ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్‌కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను అందిస్తోంది.
అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సబ్‌కో’ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఆకట్టుకునే స్వరకల్పన పాటకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వైబ్‌ను తీసుకొచ్చింది. ఈ పాటకు శ్రీ హర్ష ఇమాని సాహిత్యం అందించారు.
గుంటూరులోని VVIT కాలేజీలో విద్యార్థుల ఉత్సాహభరిత సమక్షంలో ‘సబ్‌కో’ పాటను విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహంతో పాట లాంచ్ కార్యక్రమం ఎంతో జోష్‌గా, ప్రత్యేకంగా జరిగింది. ఇప్పటికే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుండగా, తాజాగా విడుదలైన ‘సబ్‌కో’ పాట ఆ క్రేజ్‌ను మరింత పెంచుతోంది.
ప్రస్తుతం చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమవుతున్నారు. మరోవైపు వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. చిత్ర బృందం చేస్తున్న ఈ విస్తృత ప్రచారం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
The Musical Journey of EPIC – FIRST SEMESTER Gets More Vibrant With Fourth Single ‘SABKO’
The much-awaited fourth single from Anand Deverakonda and Vaishnavi Chaitanya starrer EPIC – FIRST SEMESTER has been unveiled today. Titled ‘SABKO’, the vibrant track adds another exciting musical flavour to the film’s already much-talked-about album.
Composed by the immensely talented Hesham Abdul Wahab, ‘SABKO’ features the vocals of Sanjith Hegde and Sithara Krishnakumar, with Hesham’s evocative composition bringing a distinct and breezy vibe to the track. The lyrics for the song have been penned by Sri Harsha Emani.
The song was launched amidst the energetic presence of students at VVIT College, Guntur, making it a lively and memorable launch event. With the promotional material of EPIC – FIRST SEMESTER already creating a buzz across social media, the team is leaving no stone unturned to take the excitement forward.
The team is currently on an extensive promotional spree, visiting colleges and cities across Andhra Pradesh and Telangana, while also participating in back-to-back promotional interviews. The continuous promotions are further amplifying the buzz around the film ahead of its grand worldwide theatrical release.
Directed by debutant Aditya Haasan, EPIC – FIRST SEMESTER is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios.
EPIC – FIRST SEMESTER is set to hit theatres worldwide on September 11, 2026.










