• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, June 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నా సినీ కెరీర్లో ‘అరి’ లాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది – సాయికుమార్

Maari by Maari
October 9, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
నా సినీ కెరీర్లో ‘అరి’ లాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉంది – సాయికుమార్

Share and Enjoy !

Shares
Twitter

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పలువురు రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల మాట్లాడుతూ – అరిషడ్వర్గాల నేపథ్యంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించాడు. కథ విన్నప్పుడే ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా కాన్సెప్ట్ ను ఎంతోమంది పెద్దవాళ్లు ప్రశంసిస్తున్నారు. మూవీకి థియేటర్స్ లో మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ – ‘అరి’ లాంటి చిత్రాన్ని మనమంతా సపోర్ట్ చేయాలి. మంచి కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఈవెంట్ కు వెంకయ్యనాయుడు, చినజీయర్ స్వామి లాంటి పెద్దలు వస్తే ఇంకా బాగుండేది. నేను హీరోగా నటించిన ఇండియన్ ఫైల్స్ అనే సినిమాను మన భారత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాం. ప్రేక్షకులు ‘అరి’ సినిమాను ఆదరించి వారి ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ – అరిషడ్వర్గాల వల్ల కలిగే ఉద్రేకాల వల్లే మనిషి చెడిపోతాడు. అలాంటి అరిషడ్వర్గాల ఆధారంగా జయశంకర్ సినిమా రూపొందించడం అభినందనీయం. ఇది సమాజానికి మంచి చేస్తుంది కాబట్టే సినిమా కార్యక్రమానికి వచ్చాం. అరి సినిమా చూడండి ఆ హరికి దగ్గరవ్వండి. అన్నారు.

ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ – మనమంతా మనుషులం కాబట్టి అరిషడ్వర్గాలు ఉంటాయి. వాటిని పూర్తిగా వదిలేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వీలైనంత తగ్గించుకుంటే మంచిది. మన సమాజం చేయాల్సిన అలాంటి ప్రయత్నానికి ఈ ‘అరి’ సినిమా తోడ్పడాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని మూవీస్ చేస్తారు. కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. అన్నారు.

ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ – మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్ర దర్శక నిర్మాతలకు మంచి పేరు గుర్తింపు ఈ సినిమా తీసుకొస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ – ‘అరి’ లాంటి సినిమాలు మన సమాజానికి అవసరం. పెడదారి పడుతున్న యువతను ఇలాంటి మూవీస్ మంచి మార్గంలో వెళ్లేలా చేస్తాయి. సందేశాత్మక చిత్రాల ద్వారానే మన ప్రేక్షకులకు మంచిని చెప్పడం సాధ్యమవుతుంది. అన్నారు.

మినిస్టర్ జి. వివేక్ మాట్లాడుతూ – డైరెక్టర్ జయశంకర్ మా పెద్దపల్లి నియోజకవర్గానికి చెందినవారు. ఆయన గతంలో పేపర్ బాయ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అరిషడ్వర్గాల ఆధారంగా ‘అరి’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది కొత్త కాన్సెప్ట్. ఈ చిత్రంలో నటించిన సాయికుమార్ గారు నాకు మంచి మిత్రులు. మనందరిలో అరిషడ్వర్గాలు ఉంటాయి. అయితే వాటిని సాధ్యమైనంత నియంత్రించుకోవాలి. సినిమా బిజినెస్ అంటేనే రిస్క్. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలి. తగినన్ని ప్రోత్సహాకాలు ఇస్తూ మన చిత్ర పరిశ్రమను కూడా కాపాడుకోవాలి, అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి. అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – అరిషడ్వర్గాల ఆధారంగా దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించారు. ఎలా చెబితే యూత్ కు సందేశం చేరుతుందో అలా ఈ సినిమాను తెరకెక్కించారు. యూఎస్ లో ఉండే ప్రొడ్యూసర్స్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ టీమ్ అందరికీ ‘అరి’ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత దామోదరప్రసాద్ మాట్లాడుతూ – ‘అరి’ సినిమా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా రూపొందించారు కాబట్టి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..ఇప్పుడు పర్పెక్ట్ రిలీజ్ కు వస్తోంది. కంటెంట్ బాగున్న ప్రతి సినిమా ఆదరణ పొందుతుంది. అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

యాక్టర్ వినోద్ వర్మ మాట్లాడుతూ – దర్శకుడు జయశంకర్, నేను గతంలో ఓ షార్ట్ ఫిలిం చేశాం. దానికి మంచి పేరొచ్చింది. ‘అరి’ సినిమాలో కీ రోల్ చేయాలని నన్ను పిలిచాడు. ఈ మూవీలో ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపించాలని అన్నాడు. అలాగే మూడు పేజీల డైలాగ్స్ కూడా చెప్పాను. సాయి కుమార్ లాంటి యాక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం భయమేసింది. మనలోని భావోద్వేగాలను నియంత్రించుకోవాలనే మంచి కాన్సెప్ట్ ను ఎంటర్ టైనింగ్ రూపొందించాడు జయశంకర్. మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘అరి’ సినిమాను కూడా మీరు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం. అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ – మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే పాయింట్ తో దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమాను రూపొందించారు. మాకు సింగిల్ లైన్ లో ఆయన చెప్పిన కథ నచ్చి ఈ మూవీని నిర్మించాం. మనలోనే అరిషడ్వర్గాలు అనే శత్రువులు ఉంటాయి. వాటిని జయించినప్పుడే గొప్ప స్థాయికి వెళ్తాం. ‘అరి’ సినిమా నిర్మాణంలో భాగమైన నా తోటి నిర్మాతలకు థ్యాంక్స్. మా మూవీని తెలుగు ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి అనసూయ మాట్లాడుతూ – ‘అరి’ సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆంథాలజీ తరహాలో సాగే చిత్రమిది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూడాలి. మంచి సందేశం, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ‘అరి’ చిత్రాన్ని మీరు చూసి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – డైరెక్టర్ జయశంకర్ ‘అరి’ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేశాం. ఈ మూవీలో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. వారిలో సాయి కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ‘అరి’ లాంటి మూవీ చేయడం సులువు కాదు. నిర్మాతలకు నా అభినందనలు చెబుతున్నా. మనలోని వీక్ నెస్ లను ఓవర్ కమ్ చేయాలని చెప్పే మంచి చిత్రమిది. ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ కాకూడదు అని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ జయశంకర్ మాట్లాడుతూ – ‘అరి’ సినిమా మనల్ని మనం చూసుకునే అద్దం లాంటిది. అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ను ఎంతోమంది సద్గురులను కలిసి ఒక ఎంటర్ టైనింగ్ గా ఈ చిత్రంలో రూపొందించాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక, ఆ పాత్ర నేనే కదా అనే ఫీల్ కలుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. మా ప్రొడ్యూసర్ ఆర్వీ రెడ్డి గారు లేకుంటే అరి సినిమా లేదు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తో ఆయన ట్రావెల్ అవుతూ మమ్మల్ని నడిపిస్తున్నారంటే ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్ ను అర్థం చేసుకోవచ్చు. అరి సినిమా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిమ్మప్ప నాయుడు గారు వచ్చి ఆదుకున్నారు. మా చిత్రంలోని ఆరు పాత్రల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది సాయికుమార్ గారిని. ఆయన పర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. అలాగే నా స్నేహితుడు వినోద్ వర్మకు ఈ చిత్రంతో మంచి పేరొస్తుంది. అన్నారు.

యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ – పురాణ ఇతిహాసాల గురించి చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పేది. జయశంకర్ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా అని చెప్పిప్పుడు కొత్తగా అనిపించింది. ఆరు పాత్రలతో జయశంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా ఆరు పాత్రలు ఎక్కడా కలవవు. అందుకే మీతో పాటు నేను కూడా థియేటర్ లో ఈ సినిమా ఎలా వచ్చిందో చూడాలని అనుకుంటున్నా. నా 50 ఏళ్ల నట జీవితంలో అరి లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ఈ సినిమాకు కనిపించే మూడు సింహాల్లాంటి ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. కనిపించని నాలుగో సింహం లాంటి ప్రొడ్యూసర్ మా ఆర్వీ రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. వినోద్ వర్మ నటన ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ బాగుంది. ఇతర క్రూ అంతా కష్టపడి పనిచేశారు. ఈ మధ్య గంగాధర శాస్త్రి గారి భగవద్గీతకు వచనం చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ప్రాజెక్ట్ కు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 108 శ్లోకాలకు తెలుగు వెర్షన్ చెప్పాను. అలాగే జీఎంఆర్ వాళ్లు భగవద్గీతను తెలుగులోకి తీసుకొస్తూ నన్నే వాయిస్ చెప్పమన్నారు. అలా ఈ మధ్య నాపై శ్రీకృష్ణుడు దయ చూపిస్తున్నాడు. మనం ఆధునికంగా ఎంత ఎదిగినా మన నాగరికత మర్చిపోకూడదు. ఒక మంచి సందేశాన్ని సినిమా అనే పవర్ ఫుల్ మీడియా ద్వారా చెబుతున్నాం. పెద్దలంతా మా మూవీని ఆశీర్వదించారు. వెంకయ్య నాయుడు గారు మోడరన్ భగవద్గీత అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – వినోద్ వర్మ , అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు

టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ – భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి. ఆర్. ఓ – జి యస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ : రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి )
కో ప్రొడ్యూసర్ – లింగ గుణపనేని
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి
రచన –దర్శకత్వం : జయశంకర్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘మిత్ర మండలి’ థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరిని నవ్విస్తుంది – హీరోయిన్ నిహారిక ఎన్ ఎం

Next Post

విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న బైసన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Next Post
విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న  బైసన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న బైసన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

by Maari
June 1, 2026
0

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

by Maari
June 1, 2026
0

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్

by Maari
May 31, 2026
0

ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “సాV3” మూవీ…

ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “సాV3” మూవీ…

by Maari
May 31, 2026
0

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్

by Maari
May 31, 2026
0

భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్.మహానంది గ్లోబల్ అవార్డు

భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్.మహానంది గ్లోబల్ అవార్డు

by Maari
May 29, 2026
0

Trikala Movie Review: ఆకట్టుకునే డార్క్ ఫాంటసీ చిత్రం… త్రికాల

Trikala Movie Review: ఆకట్టుకునే డార్క్ ఫాంటసీ చిత్రం… త్రికాల

by Maari
May 29, 2026
0

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

by Maari
May 27, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.