• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, February 2, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు

Maari by Maari
January 19, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు

Share and Enjoy !

Shares
Twitter

ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి.
ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మనదేశం’ చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధనేత విశ్వనాథ్ ను ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఛైర్మన్ జనార్థన్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం రోజున జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు వస్తారు వెళ్తారు, కానీ ప్రజలకు సేవ చేసిన వారే చిరకాలం గుర్తుంటారు. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. 40 ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఊహించి ముందే చెప్పిన గొప్ప దూరదృష్టి గల నాయకుడు ఆయన. నటుడిగా ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు అన్నారు.
నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ – తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్ వేసిన ముద్ర చెరగనిది. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్ గా, దర్శకుడిగా తెలుగు సినిమా అభివృద్ధికి బాటలు వేశారు. ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆ తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ 75 సంవత్సరాల వేడుక చేయడం సముచితంగా ఉంది. అన్నారు.
నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ – ఎన్టీఆర్ మన మధ్య లేకున్నా, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇవాళ ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, వజ్రాన్ని కూడా సానపట్టాలి. అలా ‘మనదేశం’ సినిమాలో అ‌వకాశం ఇచ్చి ఎన్టీఆర్ ను నటుడిగా మెరుగులు దిద్దింది ఎల్వీ ప్రసాద్, కృష్ణవేణి అమ్మగారని వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని చెప్పారు.
శ్రీమతి కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఇంతమంది పెద్దల సమక్షంలో మేము నిర్మించిన ‘మనదేశం’ చిత్రం 75 సంవత్సరాల వేడుక జరగటం, ఆ సినిమా ద్వారా రామారావుగారిని మేము పరిచయం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా స్వర్ణోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం జరపడం, ఈ సందర్భంగా మాకు సత్కారం చేయడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్వీ ప్రసాద్ గారు ఎంతో కష్టపడి పరిశ్రమలో ఎదిగారు. ఆయన కృషి వల్లే మేము ఇవాళ సినిమా రంగంలో ఒక భాగంగా కొనసాగడమే కాదు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్స్ తో పేద ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం. ఎన్టీఆర్ తో నాన్న గారికి మంచి అనుబంధం ఉండేదని, ఎన్టీఆర్ ను మనమంతా నిత్యం స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు.
పూర్ణా పిక్చర్స్ విశ్వనాధ్ గారు మాట్లాడుతూ రామారావుగారు నటించిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమాను తాము ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేశామని, ఆ తరువాత వారు నటించిన 30కి పైగా సినిమాలు తామై పంపిణీ చేశామని, రామారావుగారి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
నిర్మాతల మండలి తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రామారావు లాంటి మరో నటుడు, నాయకుడు పుట్టరని ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు.
ఎన్.టి.ఆర్. స్మారక నాణాన్ని ముద్రించటం తమ అదృష్టమని, ఆ నాణాన్ని ఇప్పటికే 25 వేలకు పైగా అమ్మామని, ఇది దేశంలోనే రికార్డ్ అని హైదరాబాద్ మింట్ శ్రీనివాస్ తెలిపారు.
ఎన్.టి.ఆర్. కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ కమిటీ సభ్యుడు భగీరథ సమన్వయం చేయగా దొప్పలపూడి రామమోహనరావు, అట్లూరి నారాయణరావు, విక్రమ్ పూల, మండవ సతీష్, శ్రీపతి సతీష్ అతిథులను పుష్పగుచ్చాలతో సత్కరించారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఈ నెల 26న తెలుగులో శివ కార్తికేయన్ ‘అయలాన్’ విడుదల

Next Post

105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ – జనవరి 26న సినిమా విడుదల

Next Post
105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ – జనవరి 26న సినిమా విడుదల

105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ - జనవరి 26న సినిమా విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

హ్రీం హీరో పవన్‌ తాతాకు మంచి టాలెంట్‌ ఉంది– పవన్‌ జన్మదిన వేడుకల్లో హీరో నందు

by Maari
February 2, 2026
0

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

by Maari
February 2, 2026
0

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

by Maari
February 2, 2026
0

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది –  దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

“దేవగుడి” అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది – దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

by Maari
February 1, 2026
0

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ ప్రారంభం

by Maari
February 1, 2026
0

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

‘ఫంకీ’ చిత్రం నుంచి ఉత్సాహభరితమైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ విడుదల

by Maari
January 31, 2026
0

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

ప్రముఖ న‌టులు మురళీమోహన్ చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” టీజర్ విడుద‌ల‌

by Maari
January 31, 2026
0

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

ఆకట్టుకునే క్రైమ్ డ్రామా వన్ బై ఫోర్ (One/4)

by Maari
January 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.