• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Maari by Maari
February 13, 2026
in Cinema, Latest News, Movies, news
0
Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Share and Enjoy !

Shares
Twitter

విశ్వక్‌సేన్‌, కయాదు లోహర్ జంటగా… ‘జాతిరత్నాలు’ దర్శకుడు కె.వి.అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘ఫంకీ’. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఆడియన్స్‌లో ఓ పాజిటివ్‌ బజ్‌ మొదలైంది. పైగా ప్రతిష్టాత్మక నిర్మాణం సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో కచ్ఛితంగా సినిమా బావుంటుందనే అంచనాలో ప్రేక్షకులు ఉన్నారు. ఈరోజే ఈ సినిమా విడుదల అయింది. మరి ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ ఏమిటంటే…
కోమల్‌(విశ్వక్‌సేన్‌) దర్శకుడిగా తొలి సినిమా చేస్తుంటాడు. అనుకున్న దానికంటే బడ్జెట్‌ పెంచేయడంతో అవకాశం ఇచ్చిన నిర్మాత అనారోగ్యపాలవుతాడు. తన తండ్రిని ఈ స్థితికి తెచ్చిన కోమల్‌పై నిర్మాత కూతురు చిత్ర(కయాదు లోహర్‌)కి చెప్పలేనంత కోపం వస్తుంది. కోమల్‌ని దర్శకుడిగా తీసేస్తుంది. సినిమా ఆపేస్తుంది. ఇక ఎలాగొలా చిత్ర కోపాన్ని తగ్గించి సినిమాలు మళ్లీ మొదలుపెట్టాలని కోమల్‌ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. ఓ దశలో చిత్ర ఒప్పుకుంటుంది. మిగిలిన సినిమాను తాను చెబుతున్న బడ్జెట్‌లో కాకుండా కేవలం కోటి రూపాయల్లో పూర్తి చేయాలనే షరతుతో సినిమాను మళ్లీ మొదలు పెడుతుంది చిత్ర. మరి కోమల్ అనుకున్న బడ్జెట్ లో సినిమాని కంప్లీట్ చేసాడా? అందుకు అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? చిత్ర కోమల్ కి ఏవిధంగా సహకరించింది… వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టి… ఫలించింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…
దర్శకుడు అనుదీప్‌ కేవలం నవ్వించడానికే ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఓ సింపుల్‌ లైన్‌ని తీసుకొని ఫన్‌ మోడ్‌లో సినిమా అంతటినీ నడిపించాడు దర్శకుడు అనుదీప్‌. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో పాటు మధ్య వచ్చి వెళ్లిపోయే పాత్రలు సైతం సైటైర్లు వేస్తుంటాయి. దీనికోసం దర్శకుడు రాసుకున్న ఫన్నీ వన్‌లైనర్లు కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఈ కథలో హీరోయిన్‌ని హీరో ప్రేమిస్తాడు. కానీ అమ్మతో కాసేపు ఫోన్లో మాట్లాడటాన్ని మాత్రం గలీజుగా ఫీలవుతాడు. బంధాలంటే అతనికి గలీజు. అది తప్పని హీరోయిన్‌ని ప్రేమించిన తర్వాత తెలుసుకుంటాడు. దీన్ని బట్టి హీరో పాత్ర చిత్రణని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దర్శకుడు అనుదీప్‌ ఈ కథలో బంధాలకు విలువివ్వాలని చెప్పాడు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఉంటుంది.. కానీ వ్యక్తపరచుకునే అవకాశం, సందర్భం వారిద్దరికీ రాదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పడిన అంతర్మథనం బావుంది. అక్కడక్కడ దిల్‌రాజు, నాగవంశీ, కల్యాణ్‌కృష్ణ, హరీష్‌శంకర్‌, చిత్ర దర్శకుడు కె.వి.అనుదీప్‌.. వీరంతా సందర్భానుసారం అలా కనిపించి, ఇలా మాయమై సినిమాకు నిండుదనాన్ని తెచ్చారు. మొత్తంగా సినిమా ఆద్యంతం నవ్విస్తూ, నవ్వించడానికి ప్రయత్నిస్తూ సాగింది..

విశ్వక్‌సేన్‌ ఎప్పటిలాగే తనదైన జోష్‌తో ఆకట్టుకుంటాడు. ఈ కథలో ఆయన కొత్తగా చేయడానికి ఏం లేదు. ఉన్నంతలో బాగా చేశాడు. కథానాయిక కయాదు లోహర్‌ ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌. తను చాలా అందంగా కనిపించింది. అంతే అందంగా నటించింది కూడా. నిర్మాత కూతురుగా ఆమె నటన ఈ సినిమాకు హైలైట్‌. ఇక నరేష్‌ ఎప్పటిలాగే తనదైన నటనా పటిమతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తారు. మిచ్చి సంపత్‌ ఇందులో జీకే.. అనే కామెడీ విలన్‌గా కనిపిస్తారు. ఆయన కూడా అక్కడక్కడ నవ్విస్తారు. ఇక ఈ సినిమాలోని మిగతా తారాగణం కూడా పరిథిమేర రక్తికట్టించారు.

కె.వి.అనుదీప్‌ సినిమా నేపథ్యంలో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ కథ రాసుకున్నాడు. కథలో ఇంకాస్త సీరియస్‌నెస్‌ ఉంటే బావుండేది. కథ ఆద్యంతం లైటర్‌వేలో సాగింది. కథలో సంఘర్షణలు తక్కువ. అక్కడక్కడ హీరోకు ఎదురయ్యే సమస్యలను కూడా కామెడీగా సాగాయి. మొత్తంగా ఆడియన్స్‌ని నవ్వించే విషయంలో కొంతమేర కె.వి.అనుదీప్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం

by Maari
February 12, 2026
0

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ పూర్తిగా వినోదాత్మక చిత్రం- లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
February 11, 2026
0

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
February 11, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.