari
July 17, 2026
0

జూలై 24న ప్రపంచవ్యాప్తంగా *ఎస్కే బషీద్‌ హారర్ మూవీ ‘అమెన్’ విడుదల!

జూలై 24న ప్రపంచవ్యాప్తంగా *ఎస్కే బషీద్‌ హారర్ మూవీ ‘అమెన్’ విడుదల!

by Maari
July 16, 2026
0

‘హుషార్‌ పిట్టలు’: ట్రోల్స్‌కు థియేటర్లలోనే సమాధానం.. మంగ్లీ పాడిన ‘టోంగా.. టోంగా’ గీతం విడుదల!

‘హుషార్‌ పిట్టలు’: ట్రోల్స్‌కు థియేటర్లలోనే సమాధానం.. మంగ్లీ పాడిన ‘టోంగా.. టోంగా’ గీతం విడుదల!

by Maari
July 16, 2026
0

నాగవంశీ చేతుల మీదుగా ‘అనకాపల్లి’ రొమాంటిక్ మెలోడీ ‘ఎలగే పిల్ల’ అవుట్.. ఆగస్ట్ 7న థియేటర్లలోకి!

నాగవంశీ చేతుల మీదుగా ‘అనకాపల్లి’ రొమాంటిక్ మెలోడీ ‘ఎలగే పిల్ల’ అవుట్.. ఆగస్ట్ 7న థియేటర్లలోకి!

by Maari
July 15, 2026
0

పాన్ ఇండియా స్థాయిలో ‘ఫీల్ మై లవ్’.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్!

పాన్ ఇండియా స్థాయిలో ‘ఫీల్ మై లవ్’.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్!

by Maari
July 15, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.