• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ట్రైలర్ రిలీజ్

admin by admin
October 5, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, special, sports
0
సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ట్రైలర్ రిలీజ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

డిఫరెంట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ సినిమా ట్రైలర్ రిలీజ్

ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిసి ఓ డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా ‘అరి’ ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒక లైబ్రరీ, అక్కడ రివీల్ అయ్యే ఏడు జీవితాలను ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. ‘అరి’ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ‘ భూలోకంలో జన్మించాలని శ్రీకృష్ణుడు సంకల్పించగానే ఆ విషయం స్వర్గ లోకంలో తెలిసి ఆరుగురు దేవతలు తమనూ భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు, అవే అరిషడ్వర్గాలు – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..’ అనే డైలాగ్ తో ‘అరి’ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరి కోర్కెలు తీర్చబడును అని ఓ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెలువడిన ప్రకటన చూసి సినిమాలోని ప్రధాన పాత్రధారులు వచ్చి తమ కోర్కెలు చెబుతుంటారు. ఈ ప్రపంచంలో మనషులందరిలో ఉండే అరిషడ్వర్గాలకు వారి కోర్కెలు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ పాత్రధారుల నేపథ్యం ఏంటి ?, అందరి కోర్కెలు తీర్చే బాధ్యతను తీసుకున్నది ఎవరు ?,ఎందుకు ?, తన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఇచ్చే టాస్క్స్ ఏంటి ? అనేది థియేటర్స్ లో చూడాల్సిందే. ‘ పరిత్రాణాయ సాధూనాం..’ అనే భగవద్గీత శ్లోకంతో ట్రైలర్ ఆసక్తికరంగా పూర్తవుతుంది.

నటీనటులు – వినోద్ వర్మ , అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు

టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ – భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి. ఆర్. ఓ – జి యస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సమర్పణ : రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి )
కో ప్రొడ్యూసర్ – లింగ గుణపనేని
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి
రచన –దర్శకత్వం : జయశంకర్

Tags: AriAri Movie Telugu Trailer
Previous Post

“కానిస్టేబుల్” ఐటమ్ సాంగ్ అదరహో …!!!

Next Post

10న థియేటర్లలో విడుదల కానున్న “బల్టీ” చిత్రం

Next Post
10న థియేటర్లలో విడుదల కానున్న “బల్టీ” చిత్రం

10న థియేటర్లలో విడుదల కానున్న "బల్టీ" చిత్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”

by admin
October 26, 2025
0

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్`  ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

`గీతా సుబ్ర‌మ‌ణ్యం` ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా `ఎ క‌ప్ ఆఫ్ టీ`..`వాట్ హాపెండ్` ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

by admin
October 26, 2025
0

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

HK పర్మనెంట్ మేకప్ క్లినిక్‌ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్న తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు

by admin
October 26, 2025
0

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

“స్కై” నుంచి ‘పోయేకాలం నీకు’ లిరికల్ సాంగ్ రిలీజ్

by admin
October 24, 2025
0

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

కొలువుదీరిన టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

by admin
October 24, 2025
0

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

ఈ నెల 25న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్

by admin
October 23, 2025
0

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

‘మాస్ జాతర’ చిత్రం నుండి మాస్ గీతం ‘సూపర్ డూపర్‌’ విడుదల

by admin
October 22, 2025
0

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

‘లవ్ ఓటీపీ’ చిత్రం థియేటర్లో అందరినీ అలరిస్తుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

by admin
October 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.