కొత్త యువకులను హీరోగా పరిచయం చేసేటప్పుడు వారిని కచ్చితంగా ప్రేమ కథతోనే వెండితెరకు పరిచయం చేస్తారు. ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ టాప్ హీరోలంతా ఇలాంటి కథలతోనే బిగ్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. తాజాగా నాగార్జున పర్సనల్ మేకప్ మెన్ కుమారుడు తేజ్ బొమ్మదేవర కూడా అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతోనే ‘మాధవే మధుసూదన’అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి బొమ్మదేవర రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో కొత్త అమ్మాయి రిషికి లొక్రే హీరోయిన్ గా నటించు. సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ స్వచ్ఛమైన ప్రేమకథాచిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించిందో చూద్దాం పదండి.
కథ: లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేసే మధు(తేజ్ బొమ్మదేవ)… తల్లిదండ్రుల సూచన మేరకు ఆఫీస్ బాధ్యతలను చూసుకోవడం కోసం బెంగుళూరుకు బయలుదేరుతాడు. అక్కడ మార్గం మధ్యలో ఆరాధ్య(రిషికి లొక్రే)ను చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా మధును ఇష్టపడుతుంది. అతన్ని వెంటాడుతూ వుంటుంది. అయితే ఆమె అంతలా మధుని ప్రేమించడానికి కారణం ఏమిటి? అసలు ఆరాధ్య ఎవరు? ఆమె గతం ఏమిటి? మధుకి… ఆరాధ్యకు మధ్య అంత గాఢమైన ప్రేమ ఉండటానికి కారణం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: గతంలో ప్రేమకథతో వచ్చిన సినిమాలు చాలానే చూశాం. అయితే గత జన్మలో విడిపోయిన ప్రేమికులు… ఈ జన్మలో ఎక్కడో ఒకచోట పుట్టి… మళ్లీ వారి మధ్య ప్రేమ చిగురించి… గత జన్మల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం లాంటి ఫాంటసీ కథలను చూసి… ఎగ్జైట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే. అయితే ఈ చిత్రంలో కేవలం హీరో మాత్రమే అలా ఏదో ఒక చోట తిరిగి జన్మిస్తాడు. అతన్ని ఎంతగానో ప్రేమించిన ప్రేయసికి మాత్రం జన్మ ఉండదు.. కేవలం ఆత్మ మాత్రమే కల్పోయిన ప్రియుడికోసం వెతుకుతూ… తన ప్రియుడిని మరో జన్మలో పొందడం అనేది కొత్త కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో సరదాగా తిరిగే యువకుని పాత్రలో కనిపించి… సెకెండాఫ్ లో మాత్రం ఓ స్వచ్ఛమైన ప్రేమకోసం తపించే యువకుని పాత్రలో మెప్పించారు. హీరో… హీరోయిన్ల మధ్య ద్వితీయార్థంలో వచ్చే లవ్ ట్రాక్ మనసుకు హత్తుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదరింది. నిజయతీగల ప్రేమకోసం తపించే ఇద్దరూ… చక్కగా ఒదిగిపోయి నటించారు. ఓ డెబ్యూ హీరో, హీరోయిన్లను ఎంత అందంగా చూపించారో అంతే అందమైన ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు.
ఇందులో హీరోగా నటించిన తేజ్, రిషిక లొక్రే ప్రేమకథలో చక్కగా ఒదిగిపోయారు. తేజ్… సరదా సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించాడు. డ్యాన్స్, డైలాగు డెలివరీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కూడా క్యూట్ గా పక్కింటి అమ్మాయిలా ఉంది. పల్లెటూరి సంప్రదాయమైన దుస్తుల్లో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బొమ్మదేవర రామచంద్ర రావు ఎమోషనల్ సీన్లలో బాగా నటించారు. హీరో తండ్రిపాత్రలు పోషించిన సుమన్, జయప్రకాశ్ లు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. హీరో ఫ్రెండ్స్ పాత్రలు పోషించిన వారు బాగానే చేశారు.
దర్శకుడు రాసుకున్న కథలో కొత్తదనం ఉంది. ఇలాంటి ప్లాట్ ను ఓ డెబ్యూ హీరోకు ఎంచుకోవడం కరెక్ట్. హీరోపై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు కాబట్టి… క్లైమాక్స్ ముగింపునకు ఈ ప్లాట్ కరెక్టే అనిపిస్తుంది.
సంగీతం బాగుంది. బిగ్ స్క్రీన్ పై పాటల చిత్రీకరణ అందంగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఇద్దరి జంటను చాలా అందంగా చూపించారు. ప్రేమకథకు కవాల్సిన సంభాషణలు మనసుకు హత్తుకునేలా రాశారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. ప్రేమకథలను ఇష్టపడేవారు ఈవారం ఈ సినిమాను చూసేయొచ్చు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3