టిప్పు, కౌసల్యా కృష్ణమూర్తి చిత్రాలతో ఆకట్టుకున్న యువ హీరో కార్తీక్ రాజు… ఇప్పుడు ఓ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో మన ముందుకు వచ్చాడు. యువ దర్శకుడు మహేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పేరు ‘అథర్వ’. అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నూతలపాటి నరసింహం నిర్మించారు. ఇందులో యువ నటి సిమ్రాన్ చౌదరి, ఐరా, లహరి, ఆనంద్, గగన్, కబీర్ సింగ్ దులహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.
కథ: కర్ణ(కార్తీక్ రాజు) బాగా చదువుకున్న ఓ గ్రామీణ యువకుడు. పోలీసు డిపార్ట్ మెంట్ లో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. అయితే ఆరోగ్య సమస్యల వల్ల… ఆ డిపార్ట్ మెంట్ లో సెలెక్ట్ అవ్వడు. దాంతో స్నేహితుల సూచన మేరకు అదే డిపార్ట్ మెంటుకు సహాయ సహకారాలు అందించే క్లూల్ టీమ్ లో జాయిన్ కావాలని అనుకుని ఆ డిపార్ట్ మెంట్ లో సెటిల్ అవుతాడు. అలా క్లూస్ టీమ్ లో జాయిన్ అయిన కర్ణకి తన క్లాస్ మేట్ అయిన నిత్య(సిమ్రాన్ చౌదరి) ఓ సందర్భంలో పరిచయం అవుతుంది. ఆమెను కర్ణ ప్రేమిస్తుంటారు. అలా ఇద్దరూ ట్రావెల్ అవుతున్న సమయంలో నిత్య స్నేహితురాలు జ్యోస్నిత(ఐరా), ఆమె బాయ్ ఫ్రెండ్ శివ(శివకుమార్) అనుమానాస్పద స్థితిలో చనిపోయి వుంటారు. జ్యోస్నితను శివనే చంపి వుంటారని పోలీసులు భావిస్తారు. అయితే నిత్యకు శివ, జ్యోస్నితల లవ్ గురించి తెలిసి… శివ అలాంటోడు కాదని కర్ణకి చెబుతుంది. దాంతో కర్ణ… ఈ హత్యల వెనుక ఎవరున్నారనే దాన్ని ఎలా ఛేదించారనేదే మిగతా కథ.
కథ… కథనం విశ్లేషణ: ఓ క్రైం సీన్ జరిగినప్పుడు పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ ని సీజ్ చేసి… క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తారు. క్లూస్ టీమ్ ఇచ్చే ఆధారాలను బట్టే పోలీసులు కేసులను ఛేదిస్తారు. అలాంటి క్లూస్ టీమ్ గురించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. మొదటి సారి… క్లూస్ టీమ్ ని ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అథర్వ’. ఇందులో అనుమానాస్పదంగా చనిపోయిన ఓ ప్రేమ జంట హత్యల వెనుక ఎవరున్నారనే దాన్ని ఛేదించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా సెకెండాఫ్ హాల్ లో వచ్చే క్రైం ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కాస్త… సోసోగా ఉన్నా… ద్వితీయార్థం మాత్రం అథర్వ… సస్పెన్స్ సీన్స్ తో అదరగొడుతుంది. ఎక్కడా ప్రేక్షకుడు ప్రిడిక్షన్ చేయని స్క్రీన్ ప్లేని నడిపించి… చివర్లో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.
కార్తీక్ రాజు క్లూస్ టీం మెంబర్ గా బాగా మెప్పించారు. ఫస్ట్ హాఫ్ సోసోగా ఉన్నా… సెకెండాఫ్ లో మాత్రం కార్తీక్ బాగా సెటిల్డ్ గా నటించి మెప్పించారు. అతనితో పాటు నటించిన స్నేహితుల పాత్ర కూడా బాగుంది. అలాగే హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ చౌదరి క్రైం రిపోర్టర్ నిత్యగా పర్వాలేదనిపించింది. ఆమె స్నేహితురాలిగా నటించిన ఐరా పాత్ర కూడా బాగుంది. కథ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. అలాగే నటుడు శివ కూడా బాగా చేశాడు. యాంకర్, నటి లహరి… క్లూస్ టీమ్ మెంబర్ సారా పాత్రలో హాట్ కనిపించి ఆకట్టుకుంది. గగన్ కూడా రౌద్రంగా కనిపించి మెప్పించారు.
యువ దర్శకుడు మహేష్ రెడ్డి… ఓ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని… క్లూస్ టీమ్ ఆధారంగా తెరకెక్కించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా ద్వితీయర్థం కోసం రాసుకున్న కథనం ఎంగేజింగ్ గా ఉంది. అందుకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతమే బలం. అది ఇందులో ఉంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3