• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఉచిత ఐ క్యాంప్… ఎంతో మంచి కార్యక్రమం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

admin by admin
February 19, 2024
in Cinema, Latest News, news, Politics, Politics, special
0
ఉచిత ఐ క్యాంప్… ఎంతో మంచి కార్యక్రమం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వందలాది మందికి ఉచిత కంటి చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాట్లాడుతూ – మా అసోసియేషన్ ద్వారా అమెరికాలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. యూఎస్ లో ఉన్న తెలుగు అసోసియేషన్స్ లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 3 వేల మంది సభ్యులతో ప్రారంభించాం. అక్కడ అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా వీలైనంత మందికి సేవ చేయాలని అనుకుంటున్నాం. ఈ ఐ క్యాంప్ ను పది రోజుల పాటు నిర్వహిస్తున్నాం. సుమ గారు లేకుంటే మేము ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయగలిగేవాళ్లం కాదు. అలాగే శంకర్ నేత్రాలయ వారికి, మన ,సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఇకపైనా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అన్నారు.

సుమ కనకాల మాట్లాడుతూ – ఇవాళ ఈ ఐ క్యాంప్ లో పాల్గొనేందుకు వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మేము స్థాపించిన ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థతో కలిసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, శంకర్ నేత్రాలయ వారితో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ వారు తమ సహకారం అందిస్తున్నారు. జుబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కూడా తమ వంతు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఐ క్యాంప్ ను సినీ, టీవీ అసోసియేషన్ లోని సభ్యులంతా వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ – మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, శంకర్ నేత్రాలయ వారికి, ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ స్టార్ట్ చేసిన సుమకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఆయన ఈ కార్యక్రమానికి రావడమే కాదు సహాయం కోసం వచ్చిన వారందరి ప్రయాణ ఖర్చులు తానే ఇస్తానని ప్రకటించారు. అందుకు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారాలు చెబుతున్నా. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఉచితంగా కంటి కాటరాక్ట్ చికిత్స అందించడం సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వారిలో రెండు మూడు వందల మంది నాకు బాగా పరిచయం ఉన్నవాళ్లు ఉన్నారు. మీ అందరికీ కంటి చూపు బాగయ్యి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నా. మా ఆవిడ సుమ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

తెలుగు సినీ, టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేశ్ మాట్లాడుతూ – కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియం వెన్యూను మనకు 8 రోజుల పాటు ఇచ్చేలా హెల్ప్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, సుమ గారికి, శంకర్ నేత్రాలయ వారికి థ్యాంక్స్. సుమ గారు మా అసోసియేషన్ లోని అందరినీ పిలిచారు. సభ్యులంతా ఈ వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. సుమ మంచి మనసుకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ భాగమైనందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. అన్నారు.

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ – ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నమస్కారాలు. కంటి వైద్యం చేయించుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఐ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ శ్రీనివాస్ గారు, ప్రదీప్ గారు, విజయ భాస్కర్ గారికి, శంకర నేత్రాలయ వారికి, మనకు ఇష్టమైన యాంకర్ మాత్రమే కాదు మనకు ఇష్టమైన చెల్లెమ్మ సుమ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైద్యులందరికీ నమస్కారాలు. సుమ గారిని సినిమా కార్యక్రమాల్లోనే చూస్తుంటాం. మాటలు ఆమెకు దేవుడు ఇచ్చిన వరం. మీరంతా కలిసి మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఇవాళ మా ప్రభుత్వం పేదల విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. గత ప్రభుత్వం పేదలకు వైద్యం అందించడంలో విఫలమైంది. పేదలకు అనారోగ్యం వస్తే ఎవరూ ఆదుకోరు. అందుకే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య సహాయం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. అప్పట్లో వైఎస్ గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించినప్పుడు అమెరికాలో కూడా ఫ్రీ హెల్త్ స్కీమ్ లేదు. ఒబామా ప్రెసిడెంట్ అయ్యాక ఒబామా కేర్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికి 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. రాబోయో మూడు రోజుల్లో మరింత మందికి వైద్య సహాయం అందిస్తారని కోరుకుంటున్నా. అలాగే నా తరుపున మా స్టాఫ్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. ఏ సహాయం కావాలన్నా చేస్తారు. ఈ కార్యక్రమంలో వైద్య సహాయం పొందుతున్న వారికి వైద్య పరీక్షలు, ప్రయాణ, భోజన, ఇతర ఖర్చులు ప్రభుత్వం తరుపున కాదు మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున ఎన్ని లక్షల ఖర్చైనా మేము సొంతంగా పెట్టుకుంటాం. సమాజంలో స్తోమత గల ప్రతి ఒక్కరూ పేదల కోసం సహాయ కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నా. అప్పుడే మీ జీవితాల్లో నిజమైన సంతృప్తి పొందగలుగుతారు. నానక్ రామ్ గూడలో ఉన్న స్థలం అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్స్ ఆపించాం. అక్కడ సినిమా ఇండస్ట్రీ తరుపున పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేస్తాం. మా సీఎం రేవంత్ రెడ్డి తరుపున, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అన్నారు.

Previous Post

మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇంటి నెం. 13′ మార్చి 1న విడుదల..!

Next Post

కలియుగం పట్టణం.. మార్చి 22న విడుదల

Next Post
కలియుగం పట్టణం.. మార్చి 22న విడుదల

కలియుగం పట్టణం.. మార్చి 22న విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.