• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, June 17, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

Maari by Maari
June 17, 2026
in Cinema, Latest News, Movies, news, special, sports
0
“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

Share and Enjoy !

Shares
Twitter

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మూవీ హైలైట్స్ తెలిపారు.

• పదేళ్ల కిందట వచ్చిన ప్రయోగాత్మక చిత్రం మిణుగురులు చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశా. ఆ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ లైబ్రరీలో ఆ స్క్రిప్ట్ భద్రపరిచారు. పదేళ్లకుపైగా ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. చిన్న చిన్న డెమో ఫిల్మ్స్, సాంగ్స్, షార్ట్స్ ఫిల్మ్స చేసేవాణ్ని. సినిమాలు, ఇంటర్వ్యూలు చూసి సినిమా గురించి నేర్చుకున్నా. షార్ట్స్, కలర్ ఫాలెట్ ఏవీ నేర్చుకోలేదు. సినిమా చూస్తూ సినిమాను ఎంజాయ్ చేసేవాణ్ని. సినిమా నచ్చకపోతే బాగా తిట్టేవాణ్ని. చెత్త రైటింగ్ కు అవకాశం వచ్చింది. నాకెందుకు అవకాశం రాలేదనుకునేవాణ్ని. ఒక రకమైన ప్రస్టేషన్ ఉండేది. నా కథలన్నీ గొప్పగా ఉంటాయి. వాటన్నింటిని తెరపై చూడాలని ఉండేది. చూసినవాళ్లంతా ఎవర్రా ఈ సినిమా తీసిందని గొప్పగా మాట్లాడుకోవాలి. అదే నా మైండ్ లో రన్ అవుతూ ఉండేది. నేను 10 గంటలు కూర్చొని ఉద్యోగం చేస్తున్నప్పుడల్లా నా మైండ్ లో మొత్తం సినిమానే రన్ అవుతూ ఉండేది. జాబ్ లో ప్రమోషన్స్ కూడా వద్దనుకునేవాణ్ని. ఎందుకంటే ఆ పని నాకు నచ్చేది కాదు. నాకు మ్యాథ్స్ రాదు, సాప్ట్ వేర్ రాదు. ఎక్సెల్ రాదు, నాకు వచ్చింది కలలు కనడం. ఎన్నేళ్లైనా కూడా నాకు ఇప్పుడే పుట్టిన కలగా ఉండేది. ఉద్యోగం చేసేటప్పుడు 2019 డిసెంబర్ లో ఒక ఆలోచన వచ్చింది. ఇన్వెస్టిగేషన్ డ్రామా అది. అయితే జాబ్, సినిమా రెండు ఛాలెంజ్. జాబ్ లో ఏంట్రీ లెవల్ లోనే ఉండేవాణ్ని. సినిమా కోసం ఒకసారి జాబ్ మానేసి నా భార్యను బాగా కష్టపెట్టా. ఆ తర్వాత అర్థమైంది జాబ్ మానేయడం ఇంపాజిబబుల్ అనుకున్నా. కొవిడ్ సమయంలో మా నాన్న అనారోగ్యం వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఓటీటీకి సూట్ అయ్యే కథతో తిరుగుతుండేవాణ్ని.

• దివాన కథ జెమిని టీవీలో ఓ యాంకర్ ను చూసి రాసుకున్నా. ఆమె రోజూ టీవీలో వచ్చేంది. ఎంబీఏ పూర్తి చేశాక జాబ్ కోసం ప్రయత్నించకుండా సినిమా కోసం ఆగిపోయా. పొద్దున లేస్తే టీవీ చూస్తుండగా యాంకర్ కనిపించింది. వెళ్లి ఆ అమ్మాయిని కలిస్తే ఎట్లుండది, కలిస్తే ఏమవ్వొచ్చు, గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి కలిస్తే ఏం జరుగుతుందనే ఆలోచన తట్టింది. దీంట్లో ఏమోషనల్ ప్లస్ కమర్షియల్ కథ ఉంది. ఇది రాయాలని అనుకున్నా.

• నా దగ్గర ఏదీ ఉంటే దానిపై కథగా రాసుకునేవాణ్ని. నాకొచ్చి ఆలోచన మరిచిపోకముందే దాన్ని రాసుకోవాలనిపించేది. పేపర్ దొరక్కపోతే అగ్గిపెట్టే ముక్కపై కూడా రాసుకున్నా. ఒకసారి కథ పూర్తిగా వచ్చాక సిస్టమ్ పై కూర్చొని ఆ కథలోని పాత్రల గురించి రాసుకునేవాణ్ని. దాదాపు ఆరేడు నెలలు పట్టేది. అట్ల ఈ కథ 10 డ్రాప్ట్స్ వరకు రాశాను. మొదటి డ్రాప్ట్స్ 12 ఏళ్ల కిందటే రాశాను.

• పెద్ద నిర్మాతలను కలిసే అవకాశం దొరకలేదు. చిన్న నిర్మాతలను కలిసి కథ చెప్పినప్పుడు వాళ్లేదో చెప్పేవాళ్లు. వాళ్లు మార్కెట్ లో ఉన్న నిర్మాతలు. నేనేమో ఇంట్లో ఉండేవాణ్ని. వాళ్ల ఇన్ పుట్స్ తో కూడా మరింత డెవలప్ చేసేవాణ్ని. ఎవరికి కథ చెప్పినా ఆ మార్పులతో మరింత డెవలప్ చేసేవాణ్ని. రెండేళ్లలో టోటల్ గా కథ మొత్తం సెట్ అయిపోయింది.

• రవీంద్రనాథ్ ఠాగూర్, ఆంటోన్ చెకావో రాసిన షార్ట్స్ స్టోరీల్లో కూడా ఇలాంటి లైన్స్ ఉంటాయి. దూరదర్శన్ లో కథా సాగర్ లో కూడా అద్భుతమైన కథలు వచ్చేవి. నా వెర్షన్ అయితే రాలేదు. నేను రాసిన కథను పెద్ద కమర్షియల్ సినిమా చేయవచ్చని ఎవరూ ఊహించరు. అది నాకే తెలుసు. దాంట్లో ఏమోషనల్ ఈజ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్. అంత ఏమోషన్ ఉంది. ఆ ఎమోషన్ చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ ఉంది. నా కథలో హీరోది వన్ సైడ్ లవ్వే. ఎక్స్టోవర్ట్ గా హీరోయిన్ వెనుకపడుతుంటాడు. సెకండాప్ లో వన్ సైడ్ లవ్వే ఉంటుంది కానీ వెనుకపడేది ఉండదు.

• నా ఫ్రెండ్స్ తో కలిసి అవకాశాల కోసం తిరిగేవాణ్ని. కొన్నాళ్ల తర్వాత ఎవరూ లేరు. నేను ఒక్కణ్నే మిగిలా. ఓ రోజు రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అల్లు అరవింద్ గారు, సత్యనంద్ గారు ఉన్నారు. అప్పుడు నా కాలేజిలో అనుభవించిదంతా కథగా రాసుకున్నా. వాళ్లిద్దరు మాట్లాడుతుంటే వెళ్లి మీకు కథ చెప్పాలి సర్ అని అడిగా. వాళ్లు షాక్ అయ్యారు. గీతా ఆర్ట్స్ కు రాసా. కథ బాగుంటే సినిమా అవుతుంది. కథ బాగాలేకపోతే టీయో కాఫీయో వేస్ట్ అవుతదన్నారు. ఆఫీసుకు వెళ్తే నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. లోపల సర్ ఉన్నారో లేరో కూడా తెలియదు. కానీ ఎట్టకేలకు అల్లు అరవింద్ సర్ ముందు కాఫీ తాగటానికి 20 ఏళ్లు పట్టింది. కథ నచ్చింది. కాఫీ వేస్ట్ కాలేదు. కాలేజీ కథ కాదు. దివాన కథ చెప్పాను.

• సినిమాలో ఆరు పాటలుంటాయి. మూడు ఫైట్లు ఉంటాయి. మీరు ఎంతైనా బడ్జెట్ ఇవ్వండి అన్నీ చేస్తా అని చెప్పా. నేను డెమో చేస్తే సినిమా కన్నా బాగుంటుంది. 5 వేల రూపాయలతో డెమో తీశా. 69 రోజుల్లో తీయాల్సింద కథ అని చెప్పగానే 30 రోజుల్లో తీయమని చెప్పారు. ఇంత కథను 30 రోజుల్లో తీయమంటున్నరు. ఎలా రా అని మా ఫ్రెండ్స్ ను అడిగా. ముందైతే సినిమా మొదలుపెడుతాం అన్నారు. 42 రోజులు అయ్యింది. ఇంకా ఐదారోజుల కంటెంట్ తీయలేదు. అంత కంటెంట్ ను వదులుకోవడం ఛాలెంజ్ గా అనిపించినా రైటింగ్ పవర్, నటీనటుల వల్ల బాగా తీయగలిగాను.
• ఒక నిర్మాత కోటి రూపాయల్లో తీద్దామని చెప్పారు. ఆ నిర్మాతకు హర్షిత్ రెడ్డి పరిచయం. అప్పటికి మెయిల్ రాలేదు. మెయిల్ డైరెక్టర్ ఉదయ్ నా ఫ్రెండ్. తనతో చెప్పించా. పైనల్ గా హర్షిత్ వచ్చి కథ విన్నడు. ఇది కొంచెం 90నాటి లవ్ స్టోరీలా అనిపిస్తుంది. నేను ఎలా ఉంటనో అలానే తీశా. ప్రతి మనిషిని టార్గెట్ చేసి తీసిన సినిమా దివాన. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎమోషన్స్ బాగా నచ్చుతాయి.

• సినిమా వచ్చిందో లేదో తెలియడం కన్నా…నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా అని చూస్తుంటా. ఏవరన్నా రియాక్ట్ అవుతున్నారా లేదో చూస్తా. నా సినిమా చూసి తిట్టుకున్నా హ్యాపీ. వాళ్ల రియాక్షన్ నాకు ఇంపార్టెంట్. ఫేక్ కామెంట్స్ చూస్తే చాలా కోపం వస్తుంది.

• సినిమా ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు డైరెక్టర్ల కంటే టాలెంట్ గా ఉంటారు. మనమే టాలెంట్ అనుకుంటే వాళ్లు మనకంటే జీనియస్. తరుణ్ భాస్కర్, త్రివిక్రమ్ లాంటి వాళ్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ నేను కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. ఈశ్వర్ సొంతగా నేర్చుకునేవాడు. నా కథలు ఈశ్వర్ కు చెప్పేవాణ్ని. అరవింద్ సర్ ఒకే అన్నాక అప్పుడు చెప్పా. బాగా రాశావు అన్నాడు. డెమో కోసం మ్యూజిక్ చేయిస్తే చెత్తగా చేశాడు. తిట్టా. ఒకసారి పక్కకు వెళ్లని చెప్పి మళ్లీ మ్యూజిక్ కొట్టాడు. అద్భుతంగా వచ్చింది. అరవింద్ సర్ టీమ్ కూడా బాగా నచ్చింది. కాపీ కొట్టాడా, ఇన్సిపిరేషన్ అనేది వాళ్లకు తెలియదు కదా. మన బడ్జెట్ లో డెమోకు మనోడు తప్ప ఇంకా ఎవరు రారు. ఇక సినిమాకు పాటలు చేయడం మొదలుపెట్టాం. చాలా రోజుల తర్వాత ఈశ్వర్ పాటలను ఒకే చేశారు.

• తీయడానికి మన టాలెంట్ సరిపోతుందా అనే కథలున్నాయి నా దగ్గర. టెక్నికల్ గా, ప్యూచరిస్ట్ గా ఉంటాయి. కొన్ని సినిమాలు చేస్తూ ఆ టాలెంట్ ను సంపాదించుకోవాలి. అప్పుడే అవి తెరపైకి వస్తాయి.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

by Maari
June 15, 2026
0

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

by Maari
June 15, 2026
0

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే “దీవాన”- హీరో హర్షిత్ రెడ్డి

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే “దీవాన”- హీరో హర్షిత్ రెడ్డి

by Maari
June 15, 2026
0

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

by Maari
June 13, 2026
0

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్

by Maari
June 13, 2026
0

రివ్యూ: పోలీస్ కంప్లైంట్ – కర్మ సిద్ధాంతంతో సాగే హారర్ యాక్షన్ థ్రిల్లర్!

రివ్యూ: పోలీస్ కంప్లైంట్ – కర్మ సిద్ధాంతంతో సాగే హారర్ యాక్షన్ థ్రిల్లర్!

by Maari
June 12, 2026
0

రివ్యూ: కొత్త మలుపు – గోదావరి అందాలు… ప్రేమలో మలుపులు!

రివ్యూ: కొత్త మలుపు – గోదావరి అందాలు… ప్రేమలో మలుపులు!

by Maari
June 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.