• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మైథలాజికల్ కంటెంట్ తో సరికొత్త థ్రిల్ నిస్తుంది: హీరో శివ కందుకూరి

admin by admin
February 29, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’  మైథలాజికల్ కంటెంట్ తో సరికొత్త థ్రిల్ నిస్తుంది: హీరో శివ కందుకూరి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శివ కందుకూరి విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలని పంచుకున్నారు.

మీకు ఇది తొలి డిటెక్టివ్ సినిమా కదా..ఈ అనుభవం గురించి చెప్పండి ?
క్రైమ్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ తెలుగులో చాలా వచ్చాయి. డిటెక్టివ్ అనేసరికి చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి జోనర్ సినిమా చేయాలనుకున్నపుడు ఏదో యునిక్ నెస్ వుంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సినిమాలో భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాను. ఇందులో ఒక మైథాలజీ ఎలిమెంట్ వుంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు వుందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దిని గురించి పురాణాల్లో ఒక కథ వుంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం వుంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే నమ్మకం వుంది.

డిటెక్టివ్ అంటే బ్లాక్ నడ బ్లాక్ చూపిస్తుంటారు.. ఇందులో మాత్రం పంచెకట్టు, లుంగీలో కనిపిస్తున్నారు ?
దర్శకుడు పురుషోత్తం రాజ్ గారిది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో వున్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారు. ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య వుండే ఫారెస్ట్ టౌన్ నేపధ్యంలో జరుగుతుంది. ఇందులో డిటెక్టివ్ పాత్రని కూడా అక్కడ వున్న ఓ సహజసిద్దమైన పాత్రలానే డిజైన్ చేశారు. దీంతో వరల్డ్ బిల్డింగ్ లో ఒక ఫ్రెష్ నెస్ వచ్చింది.

ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం జరగడానికి కారణం ?
వీఎఫ్ఎక్స్ వర్క్ వుండే సినిమా ఇది, మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది, ఈ కథ, సినిమాపై వున్న నమ్మకం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మైథాలజీకల్ థ్రిల్లర్ జోనర్స్ ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రావడం మంచి పరిణామం అనిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు. ఒక నటుడిగా ఇది నాకు ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని విడుదల చేస్తుండటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది.

భూతద్ధం భాస్కర్ నారాయణ టైటిల్ పెట్టడానికి కారణం ?
ఇందులో నా పేరు భాస్కర్ నారాయణ. ఆ పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు వుంటాయి. దీంతో అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా వుంది. అయితే కథలో భాగమైయ్యే వుంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే వుంటుంది.

హీరోయిన్ రాశీ సింగ్ గురించి ?
ఇందులో కథానాయిక పాత్రకు తెలుగమ్మాయి అయితే బావుటుందని అనుకున్నాం. ఇలాంటి సమయంలో రాశి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తనది తెలుగు కాకపోయినప్పటికీ తెలుగుని చాలా చక్కగా మాట్లాడగలరు. ప్రతి డైలాగ్ ని కష్టపడి నేర్చుకున్నారు. చాలా అంకితభావంతో పని చేశారు.

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం గురించి ?
శ్రీచరణ్ పాకాల థ్రిల్లర్స్ కి మ్యూజిక్ ఇవ్వడంలో దిట్ట. ఈ సినిమాకి ఆయన నేపధ్య సంగీతం చేయడం చాలా అనందంగా వుంది. మాకు చాలా ప్లస్ అయ్యింది. అద్భుతమైన సౌండ్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ని ఇస్తుంది. అలాగే ఇందులో ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో చేశాం. అది మా ఆర్ట్ డైరెక్టర్ ఆలోచన. యాభై పెయింటింగ్ లు స్కాన్ చేసి ఎఐ లిరికల్ వీడియో చేశాం. తెలుగు చేసిన తొలి ఎఐ లిరికల్ వీడియో కావడం ఆనందంగా వుంది.

మంచి పాత్ర కుదిరినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో నటిస్తారా ?
మంచి కథ, పాత్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య సినిమాలో సెకండ్ లీడ్ గా చేశాను. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.

మీ ఫిల్మ్ జర్నీ ఎలా అనిపించింది ?
ఒక అప్ కమింగ్ యాక్టర్ ఎక్కడ ఫిట్ ఇన్ అవుతారో తెలుసుకోవాలంటే మనల్ని మనం ఎక్స్ ఫ్లోర్ చేసుకోవాలి. ఇప్పటివరకూ ప్రతి సినిమాతో ఓ కొత్త జోనర్ ని చేశాను. చూసి చూడంగానే రొమాంటిక్ ఫిలిం, గమనం సోషల్ డ్రామా, మనుచరిత్ర మాస్ టచ్ వున్న సినిమా. ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. సినిమా కథ, పాత్ర ప్రేక్షకులని హత్తుకోవాలంటే అందులోని ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించగలగాలని ఈ జర్నీలో నేర్చుకున్నాను.

మీకు ఎలాంటి జోనర్స్ ఇష్టం ?
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం. క్రైమ్ కామెడీ ని కూడా ఎంజాయ్ చేస్తాను. ఈ జోనర్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాను.

నాన్నగారు( రాజ్ కందుకూరి) ఈ సినిమా చూశారా ?
చూశారు. ఆయనకి చాలా నచ్చింది. చెప్పినదానికంటే అద్భుతంగా తీశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. నాన్నగారితో కథలు గురించి చర్చిస్తాను. అయితే ఫైనల్ కాల్ మాత్రం నాదే.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపధ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా వుంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా వున్నాయి.

Previous Post

‘తంత్ర’లో అద్భుతమైన కంటెంట్ వుంది: అనన్య నాగళ్ల & టీం

Next Post

మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా

Next Post
మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా

మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.