ఈ మధ్య కాలంలో మంచి పబ్లిసిటీతో విడుదలైన స్మాల్ బడ్జెట్టు చిత్రాల్లో బాగా బజ్ సంపాధించుకున్న చిత్రం గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రం డార్క్ కామెడీగా తెరెక్కింది. ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహించగా జయకాంత్ బాబీ, వేణుగోపాల్ సద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైం కామెడీ చిత్రం ఎలావుందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ: గుర్రం పాపిరెడ్డి(నరేష్ అగస్త్య), సౌధామిని(ఫరియా అబ్దుల్లా), మిలటరీ(రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి(వంశీధర్ కోసి) అనే నలుగురు మిత్రులు కలిసి శ్రీశైలంలో అడవుల్లో పాతిపెట్టిన ఓ శవాన్ని తీసుకొచ్చి… శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో పాతిపెట్టాలని చూస్తారు. అయితే వీరికి మరికొంతమంది పోటికి వచ్చి… ఆ శవాన్ని ఎత్తుకెళ్లడానికి ట్రై చేస్తారు. దాంతో ఆ నలుగురు మిత్రులు వీరివల్ల కొంత ఇబ్బందులకు గురవుతారు. ఇంతకూ ఆ శవం ఎవరిది? దానికి ఈ రెండు బ్యాచ్ లు ఎందుకు అంత తీవ్రంగా పోటీపడ్డాయి? తదితర వివరాలు తెలియాలంటే గుర్రం పాపిరెడ్డి సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైం కామెడీ చిత్రాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సరైన కథ… కథనాలతో ఇలాంటి సినిమాలను సెల్యులాయిడ్ పై ఆవిష్కరించగలిగితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కొత్త దర్శకులు ఇలాంటి కథలను ఈ మధ్య చాలా ఆసక్తికరంగా తెరకెక్కించి విజయం సాధిస్తున్నారు. తాజాగా గుర్రం పాపిరెడ్డి మూవీ కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది. దర్శకుడు మురళీ మనోహర్ మంచి ఎంటర్టైనింగ్ ప్లాట్ ను ఎంచుకుని… దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఎక్కువ ల్యాగ్ లేకుండా సినిమా మొదలైంది మొదలు… చివరి వరకు అనేక మలుపులతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. శవం కోసం రెండు వర్గాలు పోటీ పడే విధానం అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. స్టార్ కమెడియన్ యోగిబాబు ఎంటర్ తో కామెడీని మరింత పండింది. ఇంటర్వెల్ బ్యాంగ్… ఆతరువాత సెకెండాఫ్ లోనూ చాలా ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించి విజయం సాదించారు. ఇలాంటి కథ… కథనాలను ఇష్టపడేవారికి మంచి ఫన్ కలిగించే మూవీ గుర్రం పాపిరెడ్డి.
నరేష్ అగస్త్య ఎప్పటిలాగే మాంచి జోష్ తో నటించి మెప్పించారు. తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. డార్క్ కామెడీ సినిమాలో తన పాత్ర ఎంతవరకూ మెప్పించగలదో అంతవరకూ తన పాత్రకు న్యాయం చేశారు. హాట్ గాళ్ ఫరియా అబ్దుల్లా తన గ్లామర్ తో పాటు… నటనతోనూ కామెడీని పండించింది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సీన్స్ పెద్దగా పండలేదు. తమిళ హాస్యనటుడు యోగిబాబు పాత్ర కూడా పర్వాలేదు. ఇక జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా జీవన్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు.
ప్రేక్షకులను రెండు గంటలపాటు ఎంగేజ్ చేయడానికి దర్శకుడు రాసుకున్న కథ… కథనాలు ఎంతో గ్రిప్పింగ్ గా వున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3.25










