తెలుగమ్మాయి సమయ రెడ్డి హీరోయిన్ గా… కథకు రాలిగా… నిర్మాతగా వ్యవహరించిన చిత్రం డియర్ ఉమ. పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) కష్టపడి ఎంబీబీఎస్‌లో సీటు సంపాదిస్తుంది. సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించి తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. దేవ్‌కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే ప్రాణం. రాక్‌స్టార్ కావాలని కలలు కంటాడు. మ్యూజిక్ కారణంగా చదువులో వెనుకబడిపోతాడు. కాలేజీలోనే తనకు పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కారణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో తాగేసి ఇంటికి వెళ్లిన దేవ్‌ను తండ్రి ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. రాక్‌స్టార్‌గా సక్సెస్ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవేవీ సక్సెస్ కాకపోవడంతో గిరి అనే స్నేహితుడి ఆర్ట్ గ్యాలరీలో పార్ట్ టైమ్ జాబ్‌లో చేరిపోతాడు. ఓ డైరీ ద్వారా ఉమా అతడి జీవితంలోకి వస్తుంది. ఉమాతో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఉమకు సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి దేవ్‌కు తెలుస్తుంది. అదేమిటి? కార్పొరేట్ మెడికల్ మాఫియాపై సాగించిన పోరాటంలో ఉమకు ఏమైంది? ఆమె లక్ష్యాన్ని దేవ్ ఎలా నెరవేర్చాడు ? అన్నదే ఈ మూవీ క థ.
కథ… కథనం విశ్లేషణ:
వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలకు లవ్‌స్టోరీని జోడించి డియర్ ఉమ కథను రాసుకున్నది సుమయ రెడ్డి. ట్రీట్‌మెంట్ పేరుతో సామాన్యులను కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా దోచుకుంటాయనే మెసేజ్‌ను సినిమాలో టచ్ చేశారు…లేడీ డాక్టర్‌తో రాక్‌స్టార్ ప్రేమలో పడటం, ఆమె కోసం సాగించిన అన్వేషణ చూపించారు. ఈ రెండు కథలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
హీరో ఓ రాక్‌స్టార్…హీరోయిన్ ఓ డాక్టర్ …భిన్న నేపథ్యాలు కలిగిన వారు ఎలా ఒక్కటయ్యారనే అంశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. లవ్ బ్రేకప్ కారణంగా హీరో పడే బాధను ఎమోషనల్‌గా చూపించారు. ఇంటర్వెల్‌లో రివీలయ్యే టెస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
సెకండాఫ్ మొత్తం ఉమకు ఏమైంది? ఆమె కనిపించకుండాపోవడం వెనకున్న కారణాలను తెలుసుకుంటూ దేవ్ సాగించే అన్వేషణ తో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. దేవ్ కలవాలని అనుకున్న ఒక్కొక్కరు హత్యకు గురువుతుండటం, అసలు ఈ మర్డర్స్ వెనుక ఎవరున్నారన్నది ఆడియెన్స్ ఉహలకు అందకుండా ఉత్కంఠగా చూపించారు. అసలు విలన్ ఎవరన్నది రివీలయ్యే సీన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లవ్ డ్రామాగా….సెకండాఫ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ నడిపించిన తీరు ఓకే అనిపిస్తుంది.
కేవలం రెండు మెయిన్ ట్విస్ట్‌లను బేస్ చేసుకొని డియర్ ఉమ కథ సాగిన ఫీలింగ్ కలుగుతుంది. వాటి చుట్టూ అల్లుకున్న డ్రామాలో ఆసక్తి లోపించింది. సినిమాలో కీలకమైన హాస్పిటల్ సీన్ చిరంజీవి సూపర్ హిట్ మూవీని గుర్తుకుతెస్తుంది. ఆ ఎపిసోడ్‌ను ఇంకాస్త డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.. లవ్‌స్టోరీ కూడా నాచురాలిటీకి దూరంగా సాగినట్లుగా అనిపిస్తుంది.
ప్రొడ్యూసర్‌గానే…
డియర్ ఉమ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది సుమక రెడ్డి. ప్రొడ్యూసర్‌గానే ఆమెకు ఎక్కువగా మార్కులు పడతాయి. చిన్న సినిమానే అయినా ఎక్కడ ఆ భావన కలగకుండా నిర్మించింది. యాక్టర్‌గా, రైటర్‌గా పర్వాలేదనిపించిది. ఉమ పాత్రలో సెటిల్డ్‌గా నటించింది.
రాక్‌స్టార్ దేవ్‌గా పృథ్వీ అంబర్ స్టైలిష్‌గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కమల్ కామరాజు పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. ఆమని, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్‌తో పాటు పలువురు సీనియర్ ఆర్టిస్టులు తమ పాత్రలకు పరిధుల మేర న్యాయం చేశారు. సప్తగిరి ఫుల్ లెంగ్త్ రోల్ చేసినా అంతగా నవ్వించలేకపోయాడు.
అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ అందించిన పాటలు బాగున్నాయి. డియర్ ఉమ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన లవ్ డ్రామా మెప్పిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3