• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, June 26, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

Maari by Maari
June 26, 2026
in Cinema, Latest News, Movies, news, Politics, special, sports
0
ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

Share and Enjoy !

Shares
Twitter

ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

▪️ *ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వేడుక*
▪️ *జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల*
▪️ *హీరోయిన్‌గా వెండితెరకు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ పరిచయం*

హైదరాబాద్:
దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చిత్రబృందం తెలిపింది.

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన కుటుంబ కథా చిత్రమిది.

ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ… “ఈ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించాను. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ… “ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించే సినిమా ఇది. చాలా కాలంగా చేయాలనుకున్న తరహా పాత్ర ఈ సినిమాలో దక్కింది. మానవ సంబంధాల విలువను గుర్తు చేసే అద్భుతమైన కథ” అని అన్నారు.

దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ…”మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని. కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది” అని తెలిపారు.

నిర్మాతలు కోమలి, మహేందర్ తొట్టె మాట్లాడుతూ… “హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, మా సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానము. మధ్యతరగతి కుటుంబంలో నేను చూసిన అనుభవాలను ఈ సినిమాలో చూపించాం. సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని నిర్మించాం. జూలై 18న ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలి” అని కోరారు.

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ… “ఫోక్ సింగర్ కోమలి నిర్మాతగా సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలోని ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. మా టీమ్‌ను ఆశీర్వదించాలి” అని అన్నారు.

హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ… “‘జయమ్మ పంచాయితీ’ తర్వాత చేసిన మంచి సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా పాటలు సినిమాకు ప్రాణం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం అవుతుంది” అన్నారు.

హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ…”అందరికీ నచ్చే కథ ఇది. ప్రతి ఒక్కరూ ఎంతో మనసుపెట్టి పని చేశారు. నిర్మాత కోమలి గారు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18న ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

*సాంకేతిక నిపుణులు:*

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ ఆవాల
నిర్మాతలు: కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి
బ్యానర్: కోమలి క్రియేషన్స్
హీరో: దినేష్ కుమార్
హీరోయిన్: దివిజ ప్రభాకర్
ప్రధాన తారాగణం: మురళీధర్ గౌడ్, సుధ,సీనియర్ నటుడు కాశి విశ్వనాథ్, సెల్వరాజ్ మిర్చి మాధ‌వి, జ‌బ‌ర్‌ద‌స్త్ స‌త్య‌శ్రీ, హాసినీ, యూట్యూబ‌ర్స్ జీవ‌నప్రియ‌, గౌరి నాయుడు, తదితరులు.
సంగీతం, లిరిక్స్: చరణ్ అర్జున్, చిరంజన్
ఛాయాగ్రహణం: అనిల్ కుమార్
పి. ఆర్. ఓ : కడలి రాంబాబు

—

Grand Launch of ‘Venkatramayya Gari Taluka’ Teaser and Audio

▪️ *Star-Studded Event Held at Prasad Labs*
▪️ *Worldwide Theatrical Release on July 18*
▪️ *ETV Prabhakar’s Daughter Divija Prabhakar Makes Her Debut as Heroine*

Hyderabad: The teaser and songs of the upcoming family entertainer ‘Venkatramayya Gari Taluka’, starring Dinesh Kumar as the lead hero and introducing Divija Prabhakar, daughter of renowned actor ETV Prabhakar, as the heroine, were unveiled at a grand event held at Prasad Labs, Hyderabad, in the presence of several prominent personalities from the Telugu film industry.

Directed by Satish Awala and jointly produced by Komali Mahender Thotte and Somesh Saripalli under the Komali Creations banner, the film has completed all production formalities and is all set for a worldwide theatrical release on July 18.

The teaser and songs received an overwhelming response from the audience as well as members of the film fraternity. According to the makers, the film revolves around human relationships, family values, parental love, emotional bonding, and father sentiment, promising a deeply emotional cinematic experience.

The film also features Muralidhar Goud and Sudha in pivotal roles. It portrays the changing dynamics of modern-day relationships driven by money and highlights the emotional struggles faced by elderly parents in today’s society.

Speaking at the event, ETV Prabhakar said: “I am delighted to be part of the teaser and audio launch of this beautiful film. The story reminded me of the emotionally rich family dramas directed by Muthyala Subbaiah garu. It has been a long time since I heard such a touching script, and that is why I encouraged my daughter Divija to be a part of this project. Producer Komali has worked tirelessly to bring this film to life, while director Satish Awala has shouldered the responsibility with great dedication. The film beautifully portrays the greatness of a father and the importance of parents. Every song in this film has the power to touch the audience’s hearts. We always thought our daughter would become a doctor, but today she is making her debut as an actress through this wonderful film. I request everyone to bless her and wish the film grand success.”

Actor Muralidhar Goud said: “This is a film that will bring tears to everyone’s eyes. I have been waiting for a role like this for a long time. It is a wonderful story that reminds us of the true value of human relationships.”

Director Satish Awala said: “Respecting elders has always been an integral part of our Indian culture. This film reflects the challenges families face today and how those situations can be handled with love and understanding. I come from a journalism background, and I deeply understand the importance of family values. After watching Divija’s videos on social media, I felt she was perfect for this role and approached ETV Prabhakar garu. I am confident that everyone with a compassionate heart will connect with this film.”

Producers Komali Mahender Thotte & Somesh Saripalli
The producers said: “Just as ‘Hanu-Man’ became a blockbuster, we hope our film achieves similar success. This story is inspired by the experiences we witnessed in middle-class families. We believe no one will leave the theatre without getting emotional. We faced numerous challenges while making this film, and we sincerely request audiences to watch it in theatres on July 18 and support our efforts.”

Music director Charan Arjun said: “It is wonderful to see folk singer Komali producing a feature film. All six songs in this movie are emotionally powerful and will touch the hearts of the audience. We seek everyone’s blessings for our team.”

Hero Dinesh Kumar said: “After ‘Jayamma Panchayathi,’ this is another meaningful film in my career. It has all the elements to entertain audiences of every age group. The songs are the soul of the film, and I believe the movie will leave viewers with a memorable emotional experience.”

Making her silver screen debut, Divija Prabhakar said: “This is a story that will appeal to everyone. Every member of our team has worked with great dedication. Producer Komali garu has made this film with immense passion and commitment. I request audiences to watch our film in theatres on July 18 and bless us with their support.”

*Technical Crew*

Story, Screenplay, Dialogues & Direction: Satish Awala
Producers: Komali Mahender Thotte, Somesh Saripalli
Banner: Komali Creations
Hero: Dinesh Kumar
Heroine: Divija Prabhakar
Cast: Muralidhar Goud, Sudha, Mirchi Madhavi, Jabardasth Satyasri, Hasini, YouTubers Jeevan Priya, Gouri Naidu and others.
Music & Lyrics: Charan Arjun
Cinematography: Anil Kumar
PRO: Kadali Rambabu
—

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం” ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టీజర్, పాటల ఆవిష్కరణ

by Maari
June 26, 2026
0

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం” ప్రారంభం

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం” ప్రారంభం

by Maari
June 26, 2026
0

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

by Maari
June 20, 2026
0

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

by Maari
June 19, 2026
0

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

by Maari
June 19, 2026
0

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.