• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, March 7, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

Maari by Maari
February 14, 2026
in Cinema, Latest News, Movies, news, Reviews, special
0
ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

Share and Enjoy !

Shares
Twitter

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా తెరకెక్కిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు ప్రీమియర్స్ తో వచ్చింది. ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: శివ(సంతోష్ శోభన్) చదువు అయినా ఏమి సంపాదించట్లేదని ఇంట్లో తిడుతూ ఉంటే చెన్నై వచ్చి ఇంటీరియర్ డిజైన్ గా ట్రై చేస్తూ డబ్బుల కోసం బైక్ ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు. మిత్ర(మానస వారణాసి)కి ఆల్రెడీ జాబ్ వచ్చిందని చెప్పి చెన్నైలో ఉంటుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు అనడంతో జాబ్ వంకతో తప్పించుకుంటూ చెన్నైలో ఉండి జాబ్స్ వెతుక్కుంటుంది. బైక్ ట్యాక్సీ వల్ల వీరిద్దరూ పరిచయం అవుతారు. ఓ రోజు అనుకోకుండా మిత్ర హాస్టల్ ఖాళీ చేసేయడంతో శివ బైక్ మీదే తిరుగుతూ హాస్టల్ కోసం చెన్నై అంతా వెతుకుతారు. రాత్రి అయినా ఒక్క హాస్టల్ కూడా దొరక్కపోవడంతో శివ తన రూమ్ లో ఉండమని, రెంట్ షేర్ ఇవ్వమని అడుగుతాడు. తనని నమ్మి శివ రూమ్ కి వస్తుంది మిత్ర. రూమ్ లో ఇద్దరూ క్లోజ్ అవుతారు. ఒక రకంగా లివ్ ఇన్ రిలేషన్ లోకి వెళ్తారు. శివ కెరీర్ కి మిత్ర సపోర్ట్ చేయడంతో శివ ఇంటీరియర్ డిజైనర్ గా ఎదుగుతాడు. మిత్ర మాత్రం ఎంత ట్రై చేసినా తనకు జాబ్ రాదు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ అయి దూరం అవుతారు. మరి శివ – మిత్ర మళ్ళీ కలుస్తారా? వీళ్ళ లివ్ ఇన్ గురించి ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా? మిత్రకి జాబ్ వస్తుందా? శివ – మిత్ర రిలేషన్ ఎటు వెళ్తుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

కథ… కథనం విశ్లేషణ:

కపుల్ ఫ్రెండ్లీ అని టైటిల్ తో, ట్రైలర్స్ లో రొమాంటిక్, కిస్ సీన్స్ తో సినిమాపై ముందు నుంచే అంచనాలు పెంచారు. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ సినిమా అని ప్రమోట్ చేసారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరి పాత్రల పరిచయం, ఇద్దరు కలవడం, ప్రేమలో పడటం, లివ్ ఇన్ లోకి వెళ్లడం అంతా క్యూట్ గా, అక్కడక్కడా కామెడీతో ప్రేమకథగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఇద్దరికీ గొడవ రావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఇద్దరి పేరెంట్స్ ఎంటర్ అవ్వడంతో మరింత ఆసక్తిగా మారుతుంది.

సెకండ్ హాఫ్ లో ప్రేమకథని మరో మలుపు తిప్పి ఎమోషనల్ గా మార్చారు. క్లైమాక్స్ ఎవరూ ఊహించరు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగితే సెకండ్ హాఫ్ ఎమోషనల్ రైడ్ అయింది కానీ కాస్త సాగదీశారు. ప్రేమ, భార్య భర్తల బంధం గురించి బాగా చూపించారు. ప్రస్తుతం, గతం సన్నివేశాలతో స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అయితే ఈ కథకి ఎమోషనల్ క్లైమాక్స్ కాకుండా ఇంకోలా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ప్రేమకథని కాస్త కొత్తగానే చూపించారు. హీరో – హీరోయిన్ పరిచయం కూడా కొత్తగా ఉంటుంది. ఓ రెండు మూడు రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓ రెండు సీన్స్ లో కన్నీళ్లు కూడా పెడతారు. వాలెంటైన్స్ డేకి ఈ ఫీల్ గుడ్ సినిమా మీ ఫ్రెండ్స్, లవర్ తో కలిసి చూడొచ్చు.

సంతోష్ శోభన్ చాన్నాళ్ల తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా మెప్పించాడు. మానస వారణాసి క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. రాజీవ్ కనకాల, గోపరాజు రమణ హీరోయిన్ హీరో తండ్రి పాత్రల్లో ఒదిగిపోయారు. యోగిబాబు, హీరోయిన్ ఫ్రెండ్ లవర్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్విస్తారు. హీరో అన్న, వదిన పాత్రల్లో నటించిన తమిళ నటులు చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. చాలా వరకు చెన్నై లో రియల్ లొకేషన్స్ లో గొరిల్లా షూట్ చేయడంతో రియాల్టీగా ఉంది సినిమా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజువల్స్, మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. సాంగ్స్ కూడా వినడానికి మెలోడీగా బాగున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కాస్త కట్ చేస్తే బాగుండేది. దర్శకుడు ఒక క్యూట్ లివ్ ఇన్ లవ్ స్టోరీని కొత్తగా రాసుకొని ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ పరంగా చిన్న సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టనట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా ఓ సరికొత్త ప్రేమకథ. నవ్వించి ఎమోషనల్ చేస్తారు. వాలెంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమా. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

Review: A Beautiful Breakup

Next Post

కూర్గ్ లో గ్రీన్ పార్క్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభమ్… చిన్న జీయర్ స్వామి , రజనీకాంత్ చేతుల మీదుగా ఆరంభం

Next Post
కూర్గ్ లో గ్రీన్ పార్క్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభమ్… చిన్న జీయర్ స్వామి , రజనీకాంత్ చేతుల మీదుగా ఆరంభం

కూర్గ్ లో గ్రీన్ పార్క్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభమ్… చిన్న జీయర్ స్వామి , రజనీకాంత్ చేతుల మీదుగా ఆరంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

by Maari
March 6, 2026
0

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

by Maari
March 5, 2026
0

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by Maari
March 5, 2026
0

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు

by Maari
March 4, 2026
0

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.