శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఫీల్ మై లవ్’. హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్‌తో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అందమైన లొకేషన్లలో అద్భుతమైన ప్రేమకథ:
ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అద్భుతమైన లొకేషన్లలో రూపుదిద్దుకుంటోంది. చెన్నై, పుదుచ్చేరి అందాలతో పాటు… మూనార్, కొడైకెనాల్ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల నడుమ దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలబోతగా వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
ఐదు భాషల్లో పాన్ ఇండియా రిలీజ్:
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉన్న ‘ఫీల్ మై లవ్’ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషమేమిటంటే.. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన రాగా, ఇప్పుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.










