దర్శకుడు నీలకంఠ మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు. ఆడియన్ పల్స్ తెలిసిన చాలా అరుదైన దర్శకుల్లో ఆయన ఒకరు. గతంలో ఆయన తీసిన చిత్రాలు ఆడియన్స్ ని ఎంత బాగా ఎంగేజ్ చేశాయో మనకు తెలిసిందే. అలాంటి దర్శకుడు తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని మెప్పించడానికి ‘సర్కిల్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి
కథ: ఛాయాచిత్ర గ్రాహకునిగా పనిచేసే కైలాష్(సాయి రోనక్)ని చంపడానికి ఓ కాంట్రాక్ట్ కిల్లర్ (కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్) వెంటాడుతూ ఉంటారు. ఈ కాంట్రాక్ట్ కిల్లర్ తనని ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలియక కైలాష్ సతమతమవుతూ ఉంటాడు. అయితే తనకున్న ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్… అరుంధతి(రిచా పనై), మాళవిక (నయన), హిమానీ రాజ్‌పుత్ (అర్షిన్ మెహతా) … వీరిలో ఎవరో ఒకరు తనని చంపడానికి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ కి కాంట్రాక్ట్ ఇచ్చుంటారని కైలాష్ అనుమానిస్తాడు. ఇలా అనుమానం వచ్చిన కైలాష్… చివరకు ఏమి చేశాడు? తనను చంపాలని ఎవరు అనుకున్నారు? కాంట్రాక్ట్ కిల్లర్ పుత్తూరు గణేష్ ప్రిన్సిపుల్ ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: వైవిధ్యమైన కథా కథనాలతో రొమాంటిక్ క్రైం థ్రిల్లర్స్ ని వెండితెరపై ఆవిష్కరిస్తే… ప్రేక్షకులు బాగా ఎంగేజ్ అవుతారు. ఇలాంటి స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి కూడా. అందుకే డెబ్యూ దర్శకుల నుంచి అనుభం వున్న దర్శకుల వరకూ ఇలాంటి సింపుల్ కథలను ఎంచుకుని… కాస్త తెలిసిన ప్యాడింగ్ తోనే క్రైం థ్రిల్లర్స్ ని ఇంట్రెస్టింగ్ గా తెరమీద చూపిస్తున్నారు. తాజాగా సీనియర్ దర్శకుడు నీలకంఠ కూడా ఇదే చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఒక రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ ని తీసి… ఆడియన్స్ ని మెప్పించారు. ఒక యువ హీరో… ముగ్గురు అందమైన యువతుల మధ్య అల్లుకున్న ఈ రొమాంటిక్ క్రైం కథ.. కథనాలు ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఈ వీకెండ్ లో ఇలాంటి జోనర్ ఇష్టపడే వారు సరదాగా చూసెయెచ్చు.
ఎవరు ఎలా చేశారంటే…
యువ సాయి రోనక్ ఛాయాచిత్ర గ్రాహకునిగా మెప్పించాడు. గతంలో కూడా లవర్ బాయ్ గా మెప్పించిన సాయి… ఈ చిత్రంలోనూ మూడు డిఫరెంట్ గెటప్ లతో మూడు లవ్ స్టోరీలకోసం ఎంతో శ్రమపడ్డాడు. రిచా పనయ్, సాయి రోనక్ ల మధ్య రొమాంటి క్ సీన్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి. రిచా అందం గతంలో కూడా చూశాం. ఇందులో కూడా అరుంధతి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే యువ నటి నయన లవ్ స్టోరీకి బాగా యాప్ట్ అయింది. సాయి, నయన ట్రాక్ చాలా క్రిస్పీగా… ఆకర్షణీయంగా… ఆకట్టుకునే విధంగా ఉంది. అర్షిన్ మెహతా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఉత్తరాది అమ్మాయిగా నటించి మెప్పించింది. కాంట్రాక్ట్ కిల్లర్ గా ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేం బాబా భాస్కర్ ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే…
ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎన్ఎస్ ప్రసు ఓకే అనిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముగ్గురు ముద్దుగుమ్మలను తన కెమెరాలో అందంగా బంధించి… తెరపై చూపించాడు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాతలు ఎం.వి శరత్ చంద్ర, టి.సుమలత అన్నీత్ రెడ్డి, వేణుబాబు ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3