• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, August 27, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రం సుయోధన…సాయి కుమార్

Maari by Maari
March 26, 2026
in Cinema, Latest News, Movies, special
0
నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రం సుయోధన…సాయి కుమార్

Share and Enjoy !

Shares
Twitter

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ “సుయోధన” సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – నేను ఈ సినిమాలోకి రావడానికి కారణం ఎడిటర్ ఛోటా కె ప్రసాద్. ఆయన ఈ సినిమాకు ఎడిటింగ్ తో పాటు అనేక విషయాల్లో సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు. ఈ మూవీ కోసం మంచి సెట్ వర్క్ చేశాం. అది మూవీలో చాలా బిగ్ స్పాన్ లో కనిపిస్తుంది. సాయికుమార్ గారికి, ప్రియదర్శికి తమ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా “సుయోధన” నిలుస్తుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ – “సుయోధన” సినిమా ఒక సౌండింగ్ నేపథ్యంగా ఉంటుంది అని తెలియగానే మ్యూజిక్ డైరెక్టర్ గా హ్యాపీగా ఫీలయ్యాను. ఒక కొత్త వైబ్ ఈ సినిమాలో మీరంతా ఫీలవుతారు. ప్రియదర్శి, సాయి కుమార్ గారి పర్ ఫార్మెన్స్ లు చూశాక నా బీజీఎంను మరింత బాగా వచ్చేలా చూసుకున్నాను. ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. అన్నారు.

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – “సుయోధన” ఒక కొత్త తరహా మూవీ. ఇలాంటి చిత్రాలు రెగ్యులర్ గా రావు. మా ప్రొడ్యూసర్ బోసు గారు ఎంతో ప్యాషనేట్ గా సినిమాను నిర్మించారు. టెక్నికల్ గా ప్రతి క్రాఫ్ట్ క్వాలిటీగా ఉంటుంది. శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కు వస్తున్న ఈ చిత్రాన్ని మీరంతా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ – మా సినిమాకు మా టెక్నీషియన్స్ ప్రధాన బలంగా నిలిచారు. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, కార్తీక్ కెమెరా వర్క్, జై క్రిష్ సంగీతం, ఛోటా కె ప్రసాద్ గారి ఎడిటింగ్..ఇవన్నీ ఎంతో క్వాలిటీగా సినిమా వచ్చేలా చేశాయి. ఛోటా కె ప్రసాద్ గారు మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ మాధవ్ కు ఫస్ట్ సినిమా అయినా అనుభవజ్ఞుడిలా అందరి నుంచి తనకు కావాల్సిన ఔట్ పుట్ తీసుకున్నారు. ప్రియదర్శి, సాయికుమార్ గారు మాకు ఇచ్చిన సహకారం గురించి మర్చిపోలేను. మా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు బాపిరాజు గారు. ఆయన లాంటి వాళ్లు అందరు నిర్మాతలకు దొరికితే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. కొత్త నిర్మాతలకు సినిమా మేకింగ్ విషయంలో అవగాహన కల్పించేలా ఫిలింఛాంబర్ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీరామ నవమి రోజున ఈ నెల 27న మా మూవీ రిలీజ్ కు వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

హీరోయిన్ ద్రిషిక చందర్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో సుమిత అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. సాయికుమార్, ప్రియదర్శి లాంటి మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 27న థియేటర్స్ లో మీట్ అవుదాం. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – సుయోధనుడి పాత్రలో నటించాలంటే అప్పట్లో ఎస్వీ రంగారావు గారు ఉండేవారు. సాయి కుమార్ గారు ఆయనను గుర్తుకు తెచ్చేలా ఈ చిత్రంలో ఆ పాత్ర పోషించారు. ప్రియదర్శి ఒకవైపు, సాయికుమార్ గారు మరోవైపు ఈ చిత్రానికి పిల్లర్స్ లా నిలిచారు. ప్రియదర్శి బలగం, కోర్ట్ సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయో, అంతకంటే ఎక్కువ ఈ సుయోధన సినిమా వసూళ్లు తీసుకొస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ – సౌండ్ అనేది ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. హీరో ప్రియదర్శి ఫోలే ఆర్టిస్టుగా కనిపిస్తారు. ఈ ఫోలే సీన్స్ కోసం ఔట్ డోర్ అనుకున్నాం కానీ మేము ఇమాజిన్ చేసినట్లు రాలేదు. అప్పుడు బ్రహ్మ కడలి గారితో మాట్లాడి మాకున్న బడ్జెట్ లో సెట్ వేశాం. ఆ సెట్ స్క్రీన్ మీద మిమ్మల్ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది. మా ప్రొడ్యూసర్ బోస్ బాబు గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా చేయగలిగాం. ఈ చిత్రంలో సుయోధన క్యారెక్టర్ రాసుకున్నప్పుడే సాయికుమార్ గారు ఒక్కరినే ఊహించుకున్నాం. అలాగే దర్శి చాలా సపోర్ట్ చేశారు. మా ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ అన్న అన్నింట్లో తన గైడెన్స్ ఇచ్చారు. నేను సుకుమార్ గారి ఏకలవ్య శిష్యుడిని. ఆయన 1 నేనొక్కడినే మూవీ చూసి ఇన్స్ పైర్ అయి ఈ కథ రాసుకున్నాను. రీసెంట్ గా కోర్ట్ మూవీ జంట చేసిన సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. కోర్ట్ మూవీ కాంబో సాయికుమార్, ప్రియదర్శి చేసిన మా సినిమా రేపు థియేటర్స్ లోకి వస్తోంది. మా మూవీకి ప్రేక్షకులు మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

యాక్టర్ దేవిప్రసాద్ మాట్లాడుతూ – మా గురువు కోడి రామకృష్ణ గారు ప్రియదర్శి మూవీస్ చూసేవారు. చూస్తూ..ఇతను బాగా పేరు తెచ్చుకుంటాడు అనేవారు. ఆయన అన్నట్లుగానే ఈ రోజు ప్రియదర్శి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. సాయికుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో మేము నటించినా, మూవీలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో తెలియదు. మీతో పాటు మేము కూడా స్క్రీన్ మీదే చూడాలి. సినిమాకు బడ్జెట్ కాదు సబ్జెక్ట్ ముఖ్యమని ఇటీవల చిన్న చిత్రాల విజయాలే ప్రూవ్ చేస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి సక్సెస్ అందుకోవాలి. అన్నారు.

యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ – నేను 1972లో ధుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి. మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. వీలైతే సినిమా అంతా ఇక్కడే చూడాలని ఉంది. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ యూఎస్ లో చేశాం. ప్రియదర్శికి ఇక్కడే కాదు యూఎస్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. యూఎస్ లోని వాళ్లు సుయోధనతో ఒక మంచి మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని అన్నారు. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే విషయాన్ని మా నాన్నగారు చిన్నప్పుడే నేర్పించారు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్ గా మూవీ చేశారు. రేపు థియేటర్స్ లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి, వారి ఆదరణ మరింత పొందాలనే ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. అలాంటప్పుడే కోడి రామకృష్ణ గారి లాంటి లెజెండ్స్ నా గురించి బాగా చెప్పారు కదా అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంటాయి. సాయి కుమార్ గారు, ఆయన కుటుంబం 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ చిత్రంలో సుయోధన పాత్రకు ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుందని అనిపిస్తుంటుంది. ఈ చిత్రంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. బోస్ బాబు గారు బడ్జెట్ గురించి పట్టించుకోకుండా క్వాలిటీగా మూవీ చేశారు. హాలీవుడ్ క్లాసిక్ మూవీ డ్యూన్ లెవెల్లో ఈ సినిమా చేయాలని మా మూవీ టీమ్ పట్టుదలగా పనిచేశారు. మా సినిమాను మీరు థియేటర్స్ లో చూసి మంచి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్ , సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్ : ప్రజ్వల లైన్ క్రియేషన్స్
మ్యూజిక్ : జై క్రిష్
డీఓపీ : కార్తీక్ కొప్పెర
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
నిర్మాత : బోసుబాబు నిడుమోలు
దర్శకత్వం: వై ఎస్ మాధవ్ రెడ్డి
పీఆర్ఓ – సతీష్ కె

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల

Next Post

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

Next Post
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

by Maari
August 26, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు – ముఖ్య అతిథిగా దిల్ రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు – ముఖ్య అతిథిగా దిల్ రాజు

by Maari
August 26, 2026
0

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

by Maari
August 25, 2026
0

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

by Maari
August 22, 2026
0

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌… ది రెడ్ బ్యాగ్ (The Red Bag Movie Review)

by Maari
August 21, 2026
0

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

ఇరుముడి మూవీ రివ్యూ (Irumudi Review): బలమైన పాయింట్ ఉన్నా.. సాగతీత, రొటీన్ స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచిన థ్రిల్లర్!

by Maari
August 21, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.