ఆమని, కొమరక్క ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “బ్రహ్మాండ”. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాంబాబు దాసరి సునీత సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దాసరి సురేష్ నిర్మించారు. సంగీతం వరికుప్పల యాదగిరి అందించారు. రమేష్ రాయి. జి ఎస్ నారాయణ సంభాషణలు సమకూర్చారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
ఇచ్చోళ అనే గ్రామంలో అర్ధ రాత్రి 12 కాగానే హత్యలు జరుగుతూ ఉంటాయి. అలా ఆర్నెల్ల నుంచి వరుస హత్యలు జరిగి సమాధి అవుతుంటాయి. దాంతో ఆ గ్రామంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా ఉంటుంది. ఈ మర్డర్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారుతుంది. దాంతో సాయంత్రం ఆరు గంటలు అవ్వగానే ఎవ్వరూ గ్రామంలో తిరగొద్దని గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఒకానొక సమయంలో ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరను కూడా ఆపేయాలని పోలీసులు భావిస్తారు. మరి ఈ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఆ మర్డర్ మిస్టరీను చేధించారా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: గ్రామీణ నేపథ్యం ఉన్న కళలను వెండితెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. వాటికి కాస్త ఆధ్యాత్మిక కథను జోడిస్తే మరింత ఆదరిస్తారు. అలాంటి గ్రామీణ నేపథ్యం వున్న ఒగ్గు కళాకారుల కథ … కథనాలతో తెరకెక్కిన సినిమా “బ్రహ్మాండ”. ఇది మర్డర్ మిస్టరీతో తెరకెక్కింది. సినిమా మొదలయింది మొదలు… చివరి వరకు వరుస హత్యలతో బెంబేలెత్తి పోయిన గ్రామంలో చివరకు ఏం జరిగిందో అనేది క్లైమెక్స్ లో అద్భుతంగా చూపించారు.
ఆమని ఈ మధ్య కాలంలో ఓ మంచి పాత్రను పోషించారనే చెప్పొచ్చు. బలగం జయరాం తన పాత్రకి న్యాయం చేశారు. కొమరక్క పాత్ర మూవీకే హైలైట్. బాగా గుర్తుండి పోయే పాత్ర చేశారు. బన్నీ రాజు, కనీకా వాధ్వ పాత్రలు ఆకట్టుకుంటాయి. చత్రపతి శేఖర్ ఎప్పటిలాగే తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. నటుడు అమిత్ నటన కూడా మెప్పిస్తుంది. ఇక మిగిలిన పాత్రల్లో దిల్ రమేష్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ కర్తానందం తదితరులు తమ తమ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పొచ్చు.
దర్శకుడు దివంగత రాంబాబు… ఓ గ్రామీణ నేపథ్యం ఉన్న కళకి… ఆధ్యాత్మికతను జోడించి మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ అయింది. ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. గ్రామీణ వాతావరణం బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త బాగా వుండాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. నిర్మాత దాసరి సురేష్ ఎక్కడా వెనుకాడకుండా ఖర్చు చేశారు. గో అండ్ వాచ్ ఇట్…!
రేటింగ్: 3