• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, March 3, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్… ధీర

Maari by Maari
February 2, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, Reviews, special
0
ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్… ధీర

Share and Enjoy !

Shares
Twitter

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారి గురించి తెలియని వారుండరు. అతని కుమారుడు చదలవాడ లక్ష్… ఇప్పటికే వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రాలలో నటించి మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా ధీర అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించారు. ఇందులో నేహా పఠాన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా… ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈచిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: డబ్బుకోసం ఏదైనా చేసే రకం రణధీర్(లక్ష్ చదలవాడ). అతనికి డబ్బు అంటే ఎంత పచ్చి అంటే… తను ప్రేమించిన అమ్మాయిని సైతం డబ్బుకోసం వదులుకునేంత. అలాంటి రణధీర్ కు ఓ బంపర్ ఆఫర్ తగులుతుంది. అది ఏంటంటే… ఒక పాతిక లక్షల రూపాయలు ఇస్తాం అంటే … విశాఖపట్నం నుంచి కోమాలో ఉన్న పేషెంట్ ని హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతాడు. అంబులెన్స్ డ్రైవర్ గా వెళ్లిన ధీర్ కి ఆ అంబులెన్స్ లో డాక్టర్ గా వచ్చేది డబ్బుకోసం తను వదిలేసిన మాజీ ప్రేయసి అమృత (నేహా పఠాన్) అని తెలుస్తుంది. ఇలా వీరిద్దరి జర్నీ. ఆసక్తిగా సాగుతున్న క్రమంలో… లోపల ఉన్న పేషెంట్ ని చంపడానికి కొన్ని గ్యాంగులు మార్గం మధ్యలో ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే వారి నుంచి చాకచక్యంగా ఆ పేషెంట్ ని హైదరాబాద్ హాస్పిటల్ కి తరలిస్తాడు రణధీర్. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక తల్లి… బిడ్డ తాను డ్రైవ్ చేస్తున్న వాహనంలో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. అయితే ఓ గ్యాంగ్ ఆ తల్లిని చంపి … బిడ్డను తీసుకు పోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తల్లి ఆ గ్యాంగ్ చేతిలో చనిపోతుంది. దాంతో ఆ బిడ్డని కాపాడే బాధ్యత రణధీర్ పై పడుతుంది. అసలు రణధీర్ తీసుకెళ్లిన పేషెంట్ ఎవరు? రణధీర్ ను తన బిడ్డని కాపాడమని ప్రాధేయపడిన మహిళ ఎవరు? చిన్న పాప కోసం ఎందుకు కొన్ని గ్యాంగులు వెంట పడుతున్నాయి? ఆ బిడ్డని రణధీర్ ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ కి… సరైన కథ.. కథనాలుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇందులో భాగంగానే… ధీర సినిమా ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ ని కాస్త వింతగా చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒక వ్యక్తిగా ధీర క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఎందుకు అలా చేస్తున్నాడు? అనే విషయాన్ని మాత్రం చివరి వరకు కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. అయితే డబ్బు కోసం ఏమైనా చేయగలిగే ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడడం కోసం మరొక మహిళ ప్రాణాలు అర్పించి తన బిడ్డను కాపాడమంటే ఆ బిడ్డ కోసం 2500 కోట్ల రూపాయలను సైతం కాలదన్ని ఆ బిడ్డను కాపాడేందుకు వెళ్లిన విషయం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ ని కాస్త భిన్నంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు సినిమా గడుస్తున్న కొద్ది కథలో ఒక్కొక్క లేయర్ ను రివీల్ చేస్తూ వచ్చాడు. అయితే కథ కాస్త ఊహకి దూరంగా ఉన్నా తర్వాత ఏం జరగబోతుంది? అనే విషయం మీద క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. అది సినిమాకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. విక్రాంత్ శ్రీనివాస్ రూపొందించిన ధీర ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌. రొటీన్ సన్నివేశాలు అనిపించినప్పటికీ సినిమాలో తరువాత ఏమిటి ? అనే ఆసక్తి కలుగుతుంది. రొమాంటిక్ సహా కొన్నికామెడీ సీన్స్ తో అడపాదడపా కథనాన్ని స్లో చేసినట్లు అనిపించింది. ఇక సెకండాఫ్, అయితే యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండి ఉంది. సినిమా మాంచి ఊపుమీద ఉన్నప్పుడు కూడా దర్శకుడు గ్యాప్ లో హాస్యాన్ని నింపే ప్రయత్నాన్ని చేసినట్లు ఈజీగా అర్థమవుతుంది. కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయినట్లు అనిపించలేదు. కథనంలో సూక్ష్మంగా ఇమిడింపచేసిన రాజకీయ కోణాలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే డబ్బు కోసం ఏమైనా చేసే యువకుడి పాత్రలో లక్ష్ చదలవాడ తనదైన స్టైల్ లో నటించాడు. ఆయన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఫైట్స్ లో ఇంటెన్స్ కనిపించింది. నేహా పఠాన్, ఒక డాక్టర్ పాత్రను పోషించి ఆకట్టుకుంది. ఎమోషనల్ అమ్మాయిగా సరిగ్గా సూట్ అయింది. సోనియా బన్సాల్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఉన్నంతలో తన మార్క్ చాటుకునే ప్రయత్నం చేసింది. సీఎం పాత్రలో సుమన్, ఆయన పీఏ పాత్రలో హిమజ ఆకట్టుకున్నారు. సామ్రాట్ రెడ్డికి చాలా కాలం తర్వాత ఫుల్ లెన్త్ రోల్ దొరికింది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సాయి కార్తీక్ సంగీతం, జానర్‌కు తగినట్లుగా ఉంది. కొన్ని పాటలు క్యాచీగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సిటీని పెంచింది. వినయ్ రామస్వామి ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో నటించడం రిఫ్రెషింగ్ ఫీల్ ఇచ్చింది – హీరోయిన్ లావణ్య త్రిపాఠీ

Next Post

ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్… ఐ హేట్ యు

Next Post
ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్… ఐ హేట్ యు

ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్… ఐ హేట్ యు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేసే పర్‌ఫెక్ట్‌ సినిమా – దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌

by Maari
March 2, 2026
0

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు

by Maari
March 2, 2026
0

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

సన్ ఆఫ్ రివ్యూ.. కట్టి పడేసే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్

by Maari
February 28, 2026
0

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి మధుర గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదల

by Maari
February 28, 2026
0

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

by Maari
February 28, 2026
0

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 28, 2026
0

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

by Maari
February 28, 2026
0

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

by Maari
February 28, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.