• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, October 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

Maari by Maari
September 4, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

Share and Enjoy !

Shares
Twitter

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం

నటీనటులు – సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ కుమార్, తదితరులు

సాంకేతిక నిపుణులు:

లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఏలేందర్
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
నిర్మాత: మేరుం భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సీనియర్ నటుడు సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి, రాజా రవీంద్ర, షఫీ, యువ హీరో నటరాజ్, హీరోయిన్ రాయంచ కొక్కుర, హీరో వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’(Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు ఎమ్మెల్యే బైర్రాజు(సాయికుమార్). అదే ఊళ్ళో కాలేజీని నడుపుతూ డ్రగ్స్ దందా చేస్తుంటారు వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి. తమ కాలేజీలోని విద్యార్థులకు విశ్వ(శివకుమార్) ద్వారా డ్రగ్స్ ను సప్లై చేస్తూ… విద్యార్థులను డ్రగ్స్ కు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇది తెలిసిన అదే కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అరుంధతి( వితిక షేరు), ఆమె స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) తదితరులు విశ్వను ఎదిరిస్తారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. నియోజకవర్గం ఎమ్మెల్యే అండదండలతోనే తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసి టీ కొట్టు నడుపుకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో బైర్రాజు మీద స్టూడెంట్స్ మద్దతుతో పోటీకి దిగుతాడు. ధన బలం, మందిబలం ఉన్న బైర్రాజును ఒక సామాన్య టీ అమ్ముకునే ఈశ్వరయ్య ఎలా ఓడించాడు అనేదే మిగతా కథ.

విశ్లేషణ: పొలిటికల్ యాక్షన్ డ్రామాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతారు. సరైన కథను ఎంచుకుని దానికి తగ్గట్టుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఓ కాంటెంపరరీ ఇష్యూను బేస్ చేసుకుని కథను రాసి… దానికి తగ్గట్టుగా పొలిటికల్ టచ్ తో స్క్రీన్ ప్లేను నడిపించాడు.

ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాలు, డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడంతో… ఇంటర్వెల్ ట్విస్ట్… సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.

సెకండ్ హాఫ్ లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ధర్మస్థల నియోజకవర్గం రాజకీయం వేడెక్కుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజు… ఈశ్వరయ్య చేసే పొలిటికల్ కాంపెయిన్… తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు గూస్ బమ్స్ కలిగిస్తాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు… ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. అలాగే దుస్టుల సహవాసం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం.

నటీనటుల పనితీరు:

టీ అమ్ముకునే ఓ సామాన్య ఈశ్వరయ్య పాత్రలో సుమన్ పాత్ర ఆకట్టుకోవడంలో… అలాగే సెకండ్ హాఫ్ లో రాజకీయ రంగ ప్రవేశం చేసి… ఉచిత పథకాల వల్ల కలిగే నష్టం గురించి పొలిటికల్ కాంపెయిన్ చేసే తీరులో ఆకట్టుకుంటాడు. ఏడు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకుంటాడు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. క్రూరత్వం చాలా రోజుల తర్వాత రాజీవ్ కనకాల చూపించి మెప్పించాడు. అలాగే కస్తూరి కూడా నెగిటివ్ రోల్ లో బాగా సెట్ అయింది. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు.. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, చివర్లో వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట ఎక్కడా డివియేట్ కాకుండా తను చెప్పాలనుకున్న కథను మెసేజ్ రూపంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. డెబ్యూ దర్శకుడే అయినా… పొలిటికల్ యాక్షన్ డ్రామాను చాలా ఎంగేజింగా తీశారు. దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంది. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. సందర్భానుసారంగా రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆలోచింప జేస్తాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. నిర్మాత
మేరుం భాస్కర్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా తెరకెక్కించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను ఈ వారం సరదాగా చూసేయండి.

రేటింగ్: 3.5/5

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

Next Post

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

Next Post
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘సుమో దీదీ’.. ట్రైలర్ రిలీజ్ చేసిన జీ5 హిందీ

‘సుమో దీదీ’.. ట్రైలర్ రిలీజ్ చేసిన జీ5 హిందీ

by Maari
October 13, 2026
0

ఘనంగా జరిగిన విహారి ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ ఈవెంట్

ఘనంగా జరిగిన విహారి ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ ఈవెంట్

by Maari
October 12, 2026
0

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 10, 2026
0

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

by Maari
October 10, 2026
0

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

by Maari
October 10, 2026
0

చకోర మూవీ రివ్యూ: ప్రేమ, మిస్టరీతో ఆకట్టుకుందా?

చకోర మూవీ రివ్యూ: ప్రేమ, మిస్టరీతో ఆకట్టుకుందా?

by Maari
October 9, 2026
0

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

by Maari
October 3, 2026
0

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

by Maari
October 2, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.