• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, May 21, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

Maari by Maari
March 16, 2026
in Cinema, Latest News, Movies, news
0
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక ఫ్యామిలీ సినిమా.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. వింటేజ్ పవర్ స్టార్‌ని చూస్తారు. : కథానాయిక రాశి ఖన్నా

Share and Enjoy !

Shares
Twitter

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక రాశి ఖన్నా, ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ప్రస్తుతం మీ జీవితం ఎలా ఉంది? ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
నా జీవితం ఇప్పుడు చాలా బిజీగా ఉంది. నిజం చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నా కల నెరవేరింది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను.

పవన్ కళ్యాణ్ గారితో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
పవన్ గారు చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని ఆయనతో చెప్పాను. ఆయన తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ గారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ గారి అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది.

దర్శకుడు హరీష్ శంకర్ గారి గురించి ఏం చెప్తారు?
హరీష్ శంకర్ గారు చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. సాధారణంగా 120 రోజులు పట్టే షూటింగ్‌ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్‌లోనే పంచ్‌ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. హరీష్ గారికి ఓపిక ఎక్కువ. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను.

ఇద్దరు హీరోయిన్లు (శ్రీలీల, మీరు) ఉండటం వల్ల స్క్రీన్ స్పేస్ తగ్గుతుందని అనిపించలేదా?
మా ఇద్దరికీ కలిసి సన్నివేశాలు లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి.

పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కి తగ్గట్టుగా మీరు డేట్స్ ఇవ్వాలి కదా.. ఏమైనా ఇబ్బంది పడ్డారా?
పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ గారు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?
సినిమా కోసం ప్రాణం పెట్టే నిర్మాతలు వాళ్ళు. బడ్జెట్ విషయంలో రాజీ పడరు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. మైత్రి బ్యానర్ లో పని చేసే వాతావరణం చాలా బాగుంటుంది. ఆ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఎలా ఉండబోతుంది?
‘గబ్బర్ సింగ్’ లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు.

మీ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి చెప్పండి?
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ గారితో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్‌ సిరీస్ లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను, అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్ లో ‘రౌడీ అండ్ కో’ చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నాను.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక

Next Post

పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

Next Post
పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

పలు భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

by Maari
May 19, 2026
0

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

by Maari
May 19, 2026
0

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

చిన్న హీరో – పెద్ద సహాయం నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

by Maari
May 19, 2026
0

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

by Maari
May 17, 2026
0

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్

by Maari
May 16, 2026
0

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్.. నటుడు ప్రదీప్ కొట్టె

by Maari
May 16, 2026
0

సందడిగా   డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

సందడిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ ” ప్రదానం

by Maari
May 11, 2026
0

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

by Maari
May 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.