• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, August 31, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

Maari by Maari
August 30, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

Share and Enjoy !

Shares
Twitter

సందీప్ వంగా మీద నాకు ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేను. సినిమా పట్ల సుమంత్ ప్రభాస్ లో ఒక డ్రీమ్ చూశా, ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

* సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా “రోమాంచకం” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

యాక్టర్ కమల్ మాట్లాడుతూ – నేను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. కానీ భద్రకాళీ పిక్చర్స్ ఆఫీస్ నుంచి ఈ సినిమా కోసం కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అదే నా లైఫ్ లో రోమాంచకం మూవ్ మెంట్. ఎందుకంటే నేను సందీప్ వంగా గారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలను ఇష్టపడతాను. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి టీమ్ అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ సతీష్ మాట్లాడుతూ – నేను యాక్టర్ గా మారి ఇలాంటి ఒక మంచి సినిమాలో నటిస్తానని ఊహించలేదు. ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. రోమాంచకం మూవీ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన మాట్లాడుతూ – ఈ సినిమాలో కొత్తగా కాస్ట్యూమ్స్ డిజైన్స్ ట్రై చేశాను. ఈ మూవీ మా అందరి లైఫ్ లో రోమాంచకం మూవ్ మెంట్ తీసుకొచ్చింది. మీరు ఆ వైబ్ ను ఎంజాయ్ చేయాలంటే సెప్టెంబర్ 3న థియేటర్స్ కు వెళ్లి మూవీ చూడండి. అన్నారు.

నటి మానస మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరోకు మదర్ రోల్ లో నటించాను. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలో డైరెక్టర్ వేణు గారు చెప్పారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఇష్టంతో మా సినిమా అని వర్క్ చేశారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సూపర్బ్ టాలెంటెడ్. సెప్టెంబర్ 3న రిలీజ్ కు వస్తున్న ఈ చిత్రాన్ని మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ సోహాన్ మాట్లాడుతూ – అర్జున్ రెడ్డి సినిమా చూశాక థ్రిల్ ఫీలయ్యాను. ఇప్పుడు అదే సంస్థలో నేను నటుడిగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో పాటు మరో చిత్రంలోనూ నన్ను రిఫర్ చేశారు ప్రొడ్యూసర్ ప్రణయ్ అన్న. ఈ సినిమాలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ సరైన మీటర్ లో ఉంటాయి. ఇలాంటి స్క్రిప్ట్ చేయడం చాలా కష్టం. ఈ మూవీలో నటించే అవకాశం కల్పించిన వేణు గారికి థ్యాంక్స్. అన్నారు.

యాక్టర్ మణి మాట్లాడుతూ – నేను సుమంత్, వెంకటేష్ మేమంతా ఫ్రెండ్స్. మేమంతా బయట ఎలా సరదాగా ఉంటామో సినిమాలోనూ అదే ఫన్ రిఫ్లెక్ట్ అవుతుంది. భద్రకాళీ పిక్చర్స్ లో రోమాంచకం లాంటి ఫన్ మూవీ ఏంటని నాకూ మొదట్లో డౌట్ వచ్చింది. అయితే సందీప్ అన్న గురించి తెలుసుకున్నా, ప్రణయ్ అన్నను దగ్గర నుంచి చూశాక వారిలో ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో తెలిసింది. మనకు అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి మూవీస్ లోనూ ఒక తరహా కామెడీని ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందని నమ్ముతున్నాం. సుమంత్ నా స్నేహితుడు కావడం పట్ల గర్వపడుతున్నా. అన్నారు.

యాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ- ఈ సినిమాతో మీకు మరో నాలుగు సినిమాలు వస్తే నాకు చాలా సంతోషం అని అనేవారు ప్రణయ్ అన్న. ఆయనకు మా మీద ఉన్న ప్రేమకు ఎంతో హ్యాపీగా ఫీలయ్యాం. దాదాపు ఆరు నెలలు ఈ సినిమా కోసం రిహార్సల్స్ చేశాం. మా డైరెక్టర్ వేణు గారు ఈ సినిమా డే 1 ఎంత ఎగ్జైటింగ్ గా మాతో వర్క్ చేయించారో ఇప్పుడూ అంతే ఎగ్జైటింగ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ టీమ్ ను మిస్ అవుతున్నా అని బాధగా ఉంది. రోమాంచకం సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.

డీవోపీ పవన్ పప్పుల మాట్లాడుతూ – ఈ సినిమాకు డీవోపీ వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. దాదాపు ఏడాది పాటు హ్యాపీగా వర్క్ చేశాం. ఈ సినిమాకు పనిచేసే అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. సెప్టెంబర్ 3న థియేటర్స్ కు మీ గ్యాంగ్ తో మీ ఫ్రెండ్స్ తో రండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేయాలంటూ సందీప్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు నమ్మలేకపోయాను. ఈ సినిమాను నాకొక అవకాశంగా మాత్రమే కాదు బాధ్యతగా భావించాను. నిజాయితీగా వందశాతం ఎఫర్ట్స్ పెట్టి మ్యూజిక్ అందించాను. రోమాచకం పాటలు మీకు నచ్చాయని భావిస్తున్నా. సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమానే నాకొక విజిటింగ్ కార్డ్ గా మారిపోతుందనే నమ్మకం ఉంది. అన్నారు.

కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్ మాట్లాడుతూ – నేను బొంబాయి నుంచి వచ్చాను. అక్కడ పదేళ్లు బాలీవుడ్ లో వర్క్ చేశాను. నేను చేసిన ఒక మ్యూజిక్ వీడియో చూసి వేణు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో మూడు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను. ఆ మూడు సాంగ్స్ కు స్టెప్స్ ఎంతో న్యాచురల్ గా ఉంటాయి. ఇందులో డైరెక్టర్ వేణుగోపాల్ గారి సహకారం ఎంతో ఉంది. ఈ సినిమా నాకు అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ – ఇది నా సినిమా అనేంత ప్రేమతో ఈ ఈవెంట్ కు అతిథిగా వచ్చాను. ప్రణయ్, సందీప్ నాకు సోదరుల్లాంటి వారు. స్పిరిట్ లాంటి భారీ చిత్రం చేస్తున్నా, కొత్త వాళ్లకు అవకాశం కల్పించేందుకు ఈ సినిమా చేయడం అభినందనీయం. స్పిరిట్ పనుల్లో ఇద్దరు బ్రదర్స్ చాలా బిజీగా ఉన్నారు. సందీప్ అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ సంచలనం సృష్టించారు. దర్శకుడిగా, ఎడిటర్ గా ఆయనంటే నాకు ఇష్టం. ఎంత ఎదిగినా కొత్త వాళ్లకు సపోర్ట్ చేయడానికి ముందుంటారు సందీప్. నా స్నేహితుడి బుక్ ఒకటి లాంఛ్ కోసం అడిగితే వెంటనే అతిథిగా వచ్చేందుకు ఒప్పుకున్నారు. సుమంత్ ప్రభాస్ గురించి మంచి పర్ ఫార్మర్ అని వింటున్నా. రోమాంచకం పాటలు, కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ – మా రోమాంచకం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన విజయ్ గారికి థ్యాంక్స్. ఈ రోమాంచకం జర్నీలో పార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రొడ్యూసర్ సందీప్, ప్రణయ్ గారికి, మా డైరెక్టర్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. ఈ టీమ్ అందరితో ఎంతో సరదాగా, సంతోషంగా వర్క్ చేశాను. ప్రతి రోజూ రోమాంచకం ఫీల్ మా అందరిలో ఉండేది. డీవోపీ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకీ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. సెప్టెంబర్ 3న మా సినిమా రిలీజ్ అవుతోంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నా. రోమాంచకం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో చూసి ఎంజాయ్ చేసే ఎంటర్ టైనర్. అన్నారు.

లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ – సరదాగా సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. అయితే ఈ కథలో ఎంతో అర్థవంతమైన మాటలు, పాటలు రాసే సందర్భాలు ఉండటం విశేషం. ఈ సరదా కథలోనే ఎంతో డెప్త్ ఉన్న సాహిత్యాన్ని రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రోమాంచకం సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ శౌర్యువ్ మాట్లాడుతూ – సుమంత్ ప్రభాస్ తో కాసేపు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా ప్రతిభ గల నటుడు ఆయన. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ విజయ్ అన్నలా స్టార్ కావాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంతో కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న సందీప్, ప్రణయ్ అన్నను అభినందిస్తున్నా. డైరెక్టర్ వేణుగోపాల్ గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆల్ ది బెస్ట్ కాకుండా కంగ్రాట్స్ చెప్పాలని అనిపిస్తోంది. విజయ్ అన్నతో సినిమా చేస్తున్న ప్రతి రోజూ నాకు రోమాంచకం మూవ్ మెంట్. అన్నారు.

డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ – కబీర్ సింగ్ తర్వాత సందీప్ అన్నతో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆయన కథ విన్న పది నిమిషాల్లో నెక్ట్స్ ఎలా ఉండబోతుందో చెబుతాడు. ప్రణయ్ అన్న సందీప్ అన్న ఇద్దరికీ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. ఈ కథ వారికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతోనే వెళ్లి చెప్పాను. నాకు వాళ్లు ఇచ్చిన ఫ్రీడమ్ చూసి చాలా మంది అసూయపడుతున్నారు. సందీప్ అన్న నాకు ఒకటే విషయం చెప్పారు. నీ సినిమా నీ విజన్ జస్ట్ డూ ఇట్ అన్నారు. ఆయన నా కథపై, నా క్యారెక్టర్స్ పై, నాపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. కాలేజ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక రియాల్టీ తెలుస్తుంది. ఆ సందర్భాన్ని నా కథలో చెప్పాను. ఆ సందిగ్ధ పరిస్థితిని సహజంగా, అందంగా నా తరహాలో సినిమాగా తెరకెక్కించాను. ఈ సినిమాకు నేను సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోలేదని సందీప్ అన్న చెప్పారు. ఆయన చెప్పినట్లు నిజంగానే ఫ్రెష్ రైటింగ్, ఫ్రెష్ పర్ ఫార్మెన్స్ లతో ఈ సినిమా చేశాను. మేమ్ ఫేమస్ సినిమాలోని చిన్న సీన్ చూసి సుమంత్ ను తీసుకున్నాను. ఆయనలో ఎంతో ప్రతిభ ఉంది. ఈ మూవీలో క్యారెక్టర్ ను సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ అన్నను ఫిలింమేకర్స్ ఎలా చూశారో ఈ సినిమా తర్వాత సుమంత్ ప్రభాస్ ను అలా చూస్తారు. అనంతిక మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. సూపర్బ్ టాలెంటెడ్. నేను ఏ టెక్నీషియన్ ను అడిగినా సందీప్ అన్న, ప్రణయ్ అన్న ఇచ్చేవాళ్లు కానీ నేను 99 పర్సెంట్ కొత్త వాళ్లతోనే సినిమా చేశాను. నా విజన్ ను నమ్మాను. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. అంతే కొత్త పర్ ఫార్మెన్స్ లు మీరు చూడబోతున్నారు. రోమాంచకం ఫ్రెష్ ఫీల్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ – విజయ్ అన్న, సందీప్ అన్న అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు ఇచ్చిన ఫీవర్ మామూలుది కాదు. మాపై ఆ సినిమా ఎంతో ఇంపాక్ట్ చూపించింది. విజయ్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న పెళ్లి చూపులు సినిమా చూసి మనం కూడా సినిమాల్లో ప్రయత్నించవచ్చు అనే నమ్మకం కలిగింది. మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో జరిగే డిస్కషన్ ఏంటంటే ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాటికి ప్రచారం ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అని ఆలోచించేవాళ్లం. నేను మేమ్ ఫేమస్ సినిమా చేశాక ఆ సినిమాకు సపోర్ట్ చేసేందుకు విజయ్ అన్న ప్రచారం చేశారు. అది ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అప్పుడు విజయ్ అన్న ఇచ్చిన బూస్ట్ ఇంకా మాలో ఉత్సాహం నింపుతోంది. సందీప్ అన్న ఈ సినిమా కథ గురించి చెప్పి విను అన్నప్పటి నుంచి, భద్రకాళీ ఆఫీస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు జీవితంలో రోజూ రోమాంచకమే. అర్జున్ రెడ్డి తర్వాత దేశమంతా మన వాళ్లైన సందీప్, విజయ్ అన్న గురించి తెలిసింది. మాట్లాడుకున్నారు. ఈ రోజు వాళ్ల బ్యానర్ లో సినిమా చేస్తుంటే నాకూ పెద్ద హీరో కావాలనిపిస్తోంది. అందుకు ఈ సినిమానే మెట్టు కావాలి. ఈ సినిమా మిమ్మల్ని ఎంత ఎంటర్ టైన్ చేస్తుందో, ఎంత నవ్విస్తుందో నేను ఊహించగలను. ఆ క్యారెక్టర్స్ లో ఉండే ఫన్, స్వీట్ నెస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సెప్టెంబర్ 3న ఈ క్యూట్ ఫీల్ మీకు రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా ఉంటుంది. ఇదొక క్యూట్ ఫన్ ఫిలిం. మీరు ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్ తో వెళ్లినా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ – సుమంత్ ప్రభాస్ బయట ఎలా సరదాగా ఉంటాడో మా సినిమాలోని క్యారెక్టర్ లో కూడా అలాగే కనిపిస్తాడు. ఆయన పర్సన్ గా ఎలా ఉంటాడో మా క్యారెక్టర్ కు కూడా 70 పర్సెంట్ సరిపోయాడు. అనంతిక చాలా ప్రతిభ గల హీరోయిన్. మా మూవీలో అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఫ్రెండ్స్ బ్యాచ్ గా నటించిన నరేంద్ర, రవి, వెంకటేష్, మణి బయట ఫ్రెండ్స్ బ్యాచ్ ను చూసినట్లే అనిపిస్తారు. వీరిలో నరేంద్ర, రవికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త వాళ్లైనా టెక్నీషియన్స్ అంతా బాగా వర్క్ చేశారు. వేణుగోపాల్ గారి విజన్ ను నమ్మి వారంతా ప్యాషన్ తో వర్క్ చేశారు. వాసుకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. పవన్ డీవోపీగా అమేజింగ్ వర్క్ చేశారు. వేణుగోపాల్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్. చెప్పిన బడ్జెట్ లో సినిమా చేశారు. వేణుతో పాటు టీమ్ లోని చాలా మందికి మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను. రోమాంచకం సినిమా బాగా వచ్చింది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెప్టెంబర్ 3న థియేటర్స్ కు వెళ్లి చూడండి. మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా చూసే క్లీన్ మూవీ ఇది. మెహర్ అన్నకు మాకొక కనెక్షన్ ఉంది. సెప్టెంబర్ 3న ఈ సినిమా చూసినప్పుడు మీకు అదేంటో అర్థమవుతుంది. ఈ సినిమాలో పాటలు ఎప్పుడు రిలీజైనా షేర్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రభాస్ అన్నకు ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత బాగా సినిమా తీస్తావా అని అడిగాను. ఆయన ఒక 6 నిమిషాల నిడివి గల సీన్ తీసుకొని వచ్చి చూపించాడు. స్క్రిప్ట్ లో ఉన్న దానికంటే ఇంకా బాగా సీన్ తెరకెక్కించాడు అనిపించింది. అప్పటి నుంచి వేణుకే ఈ సినిమా బాధ్యత మొత్తం అప్పగించాను. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. మెయిన్ లీడ్ కాబట్టి హీరో అనే ఫీల్ సహజంగానే ఉంటుంది. కానీ సుమంత్ ప్రభాస్ అలాంటిదేం కనిపించకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి బాగా నటించాడు. అతనిది అమాయకమైన క్యారెక్టర్. ఆ పాత్రలో బాగా నటించాడు అనిపించింది. అనంతిక పర్ ఫార్మెన్స్ రియల్లీ గుడ్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో నటించిన వాళ్లంతా సూపర్బ్ గా నటించారు. మ్యూజిక్ కోసం వాసుకిని తీసుకున్నప్పుడు ఒక నమ్మకంతో తీసుకున్నాం. పాటలు, మ్యూజిక్ విన్నప్పుడు అది నిజమైంది అనిపించింది. సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్, సెప్టెంబర్ 2నే ప్రీమియర్స్ వేస్తున్నాం. డైరెక్టర్ వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3. ఆ తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజు నీ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. నాకు, విజయ్ కు అర్జున్ రెడ్డి రిలీజైన ఆగస్టు 24 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రోజు నీకూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. సినిమా అంతా గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం మీరు వెచ్చించే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కాదు. మళ్లీ సినిమా చూడాలని కూడా అనుకుంటారు. అలాంటి ఫన్ సీన్స్ కూడా ఉన్నాయి. అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – సందీప్ పై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. అది ఒక దర్శకుడు, హీరో మధ్య ఉన్న బంధం కాదు, ఒక బ్రదర్స్ మధ్య ఉన్న బంధం కాదు, స్నేహితుల మధ్య బాండింగ్ కాదు. మా బంధం అంతకుమించింది. అర్జున్ రెడ్డి టైమ్ లో మేమిద్దరం ఒక యుద్ధం లాంటి ప్రయత్నం చేశాం. ఆ సినిమా వర్కవుట్ కాకుంటే ఏమయ్యేదో ఊహించలేకపోయాం. మాకు అప్పుడు డబ్బు లేదు, పేరు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. పెళ్లిచూపులు కూడా రిలీజ్ కాలేదు కాబట్టి అభిమానులైన మీరు కూడా మా వెనక లేరు. జస్ట్ మేము ధైర్యంగా అడుగేశాం. అర్జున్ రెడ్డి సినిమా లేకుంటే ఆ సక్సెస్ మాత్రమే కాదు సందీప్ తో షేర్ చేసుకున్న ఎన్నో ఎక్సిపీరియన్స్ లు, మూవ్ మెంట్స్ మిస్ అయ్యేవాడిని. జీవితం గురించి మాట్లాడుకున్న ఎన్నో సందర్భాలు మిస్ అయ్యేవాడిని. డబ్బు లేనప్పుడు సందీప్ వాళ్ల బ్రదర్ ప్రణయ్, ఫాదర్ తో పొలం అమ్మించి నాతో నా మీద నమ్మకంతో అర్జున్ రెడ్డి సినిమా చేశాడు. వాళ్ల ఫ్యామిలీ సంపాదన మొత్తం ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేశాడు. సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తా, నాకోసం సందీప్ ఎక్కడిదాకా అయినా వస్తాడు. ఆయన పిలిచాక నేను ఈ ఫంక్షన్ కు రాకుంటే నేను బతికి ఎందుకు. సుమంత్ ను చూసినప్పుడు ఆయన కళ్లలో సినిమా పట్ల ఒక డ్రీమ్ కనిపించింది. అప్పుడే అనుకున్న సుమంత్ ప్రభాస్ ఏదో ఒక రోజు యాక్టర్ లేదా డైరెక్టర్ అవుతాడు. అప్పుడు మనం చేయగలిగినంత ఇతనికి చేయాలని. మేమ్ ఫేమస్ సినిమాకు నా వంతు ప్రమోషన్ చేశా. భద్రకాళీ లోగో పడుతుంటే అర్జున్ రెడ్డి సౌండ్ వినిపిస్తుంటుంది. సందీప్ అన్న ప్రణయ్ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సందీప్, ప్రణయ్ తో పాటు ఈ కొత్త టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. వాసుకి కంపోజ్ చేసిన రాధారమణ పాట ఆనంద్ కు చాలా ఇష్టం. రోజూ వింటుంటాడు. సెప్టెంబర్ 2న ప్రీమియర్స్ తోనే ఈ సినిమా ఘన విజయం సాధించాలి. సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేశాం అనేది ముఖ్యం. సక్సెస్ ఇవాళ కాకుంటే రేపైనా వస్తుంది. మనపై మనకు నమ్మకం ఉండి, మనలో విజయం సాధించాలనే తపన ఉంటే తప్పకుండా విజయం దక్కుతుంది. అన్నారు

నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————–
డీవోపీ – పవన్ పప్పుల
మ్యూజిక్ – వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్ఓ – సురేష్ ( ఎస్. కె. మీడియా )
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ – భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ – సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

by Maari
August 30, 2026
0

మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

by Maari
August 30, 2026
0

రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

by Maari
August 30, 2026
0

సస్పెన్స్ థ్రిల్లర్ గా “కికు చిరంజీవి” ఆకట్టుకుంటాడు

సస్పెన్స్ థ్రిల్లర్ గా “కికు చిరంజీవి” ఆకట్టుకుంటాడు

by Maari
August 30, 2026
0

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

by Maari
August 29, 2026
0

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

by Maari
August 29, 2026
0

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

by Maari
August 29, 2026
0

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

by Maari
August 29, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.