• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా “అభినవ్”

admin by admin
March 24, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా “అభినవ్”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. ఆయన శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల చిత్రం “అభినవ్ “(chased padmavyuha). ఈ చిత్రంలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

*దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ* – మన సమాజానికి జాఢ్యంలా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు అనేది ఈ చిత్రంలో చూడబోతున్నారు. తన స్నేహితులతో కలిసి అభినవ్ చేసిన సాహసాలు ఆకట్టుకుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించాను. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించింది. ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు. మన దేశం ఆర్థికంగా వెనకబాటుకు పిల్లల్లో అక్షరాస్యత లేకపోవడం కూడా కారణం. పిల్లలను బాగా చదివించడం ద్వారా మన దేశాన్ని అగ్రగామిగా నిలపవచ్చు. ఇలాంటి అంశాలన్నీ అభినవ్ చిత్రంలో చూపిస్తున్నాం. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అభినవ్ చిత్రాన్ని విద్యార్థులకు చూపించడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు కలిగించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో 30 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న మంత్రి శ్రీ కొండా సురేఖ గారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందించడం సంతోషంగా ఉంది అన్నారు.

నటీనటులు – స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర, తదితరులు

టెక్నికల్ టీమ్ – కెమెరా – సామ‌ల భాస్క‌ర్‌, సంగీతం – వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, ఎడిట‌ర్ – నంద‌మూరి హ‌రి, పీఆర్ఓ – చందు రమేష్, సమర్పణ – శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్, బ్యానర్ – సంతోష్ ఫిలిమ్స్, నిర్మాత, దర్శకత్వం – భీమగాని సుధాకర్ గౌడ్.

“Abhinav” – A Film for a Drug-Free Society

After receiving national and international recognition for meaningful children’s films like Aditya, Vicky’s Dream, and Dr. Gautam, director-producer Bheemagani Sudhakar Goud is now bringing another socially relevant film, Abhinav (Chased Padmavyuha). Produced under the Santosh Films banner and presented by Srilakshmi Educational Charitable Trust, this children’s film aims to raise awareness about the growing drug menace in society.

Starring Sammetha Gandhi, Satya Erra, Master Gagan, Geeta Govind, Abhinav, Charan, and Baby Akshara, the film is scheduled for release on November 14, on the occasion of Children’s Day.

Press Meet Highlights

At a press meet held at Hyderabad Film Chamber, director-producer Bheemagani Sudhakar Goud emphasized the serious issue of drug addiction among students. He pointed out that the drug mafia is deliberately targeting students, which could be part of an international conspiracy. He also highlighted how the marijuana mafia is expanding in rural areas.

Inspired by his grandfather, freedom fighter Narayana Rao, the story of Abhinav follows a brave young boy who takes a stand against the drug mafia in his village. The film showcases his daring efforts, along with his friends, to put an end to these illegal activities.

He also mentioned that Telangana Chief Minister Revanth Reddy had urged filmmakers to create short films promoting a drug-free society. In response, Abhinav was made with the goal of educating children about the dangers of drug addiction and the importance of discipline through NCC, Scouts, Yoga, and Meditation.

Sudhakar Goud further stated that illiteracy and lack of education are major reasons for the country’s economic setbacks. By ensuring children receive proper education, India can move towards progress.

The film aims to instill positive values in young minds, encouraging them to stay away from harmful habits. The team is working hard to complete the film on time for its Children’s Day release.

Additionally, he expressed his happiness about Minister Konda Surekha, who has been in politics for 30 years, receiving the Lifetime Achievement Award, inspired by the warrior queen Rani Rudrama Devi.

Cast

Sammetha Gandhi
Satya Erra
Master Gagan
Geeta Govind
Abhinav
Charan
Baby Akshara

Technical Team

Cinematography – Samala Bhaskar

Music – Vandemataram Srinivas

Editing – Nandamuri Hari

PRO – Chandu Ramesh

Presented by – Srilakshmi Educational Charitable Trust

Banner – Santosh Films

Producer & Director – Bheemagani Sudhakar Goud

Abhinav is expected to leave a lasting impact on students, motivating them to make informed choices and contribute to a healthier society.

Previous Post

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

Next Post

దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ‘షష్టిపూర్తి’ సాంగ్

Next Post
దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ‘షష్టిపూర్తి’ సాంగ్

దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన 'షష్టిపూర్తి' సాంగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.