• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, July 6, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

Maari by Maari
July 6, 2026
in Cinema, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

Share and Enjoy !

Shares
Twitter

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్ , రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..

*వంశీ నందిపాటి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్. మిడిల్ క్లాస్ జీవితాల్ని చూపించారు. సినిమాని చూస్తూ నేనెంతో ఎంజాయ్ చేశాను. ఎంతో వైబ్ కనిపించింది. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించిన చిత్రాల జాబితాల్లో ‘అమీర్ లోగ్’ ఉంటుంది. బిల్డింగ్ స్ట్రక్ఛర్ గురించి రమణా రెడ్డి గారిని కలిశాను. ‘అమీర్ లోగ్’తో రమణా రెడ్డి గారు నన్నైతే నిరుత్సాహపర్చలేదు. ఎంతో ఎత్తైన బిల్డింగ్‌లను నిర్మించే రమణా రెడ్డి గారు.. ‘అమీర్ లోగ్’ని అంతే ఎత్తులో నిలబెట్టారు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. ఇలాంటి ఓ చక్కటి చిత్రానికి స్మరణ్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని పది పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంతో ఎంతో మంది కొత్త వాళ్లు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

*దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చి టీజర్‌ను రిలీజ్ చేసిన వంశీ గారికి థాంక్స్. నేను రాసిన కథను నటనతో ఇంకో లెవెల్‌కి తీసుకు వెళ్లిన ఆర్టిస్టులకు థాంక్స్. మా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నాను’ అని అన్నారు.

*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ* ..‘‘అమీర్ లోగ్’ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

*కామ్రేడ్ కళ్యాణ్ నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రమణ రెడ్డికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఈ టీం అంతా ఎంతో కష్టపడి మూవీని చేసింది. ఇలాంటి ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. స్మరణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మూవీకి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ నాకెంతో ప్రత్యేకం. షూటింగ్ అంతా లంగర్ హౌజ్‌లో, మ్యూజిక్ అంతా కాచిగూడలో జరిగింది. ప్రాపర్ హైదరాబాద్ సినిమా. ఈ మూవీలో బిర్యానీ గురించే ఎక్కువగా ఉంటుంది. అందరూ కొత్త వారే నటించారు. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

*మనోహర్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ సినిమా బాగా వచ్చింది. ఫలితాన్ని ఆడియెన్స్ చెబుతారు. త్వరలోనే మా మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నామ’ని అన్నారు.

*నటుడు మనోజ్ మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ టీజర్ లాంచ్‌కి వచ్చిన వంశీ గారికి థాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న స్పిరిట్‌ మీడియాకి థాంక్స్. మా అందరినీ ఎంకరేజ్ చేసిన రమణ గారికి థాంక్స్. మాధవి గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. స్మరణ్ అన్న మ్యూజిక్ వల్ల మా సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాం. త్వరలోనే మరింత కంటెంట్ మా చిత్రం నుంచి రానుంది’ అని అన్నారు.

*వేద జలంధర్ మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చిన వంశీ గారికి థాంక్స్. రమణ గారి వల్లే ‘అమీర్ లోగ్’ అద్బుతంగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. గీత అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. స్మరణ్ వల్లే మా సినిమా స్థాయి పెరిగింది. విజువల్స్ ఎంతో నేచురల్‌గా ఉంటాయి. మరిన్ని అప్డేట్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తామ’ని అన్నారు.

*నటుడు విశ్వేందర్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘అమీర్ లోగ్’ నా మనసుకు నచ్చిన చిత్రం. ఈ కథ అంతా కూడా బిర్యానీ చుట్టూనే తిరుగుతుంది. ఈ అద్భుతమైన టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ పాత్ర నటించినట్టుగా అనిపించదు. మా మూవీని రిలీజ్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

*నటీనటులు* :

ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు.

*సాంకేతిక బృందం:*

దర్శకుడు: రమణ రెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచూరి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DoP : ఎస్‌వీకే (SVK)
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్స్ డిజైన్: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బొరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
పీఆర్‌వో: సాయి సతీష్

Films Like Ameer Log Are What Make the Telugu Film Industry Proud: Successful Producer Vamsi Nandipati at the Teaser Launch Event

Ameer Log, produced by Madhavi Reddy Soma under the Awwal Number Productions LLP banner and directed by Ramana Reddy Soma, is gearing up for release. The film stars MC Hari, Manoj, and Sasidhar in the lead roles, with Vedha Jalandharr, Raavan Nitturu, Vishwender Reddy, Sai Yogi, and others playing key characters. The film will be distributed by Rana Daggubati’s Spirit Media.

Successful Producer Vamsi Nandipati unveiled the film’s teaser at a grand launch event, where the cast and crew shared their excitement.

*Vamsi Nandipati said* , “I’ve already watched Ameer Log, and I thoroughly enjoyed it. At first glance, the title may make people think it’s about financial wealth, but it’s actually about being rich in friendship, love, and relationships. It beautifully portrays the lives of middle-class families with tremendous authenticity.

The film carries an incredible vibe throughout. I believe Ameer Log will be remembered as one of the finest films to showcase the true spirit of Hyderabad. I first met director Ramana Reddy while discussing building structures, and he certainly hasn’t disappointed me with this film. Just as he builds towering structures in real life, he has elevated Ameer Log to great heights on screen.

Every actor has delivered a remarkable performance, while Smaran has composed an outstanding soundtrack. All ten songs in the film are exceptional. The movie also introduces several fresh talents to the industry. Films like Ameer Log are what make the Telugu film industry stand tall with pride. I sincerely thank Spirit Media for supporting such a meaningful film.”

*Director Ramana Reddy Soma stated,* “Thank you to everyone who attended the teaser launch of Ameer Log. A special thanks to Vamsi garu for taking the time to unveil our teaser. I’m grateful to all the actors who elevated my story with their wonderful performances. I’m confident that our film will entertain audiences and leave them with a memorable experience.”

*Executive Producer Sandeep Boreddy affirmed,* “My heartfelt thanks to everyone who joined us for the teaser launch event of Ameer Log.”

*Producer Venkata Krishna (Comrade Kalyan Productions) said* , “Thank you to everyone who came to support the teaser launch. Ramana Reddy has immense passion for cinema, and the entire team has worked incredibly hard to bring this film to life. Such sincere efforts deserve everyone’s encouragement. Smaran has delivered wonderful music, and I hope this film receives the success it truly deserves.”

*Music Director Smaran Sai stated* , “Ameer Log is a very special project for me. The film was shot entirely around Langar Houz, while the music was composed in Kachiguda- making it a truly authentic Hyderabad film. Interestingly, biryani plays a significant role throughout the story. The entire cast consists of newcomers who have done a fantastic job. I’m sure audiences will enjoy the teaser, and I’m confident the film will win everyone’s hearts.”

*Co-Producer Manohar Reddy Manchuri said* , “Ameer Log has turned out really well. Ultimately, the audience will decide the film’s fate, and we’re excited to bring it before them very soon.”

*Actor Manoj avowed* , “My sincere thanks to Vamsi garu for gracing our teaser launch and to Spirit Media for supporting our film. I also thank director Ramana garu for encouraging all of us and producer Madhavi garu for making this project possible. Smaran anna’s music has taken our film to another level. We hope everyone enjoys the teaser, and there is plenty of exciting content from the film coming soon.”

*Actress Vedha Jalandharr said* , “My heartfelt thanks to Vamsi garu for supporting us. Ameer Log has shaped up wonderfully under Ramana garu’s direction, and I hope audiences love the teaser. I’m grateful to the director and producers for trusting me with the role of Geetha. Smaran’s music has significantly elevated the film, while the visuals look incredibly natural. We look forward to sharing more exciting updates with everyone soon.”

*Actor Vishwender Reddy stated,* “Ameer Log is a film that’s very close to my heart. The story revolves around biryani in a unique and entertaining way. It has been a wonderful experience working with such a talented team. None of the performances feel artificial- every character comes across as completely natural. I also thank Spirit Media for presenting our film to audiences.”

Cast: MC Hari, Manoj, Sasidhar, Vedha Jalandharr, Raavan Nitturu, Vishwender Reddy, Sai Yogi, and others.

*Technical Crew:*

Director: Ramana Reddy Soma
Producer: Madhavi Reddy Soma
Co-Producer: Manohar Reddy Manchuri
Release: Rana Daggubati’s Spirit Media
Director of Photography: SVK
Editor: Rohit Penumatsa
Music: Smaran Sai
Poster Design: Shakti
Sync Sound & Mixing: Swapnik Rao
Chief Assistant Director: Sai Yogi
Executive Producer: Sandeep Boreddy
Line Producer: Sharath Polavarapu
PRO: Sai Satish

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ నందిపాటి

by Maari
July 6, 2026
0

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

by Maari
July 6, 2026
0

రాంజీ డాట్: టాలీవుడ్‌లో క్రియేటివ్ విజువల్స్‌ను పునర్నిర్వచిస్తున్న వీఎఫ్ఎక్స్ (VFX) సూపర్‌వైజర్

రాంజీ డాట్: టాలీవుడ్‌లో క్రియేటివ్ విజువల్స్‌ను పునర్నిర్వచిస్తున్న వీఎఫ్ఎక్స్ (VFX) సూపర్‌వైజర్

by Maari
July 4, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ రెండో గీతం ‘చింగారి’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

‘VISA – వింటారా సరదాగా’ రెండో గీతం ‘చింగారి’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

by Maari
July 2, 2026
0

హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా “సమ్మర్ హాలిడేస్” సినిమాలోని ‘క్రష్..’ సాంగ్ లాంఛ్

హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా “సమ్మర్ హాలిడేస్” సినిమాలోని ‘క్రష్..’ సాంగ్ లాంఛ్

by Maari
July 2, 2026
0

ఘనంగా ప్రారంభమైన ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం

ఘనంగా ప్రారంభమైన ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం

by Maari
July 1, 2026
0

‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశాల్

‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశాల్

by Maari
June 29, 2026
0

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి “స్టూడెంట్” మూవీ టీజర్ రిలీజ్

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి “స్టూడెంట్” మూవీ టీజర్ రిలీజ్

by Maari
June 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.