‘కలర్ ఫొటో’, ‘బేబి’ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను అందించిన బ్లాక్‌బస్టర్ మేకర్స్ ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ “చెన్నై లవ్ స్టోరీ”. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలను సందడిగా నిర్వహించారు. అనంతరం చిత్రబృందం పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
టీమ్ ఏమన్నదంటే?
హీరో కిరణ్ అబ్బవరం: “నా కెరీర్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక మెమొరబుల్ ఫిల్మ్. పాటలు చూసి ఇదొక క్లాస్ సినిమా అనుకుంటున్నారు, కానీ ఇందులో సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్యారెక్టర్స్, డైలాగ్స్ అన్నీ మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇందులో హీరోయిన్‌ను ఎంతో గౌరవించే స్వచ్ఛమైన ప్రేమికుడిగా కనిపిస్తాను. వేరే సినిమాల పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నెల 24న బరిలోకి దిగుతున్నాం.”
సాయి రాజేష్ (స్టోరీ రైటర్, నిర్మాత): “కిరణ్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఏ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. సెకండాఫ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతో ఆయనకు చాలా మంచి పేరొస్తుంది. నేను ‘బేబి’ హిందీ రీమేక్ పనుల్లో ఉండటం వల్ల నా స్నేహితుడు రవికి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చాను. తక్కువ టైమ్‌లో మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.”
ఎస్.కె.ఎన్ (నిర్మాత): “బేబి, చెన్నై లవ్ స్టోరీ రెండూ భిన్నమైన కథలు. బేబితో పోల్చడం వల్ల మాపై ఎలాంటి అదనపు ఒత్తిడి లేదు. మాస్, జానర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా మా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం. ప్రీమియర్స్ నుంచే సినిమాకు మంచి టాక్ వస్తుందని నమ్ముతున్నాం.”
శ్రీ గౌరి ప్రియ (హీరోయిన్): “ఈ సినిమాలో నా క్యారెక్టర్‌లో చాలా లేయర్స్ ఉంటాయి. సినిమా మొత్తం చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ‘వదలనే’ సాంగ్ లీడ్ సీన్, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో మీరు ఒక స్వచ్ఛమైన ప్రేమకథను చూస్తారు.”
రవి నంబూరి (దర్శకుడు): “నివి, స్టీవెన్ శంకర్ (కిరణ్ పాత్ర) మధ్య వచ్చే సంభాషణలు చాలా అందంగా ఉంటాయి. నిర్మాతలు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సాయి రాజేష్ గారి ఐడియా మేరకే కథకు చెన్నై బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాం. ఆ నగరానికి ఈ కథతో బలమైన సంబంధం ఉంటుంది.”
సిరి హన్మంతు (నటి): “ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.”
కంటెంట్‌పై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్న చిత్రబృందం, ఈ నెల 24న రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.










