• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, September 1, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

Maari by Maari
September 1, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

Share and Enjoy !

Shares
Twitter

“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా(Pranay Reddy Vanga)

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga) వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా ఈ నెల 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

– సినిమా ప్రొడక్షన్ సీరియస్ గా చేయాలని టీమ్స్ ను పెట్టుకుని చేసే మైండ్ సెట్ లో మేము లేము. గతంలో కొన్ని కథలు విన్నాము. అవి మా సెన్సబిలిటీస్ కు దగ్గరగా లేవని వదిలేశాం. ఈ కథలో హ్యూమర్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మధ్యలో జరిగే సరదా సీన్స్ ఉన్నాయి. ఇది బాగుంటుందని అనిపించి టేకప్ చేశాం. డైరెక్టర్ వేణుగోపాల్ మాతో మూడు నాలుగేళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ కూడా మమ్మల్ని ఆకట్టుకుంది.

– డైరెక్టర్స్ గా సందీప్ కు, వేణుగోపాల్ కు నార్త్ సౌత్ పోల్స్ అంత  డిఫరెన్స్ ఉంది. ఒక కామన్ గ్రౌండ్ లో వేణు చెప్పిన కథ మాకు బాగా నచ్చింది. ఒక సీన్ చేసుకుని రమ్మని చెప్పాం. ఆయన బాగా తెరకెక్కించాడు. ఆ సీన్  ఔట్ పుట్ చూశాక సినిమా బాగా చేస్తాడనే నమ్మకం కలిగింది. ఇది క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ నేపథ్యంగా సినిమా సాగుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు, అతని లైఫ్ లో ఏం జరిగింది, అతని ప్రేమ కథ ఎలా సాగింది. వాళ్ల ఫ్రెండ్స్ లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి అనేది ఓవరాల్ గా మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. 2 గంటల 20 నిమిషాల సినిమా టైమ్ తెలియకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా జోవియల్ గా వెళ్తుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. వాసుకి తన మ్యూజిక్ తో ఈ కథను బాగా బ్లెండ్ చేశాడు. బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. మా సినిమాల్లో మ్యూజిక్ కు మంచి పేరొచ్చింది. ఈ సినిమా కూడా అలాగే మ్యూజికల్ గా ఆకట్టుకుంటుంది.

– ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాక సందీప్ సినిమా విషయంలో జోక్యం కలుగజేసుకోలేదు. ఆయన స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. మా సినిమాకు సెన్సార్ నుంచి యు బై ఎ సర్టిఫికెట్ వచ్చింది. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి మా మూవీ ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నాకు కామెడీ మూవీస్ ఇష్టం. బాగుంటే రిపీటెడ్ గా చూస్తుంటా.

– ఈ సినిమాలో నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఏం జరుగుతుంది అనేది డైరెక్టర్ వేణుగోపాల్ బాగా క్యాప్చర్ చేశారు. ఎక్కడా ఫోర్స్ ఫుల్ గా కామెడీ ఉండదు. సహజంగా, ఆర్గానిక్ గా ఉంటూ నవ్విస్తుంది. వేణుగోపాల్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ డైరెక్టర్. ఈ సినిమాకు మేము ఇంకొంత ఎక్కువ ఖర్చు పెడతాం అన్నా వద్దు ఇంత ఇవ్వండి చాలు అన్నాడు. అలాగే కంప్లీట్ చేశాడు.

– అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. మన సంప్రదాయాలు, పద్ధతులు, మన ప్రజల నమ్మకాల నేపథ్యంలో మనకు సెన్సార్ రూల్స్ పెట్టారు. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిలింమేకర్స్ ముందే జాగ్రత్తపడతారు. సెన్సార్ రూల్స్ కూడా తరుచూ అప్డేట్ అవుతూ ఉంటాయి.

– మా మూవీలో హీరో హీరోయిన్స్ ఇద్దరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. ఫ్రెండ్స్ గా చేసిన వాళ్లు, ఇతర కీ రోల్స్ లో నటించిన వాళ్లంతా బాగా నటించారు. టెక్నీషియన్స్ కూడా కొత్త వాళ్లే. వాళ్లు కూడా ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ చేశాం. హైదరాబాద్ బేస్డ్ గా సినిమా కథ సాగుతుంటుంది. అయితే స్లాంగ్ అందరికీ అర్థమయ్యేలా మనం మాట్లాడుకున్నట్లు ఉంటుంది.  

– సందీప్ ఎప్పుడూ తన వర్క్ లో బిజీగా ఉంటాడు. యానిమల్(Animal) మూవీ రిలీజ్ అయ్యాక రిలాక్స్ కావడానికి కొంత టైమ్ దొరికింది. ప్రస్తుతం మరో రెండు కథలు విన్నాం. కానీ అవి ఇంకా పేపర్ మీద ఉన్నాయి. మా ఫోకస్ అంతా స్పిరిట్(Spirit) మీదే ఉంది. అది కంప్లీట్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. నెక్ట్స్ ఇయర్ అర్జున్ రెడ్డి(Arjun Reddy) రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. ఆ సందర్భంగా కొన్ని సీన్స్ యాడ్ చేసి రీ రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. టి సిరీస్ వాళ్లు నైస్ పీపుల్. వాళ్లతో సక్సెస్ ఫుల్ గా మా కొలాబ్రేషన్ సాగుతోంది. వాళ్లకు మాపై నమ్మకం ఉంది. స్పిరిట్ సినిమా 40 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 40 డేస్ ప్రభాస్(Prabhas) గారు వర్క్ చేశారు. మంచి స్క్రిప్ట్స్ వస్తే చిన్న చిత్రాలు తప్పకుండా నిర్మిస్తాం.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో నందు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

“రోమాంచకం”(Romanchakam) యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనింగ్ మూవీ  – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా

by Maari
September 1, 2026
0

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో నందు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్యఅతిథులుగా హాజరైన హీరో నందు, వంశీ నందిపాటి, శశికిరణ్ టిక్క

by Maari
September 1, 2026
0

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

చిరంజీవి ‘వేట’ టైటిల్‌తో సందీప్ సరోజ్ కొత్త సినిమా.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్

by Maari
August 31, 2026
0

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

by Maari
August 31, 2026
0

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

ఈటీవీలో సరికొత్త దృశ్యకావ్యం: నేటి నుంచే ‘సీతారామయ్య గారి మనవరాలు’ మెగా సీరియల్ ప్రారంభం

by Maari
August 31, 2026
0

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నం.39.. ప్రతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కథ

by Maari
August 31, 2026
0

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

by Maari
August 31, 2026
0

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

ప్రీమియర్స్ నుంచే “రోమాంచకం” పెద్ద హిట్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ

by Maari
August 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.