సైంటిఫిక్ కామెడీ మూవీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కథ… కథనం బాగుంటే చాలు సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకనే దర్శకులు న్యూ ఏజ్ తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ కోవలో కొత్త దర్శకుడు సంతోష్ బాబు .. ప్లాంట్ మ్యాన్ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ మూవీస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు పన్నా రాయల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ: చారి(చందు) బాగా చదువుకొని తనకెంతో ఇష్టమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. అతనికి పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాడు. అతి కష్టం మీద పెళ్లికి చందు(సోనాలి) తో ఒప్పుకుంటాడు. అయితే ఆమె చిన్ననాటి స్నేహితుడు చింటు(అక్కం బాలరాజు) చందుని ప్రేమిస్తుంటాడు. అందుకే ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతుంటాడు. అందుకే చందుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైన చారిపైనా పగ పెంచుకుంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తాడు. కానీ, అతని ప్రయత్నాలు ఫలించవు. చారికి, చందుకి పెళ్లి జరిగిపోతుంది. ఈలోగా చారి జీవితంలో ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. చింటూ తండ్రి ఓ సైంటిస్ట్. ఎడారిలో మొక్కలు మొలిపించేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలు చేస్తుంటాడు. ఓరోజు అతని పరిశోధన విజయవంతమై ఓ మందు కనుగొంటాడు. ఆ మందు నేల మీద జల్లితే నిమిషాల్లో మొక్కలు పుట్టుకొస్తాయి. అది తెలుసుకున్న చింటూ ఆ మందును చారి మీద ప్రయోగిస్తాడు. దాంతో చారికి ఒళ్ళంతా మొక్కలు వచ్చేస్తాయి. ఈలోగ చారి, చందులకు శోభనం ఏర్పాటు చేస్తారు. ఆ పరిస్థితిలో చారి శోభనం తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఒంటి నిండా వచ్చిన మొక్కలతో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? చివరికి అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడి మామూలు మనిషిగా మారాడు? అనేది మిగతా కథ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే…
దర్శకుడు సంతోష్ బాబు ప్లాంట్ మ్యాన్ అంటూ రెగ్యులర్ స్టోరీ కాకుండా.. డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడాన్ని మెచ్చుకోవాలి. గతంలో హాలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాలు వచ్చాయి. ఇక తెలుగులో రాజేంద్ర ప్రసాద్ ‘జై భజరంగ భళీ’ అంటూ కాస్త ఇదే తరహా కామెడీ కథతో ఓ సినిమా వచ్చి సూపర్ హిట్టైయింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత సంతోష్ కుమార్ ‘ప్లాంట్ మ్యాన్’ అంటూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసాడు. ఓ శాస్త్రవేత్త ప్రపంచంలో దుర్భిక్షం పోగట్టడానికి చేసే ప్రయోగం సఫలం కావడం. దాన్ని అతని కుమారుడు తను ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని చేసుకుంటందున్న కసితో అతనికి ఆ ఫార్ములాను మందులో కలపడం వంటివి సన్నివేశాలను హిల్లేరియస్‌గా చెప్పే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఆర్గినానిక్ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే వ్యక్తిగా చూపించడం. హీరోయిన్‌తో ప్రేమ వ్యవహారం వంటివి రొటిన్‌గా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్ చూపించే ప్రయత్నం చేసాడు. ఇక ప్లాంట్ మ్యాన్‌గా హీరో పెళ్లి తర్వాత శోభనం కోసం ఇబ్బంది పడే సన్నివేశాలు కామెడీ తెప్పిస్తాయి. మరోవైపు ఈ సినిమాలో బాలనటిగా నటించిన అమ్మాయి(బేబి ప్రేక్షిత)తో దర్శకుడు మంచి కామెడీనే పండించాడు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. సెకాండాఫ్ ఇంకాస్త బెటర్‌గా తీసుంటే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
హీరో చారి పాత్రలో నటించిన చంద్రశేఖర్ తన పరిధి మేరకు బాగానే నటించాడు. హీరోయిన్‌గా చేసిన సోనాలి పాణిగ్రాహి ఉన్నంతలో గ్లామరస్‌గా స్క్రీన్ పై కనిపించింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన అతనికి మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అటు హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన ప్రేక్షిత రాయలసీమ స్లాంగ్‌లో తనదైన కామెడీతో అదరగొట్టేసింది. ఇక హీరోయిన్‌ను ప్రేమించే ప్రేమికుడి పాత్రలో యాక్ట్ చేసిన అతని నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు. సైంటిఫిక్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారు ఈ జోనర్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3