• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, April 23, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల

Maari by Maari
December 24, 2025
in Cinema, Latest News, Movies, news
0
‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ విడుదలైంది.

‘ఫంకీ’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ‘ధీరే ధీరే’కి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం.

వినసొంపుగా ఉన్న ఈ ‘ధీరే ధీరే’ మెలోడి, వినగానే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయేలా ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జోడి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాటలో కొత్తదనం ఉట్టిపడటమే కాకుండా, యువతకు చేరువయ్యేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో శైలి సంగీతానికి శ్రోతలలో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆయన శైలిలో సాగిన ఈ ‘ధీరే ధీరే’ పాట తక్షణ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదానికి పేరుగాంచిన అద్భుతమైన కలయికలో ‘ఫంకీ’ రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. కాలు కదిపే పాటలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తొలి పాట ‘ధీరే ధీరే’తో ఆ విషయాన్ని రుజువు చేశారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఫంకీ’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

విశ్వక్ సేన్-కయాదు లోహార్ సరికొత్త జోడి, విభిన్న పాత్రలు, ఉత్సాహభరితమైన సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి పేరొందిన దర్శకుడు.. ఈ అన్ని అంశాలతో ‘ఫంకీ’ చిత్రం వెండితెరపై అపరిమిత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ‘ఫంకీ’ చిత్రం, ప్రేక్షకులకు వినోదాల విందుని అందించనుంది.

చిత్రం: ఫంకీ
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
కళా దర్శకుడు: జానీ షేక్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

కపిల్‌ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్‌ రాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయిన టాలీవుడ్‌ ప్రో లీగ్‌

Next Post

ఎంగేజింగ్ స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్… ఈషా

Next Post
ఎంగేజింగ్ స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్… ఈషా

ఎంగేజింగ్ స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్... ఈషా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

by Maari
April 23, 2026
0

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ మరియు సంకల్పతరు ఫౌండేషన్…

by Maari
April 23, 2026
0

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “గేదెల రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

by Maari
April 22, 2026
0

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను – ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

by Maari
April 21, 2026
0

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

“సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ విడుదల

by Maari
April 21, 2026
0

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

టీఎఫ్‌డీఏ కోసం ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

by Maari
April 20, 2026
0

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” గ్లింప్స్ విడుదల

by Maari
April 20, 2026
0

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి నాచురల్ స్టార్ నాని క్లాప్

by Maari
April 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.