• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, August 31, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

Maari by Maari
August 31, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

Share and Enjoy !

Shares
Twitter

* సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. వి. వినాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

చంద్రబోస్ గారు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశాడంటూ ఆయన చెప్పారు. కథ బాగా నచ్చి ఈ సినిమాకు ఒక్క రూపాయి తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాసినట్లు చంద్రబోస్ గారు నాతో అన్నారు. ఈ సినిమా గొప్ప సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంతగా చెప్పిన తర్వాత నాకు కూడా ఇది గొప్ప సినిమా అవుతుందని అనిపించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అందరికీ మంచి పేరు తీసుకురావాలి. నా మొదటి సినిమా ఆదిలో ఫస్ట్ పాట రాసింది చంద్రబోస్ గారే. డైరెక్టర్ జ్ఞాన ప్రభ మొదటి సినిమాకు కూడా చంద్రబోస్ గారే లిరిక్స్ రాశారు. ఈ సినిమా కూడా ఆది అంత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

‘రంగస్ధలం’ తర్వాత అంత గొప్ప సాహిత్యం ‘ధర్మస్థల నియోజకవర్గం’లో అందించాను – ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్

లిరిక్ రైటర్ గా నాకు చాలా సంతృప్తిని, సంతోషాన్ని కలుగజేసిన చిత్రమిది. రంగస్థలం తర్వాత అంత సంతోషంగా ఈ చిత్రానికే పాటలు రాశాను. అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే సందర్భాలు ఈ సినిమాలో ఉన్నాయి. అలాంటి సందర్భాలను దర్శకుడు జ్ఞానప్రభ క్రియేట్ చేశారు. ఐదు పాటలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఈ పాటలకు మహవీర్ మంచి ట్యూన్స్ చేశాడు. వాటిలో న్యాయం చేయరా దేవుడా, ధర్మో రక్షతి రక్షిత:, ఆరంభం, కొడుకో కొడుకో, కాలం ..ఇలా ఐదు పాటలు ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరిలో ఒక మహా మానవుడు, ఒక అల్పమానవుడు ఉంటాడు. సమాజంలో మహా మానవుడిని మంచి ఎవరూ ఎదగలేరు. అల్ప మానవుడిని మించి దిగజారలేరు. ఆ మహా మానవుడికి, అల్పమానవుడికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ కథాంశం. ఆ సంఘర్షణలో ఎవరు గెలిచారు అనేది డైరెక్టర్ జ్ఞాన ప్రభ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా ఇష్టంతో కష్టపడి పనిచేశారు. వారందరికీ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ భాస్కర్ గారు నాగ సినిమాకు మేనేజర్ గా వర్క్ చేశారు అప్పటి నుంచి నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు. కొత్త దర్శకులు కథ బాగా చెప్పినా అది రూపొందించడంలో ఎక్కడో మిస్టేక్స్ చేస్తుంటారు. కానీ జ్ఞాన ప్రభ మంచి కథను అంతే బాగా తెరకెక్కించారు. ఈ రోజు యువత చూడాల్సిన చిత్రమిది. డ్రగ్స్ గురించి ఇప్పుడు జరుగుతున్నవి ముందే ఊహించి ఈ సినిమాలో తెరకెక్కించాడు జ్ఞాన ప్రభ. ఆయన మరెన్నో మంచి చిత్రాలు రూపొందించాలి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. అన్నారు.

నటి కస్తూరి మాట్లాడుతూ – అన్నమయ్య లాంటి ఎన్నో తెలుగు చిత్రాలతో నన్ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. గృహలక్ష్మి సీరియల్ నన్ను ప్రతి తెలుగింటికి చేర్చింది. మరోవైపు తమిళంలో కామెడీ రోల్స్ చేస్తున్నా. ఇలాంటి ఈ సినిమాలో టైమ్ లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చి నన్ను సర్ ప్రైజ్ చేశారు డైరెక్టర్ జ్ఞాన ప్రభ. కొత్త దర్శకులు తమ తొలి చిత్రంగా లవ్, రొమాంటిక్ మూవీస్ చేస్తారు. కానీ సమాజానికి మంచిని చెప్పే ఇలాంటి గొప్ప సినిమా చేసిన మా డైరెక్టర్ ను అభినందిస్తున్నా. అలాగే ఆయనను ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారిని ప్రశంసిస్తున్నా. అన్నారు.

నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ- ఫస్ట్ మూవీకి మంచి డైరెక్టర్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం నటరాజ్ అదృష్టం. సోషల్ మెసేజ్ ఉన్న మంచి చిత్రమిది. సినిమా బాగుంటుందని అనిపిస్తోంది. నేను సినిమా చూడలేదు. కస్తూరి గారు చెప్పిన మాటల్లో చూస్తే సినిమా చాలా బాగుంటుందని అర్థమవుతోంది. అలాగే చంద్రబోస్ గారు రాసే పాటలు కలకాలం గుర్తుండిపోతాయి. ఈ సినిమా కూడా అలాగే ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ – ఇలాంటి మంచి మూవీతో మా అబ్బాయి హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. సోషల్ మెసేజ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఉన్న చిత్రమిది. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అయిన దర్శకుడు జ్ఞాన ప్రభ, ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నన్ను విలన్ గా ప్రతి భాషలో ప్రేక్షకులు గుర్తుపడతారు. కానీ నాకు కూడా కాంపిటేషన్ వచ్చేలా ఈ సినిమాలో విలనీ పండించారు కస్తూరి గారు. ఈ సినిమాలో గొప్ప సాహిత్యం రాసిన చంద్రబోస్ గారికి అభినందనలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా. అన్నారు.

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ – సత్యప్రకాష్ తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. వాళ్ల అబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ జ్ఞాన ప్రభ ఈ సినిమాలో నాకొక పవర్ పుల్ రోల్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో ఫన్ ఉంది, మెసేజ్ ఉంది, ఇప్పటి యూత్ కు చెప్పాల్సిన మంచి ఉంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ ఏలేందర్ మాట్లాడుతూ – డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఎంతో టిపికల్ గా అనిపించింది. ప్రతి పాట కథను ముందుకు తీసుకెళ్లేలా ఉంది. అలాంటి మంచి సందర్భాలు కథలో కుదరడం సంతోషాన్నిచ్చింది. కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ గారు అద్భుతమైన సాహిత్యం అందిచారు. సినిమాలోని పాటలన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మూవీ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అన్నారు.

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ – ఇది నాకు మనసుకు దగ్గరైన సినిమా. నేను చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా. నిజంగా జరిగిన ఒక ఘటన నేపథ్యంగా సమాజానికి మంచిని చెప్పేలా రూపొందించిన ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మా సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ వెన్నెముకలా నిలిచారు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అదే నమ్మకంతో వర్క్ చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశాక డైరెక్టర్ జ్ఞాన ప్రభ గారికి మొదటి సినిమా అనుకోరు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు శివకుమార్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో ఒక మంచి రోల్ చేసే అవకాశం దక్కింది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాలు చేసే భాస్కర్ గారి లాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి బ్యానర్స్ ఉంటే మాలాంటి వారికి కొదవ ఉండదు. డైరెక్టర్ జ్ఞాన ప్రభ గారు సినిమాను మంచి మెసేజ్ తో పాటు ఎంటర్ టైనింగ్ గా సినిమాను రూపొందించారు. అన్నారు.

ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ మాట్లాడుతూ – మా సినిమా సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా రిలీజ్ కు వస్తోంది. మా టీమ్ అంతా సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఆఫీస్ లో ఎంత డిస్కస్ చేసుకున్నా, షూటింగ్ లొకేషన్ లో మాత్రం చాలా క్లారిటీగా వర్క్ చేశాం. మా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు ఒక్క వర్కింగ్ డే కూడా పెరగకుండా సినిమా కంప్లీట్ చేశాడు. నేను మేనేజర్ గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాను. నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు జ్ఞాన ప్రభ లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం సంతోషంగా ఉంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ – కథ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కంప్లీట్ సపోర్ట్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్. నా టీమ్ లోని టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ నాకు మోరల్ సపోర్ట్ గా నిలిచారు. వారి వల్లే ఇలాంటి మంచి సినిమా చేయగలిగాను. వితిక గారితో సహా అందరు ఉదయం ఆరు గంటలకే సెట్ లో ఉండేవారు. ఏ సౌకర్యాలు డిమాండ్ చేయకుండా సినిమాలో నటించారు. ఇలాంటి టీమ్ దొరకడం నా అదృష్టం. సినిమా అంటే సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఏ ఇబ్బంది రాకుండా నా టీమ్ అండగా నిలుస్తున్నారు. ఒక యదార్థ ఘటన నేపథ్యంగా ఫిక్షనల్ స్టోరీతో మంచి మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్, మ్యూజిక్ ఉండేలా ఈ సినిమాను రూపొందించాను. సెప్టెంబర్ 4న థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో నటరాజ్ మాట్లాడుతూ – ధర్మస్థల నియోజకవర్గం లాంటి మంచి చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ, మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు ఫిల్లర్స్ లా నిలబడ్డారు. చంద్రబోస్ గారు గొప్ప సాహిత్యాన్ని అందించారు. మహవీర్ తన పేరులో ఉన్నంత పవర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా కోస్టార్స్ అందరికీ థ్యాంక్స్. ఒక కామన్ మ్యాన్ కోసం కామన్ మ్యాన్ కథతో కామన్ మ్యాన్ రూపొందించిన సినిమా ఇది. అన్నారు.

నటీనటులు – సాయికుమార్, సుమన్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి

లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఏలేందర్
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
నిర్మాత: మేరుం భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

Next Post

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

Next Post
శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

by Maari
August 31, 2026
0

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

by Maari
August 31, 2026
0

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

by Maari
August 31, 2026
0

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

by Maari
August 31, 2026
0

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

by Maari
August 31, 2026
0

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

by Maari
August 30, 2026
0

మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

by Maari
August 30, 2026
0

రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.1.8కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా

by Maari
August 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.