• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, September 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

Maari by Maari
August 21, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్

Share and Enjoy !

Shares
Twitter

* సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రెస్ మీట్ ను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ- నేను హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కంటే ఒక నటిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకున్నాను. నటిగా నాకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ ను ఈ సినిమాలో చేశాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎంతో బాగా చూసుకున్నారు. అన్నారు.

నటి కస్తూరి మాట్లాడుతూ – అర్థం పర్థం లేని కామెడీ, డ్రామా ఉన్న సినిమా కాదిది. ఒక పర్పస్ ఫుల్ మూవీ. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రమిది. ఇలాంటి సినిమా ఇప్పుడున్న సొసైటీకి కావాలి. ఈరోజు జెన్ జీ ఆటపాటలతో సరదాగా సమయం గడపడం లేదు. ఆలోచిస్తున్నారు. అలాంటి యువతకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట గారికి, నిర్మాత భాస్కర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ – ఈ సినిమా చూశాక చెబుతున్నా మూవీ మీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ మీద మొదటి నుంచ నాకు మంచి నమ్మకం ఉంది. సినిమా హిట్ అవుతుందనే ఆశిస్తూ వచ్చాను. డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను మా దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. సెట్ లో అన్నీ కుదరకపోతే ఒక్కోసారి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాలేదు. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న ఈ సినిమాను చూసి మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ మాట్లాడుతూ”మా సినిమాలో సంగీతానికి మంచి స్కోప్ ఉంది. మ్యూజికల్ గా మంచి ఎమోషనల్ టచ్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు

హీరో నటరాజ మాట్లాడుతూ – ఇప్పటిదాకా ఈ సినిమా మాది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి మీది కాబోతోంది. ప్రేక్షకులంతా మా సినిమాను తమదిగా భావించి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమాతో సుమన్ గారు, వితిక..ఇలాంటి కాస్టింగ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

పివిఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ మాట్లాడుతూ”రీసెంట్ గా వస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అదే కోవలోనే ఈ ధర్మస్థల నియోజవర్గం సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ఒక బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఎంత ప్రయాస ఉంటుందో ఒక సినిమా థియేటర్స్ లో రిలీజ్ కు రావాలన్నా అంతే ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దాటుకుని మా చిత్రాన్ని సెప్టెంబర్ 4న రిలీజ్ కు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాకు సపోర్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారి సహకారం వల్లే ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించగలిగాం. సినిమా పట్ల ఆయనకు చాలా ప్యాషన్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. అన్నారు.

నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ – ఈ రోజు మా సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది, తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతుండటం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న గ్రాండ్ గా థియేటర్స్ లో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మీరంతా చూసి మీ రెస్పాన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు నటించిన ఈ చిత్రానికి

లిరిక్స్: చంద్రబోస్,
సింగర్: సునీత,
డి ఓ పి: వెంకట హనుమ,
ఫైట్స్: నందు మాస్టర్,
కొరియోగ్రఫీ: శ్రష్టి వర్మ,
డైలాగ్స్: అస్లాం,
ఎడిటింగ్: సాయిబాబు తలారి,
సంగీతం: మహావీర్ ఎల్లంధర్,
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
నిర్మాత: మేరుం భాస్కర్,
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

Next Post

అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

Next Post
అమీర్ లోగ్…. పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

అమీర్ లోగ్.... పక్కా హైదరాబాద్ ఫ్లేవర్ ఎంటర్ టైనర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్

by Maari
September 9, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

by Maari
September 9, 2026
0

ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

by Maari
September 9, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది:  విజయ్ దేవరకొండ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

by Maari
September 9, 2026
0

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

by Maari
September 8, 2026
0

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

by Maari
September 7, 2026
0

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

by Maari
September 7, 2026
0

‘పంచనామా’లో మూడు మరణాల వెనుక వున్న అసలు మిస్టరీ ఏంటి?

‘పంచనామా’లో మూడు మరణాల వెనుక వున్న అసలు మిస్టరీ ఏంటి?

by Maari
September 6, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.