• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, September 29, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Maari by Maari
September 9, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Share and Enjoy !

Shares
Twitter

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ – నేను కంపోజ్ చేసిన ఒక పాట వల్ల నాకు ఈ మూవీ అవకాశం వచ్చింది. ఈ సినిమాకు మంచి సాంగ్స్, బీజీఎం అందించే అవకాశం దక్కింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కావాల్సినంత సమయం లభించింది. పాట ట్యూన్ తో పాటు సాహిత్యం అద్భుతంగా కుదిరాయి. మీ అందరికీ నచ్చేలా మా మూవీ ఉంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ – యూఎస్ లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న మాకు సినిమా అంటే ప్యాషన్. మేము గతంలో 24 కిస్సెస్ మూవీ నిర్మించాం. కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తూ ఇన్నోవేటివ్ కంటెంట్ ను ఆడియెన్స్ కు చూపించాలనే ప్రయత్నంతో మా సొంత బ్యానర్ పై “కళ్యాణం కమనీయం జీవితం” సినిమాను నిర్మించాం. నేను లాభపడకపోయినా ఫర్వాలేదు కానీ నష్టపోవడానికి సిద్దంగా లేను. మనందరిలో ఒకరికి జరిగే లాంటి కథే ఇది. ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా సినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమాకు పనిచేసింది కొత్త వారైనా ఎక్కడా కొత్త వారు చేసిన సినిమాలా అనిపించదు. శ్రీ మురళీ కార్తికేయ అందించిన మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది. మా సినిమాను అందంగా రూపొందించారు డైరెక్టర్ రవి లోకిరెడ్డి. నాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన కిషోర్ గారికి థ్యాంక్స్. మా మూవీని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లాడుతూ – నా మిత్రుడు ప్రసాద రావు ఈ కథ గురించి చెప్పిన వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా సినిమా ప్రొడక్షన్ లో భాగమయ్యాను. మనం మంచి ప్రయత్నం చేస్తే అంతా మంచే జరుగుతుంది అన్నట్లు మా సినిమా పోస్టర్ విజయేంద్రప్రసాద్ గారు, మా మూవీలోని సాంగ్ ను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు రిలీజ్ చేశారు. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు మాకు ఇష్టమైన డైరెక్టర్ వినాయక్ గారు అతిథిగా వచ్చారు. ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది. ఒక జంట మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం ఈ మధ్య చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అలా తమ జీవితాల్లోకి వచ్చిన ఓ వ్యక్తిని ఒక జంట ఎలా ఎదుర్కొన్నారు, తమ బంధాన్ని ఎలా నిలబెట్టుకున్నారు అనేది మా చిత్రంలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి. ఈ నెల 18న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – ఈ సినిమా చిన్నదే గానీ సినిమా తీసిన వాళ్లు చిన్న వాళ్లు కాదు. ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు, కిషోర్ గారికి మా డైరెక్టర్స్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. మా సత్యనారాయణ రెడ్డి గారికి మంచి మిత్రులు రాజవంశీ ఈ సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మూవీలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు, గుర్తింపు రావాలి. ఈ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు గారికి, కిషోర్ గారికి మరిన్ని మూవీస్ చేసే బలం చేకూరాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ కేఎల్ దామోదరప్రసాద్ మాట్లాడుతూ – ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇండస్ట్రీ పై ఉంది. వాళ్లు బాగుంటే మరో నాలుగు సినిమా తీసి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తారు. కానీ ఈ రోజు ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్ రాగానే వీలైనంత పిండిస్తున్నారు. “కళ్యాణం కమనీయం జీవితం” ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇందులోని పాయింట్ మేము గతంలో నిర్మించిన చిత్రాలకు దగ్గరగా ఉంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తున్నారు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే బాపు గారి రాధా కల్యాణం సినిమాలా అనిపిస్తోంది. పాటలు చాలా బాగున్నాయి. ఈ మూవీతో నా మిత్రులైన ప్రొడ్యూసర్స్ అభిరుచి తెలుస్తోంది. ఈ రోజు ప్రేక్షకులు మంచి కథను కోరుకుంటున్నారు. ఇంకే వెకిలి కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకోవడం లేదు. ఇరుముడి విజయం అందుకు నిదర్శనం. ఈ సినిమా కూడా అలాగే మంచి విజయం సాధించాలి. అన్నారు.

దర్శక నిర్మాత అయోధ్యకుమార్ మాట్లాడుతూ – నిర్మాత ప్రసాదరావు నాకు చిరకాల మిత్రులు. 24 కిస్సెస్ తర్వాత ఆయన నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా నేను చూశాను. ఫ్యామిలీ అంతా కలిసి చూసే మంచి సినిమా ఇది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి, టీమ్ అందరికీ పేరు తీసుకురావాలి.అ న్నారు.

ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. క్వాలిటీగా ఉంది. ఈ సినిమా ఒక అర్జున్ రెడ్డి, ఒక బేబి అయ్యేలా కనిపిస్తోంది. కంటెంట్ బాగుంటే ఈ రోజు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు కూడా ఆడియెన్స్ ఘన విజయం అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి విషిక మాట్లాడుతూ – ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ రవి గారు ఎంత మంచి మూవీ చేశారో ఈ నెల 18న థియేటర్స్ లో మీరంతా చూస్తారు. ఖాన్ దురాని, సాహితీ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ – మాది ఒక చిన్న పల్లెటూరు. దర్శకుడిగా రెండు చిత్రాలు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ చిత్రంతో ఒక సువర్ణావకాశం వచ్చింది. అందుకు తగినట్లే నాకు మంచి ప్రొడ్యూసర్స్, కాస్ట్ అండ్ క్రూ దొరికారు. వారి సపోర్ట్ తో ఒక మంచి మూవీని రూపొందించగలిగాను. ఈ కథకు ఒక మంచి పాయింట్ యాడ్ చేసి స్క్రిప్ట్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు నా మిత్రుడు అరవింద్. ఖాన్ దురాని, సాహితీ, విషిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. స్టార్ మేకర్ సత్యానంద్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయన మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నాం. శ్రీ మురళీ కార్తికేయ అద్భుతమైన మ్యూజిక్ మా సినిమాకు అందించారు. లిరిక్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సాంకేతికంగా మా మూవీని హై క్వాలిటీ ఔట్ పుట్ అందించిన మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ సాహితీ అవంచ మాట్లాడుతూ – రైటర్ అరవింద్ గారు ఇచ్చిన ఒక మంచి ఐడియాతో మా మూవీ స్టార్ట్ అయ్యింది. ఆ పాయింట్ ను మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి బ్యూటిఫుల్ మూవీగా రూపొందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సినిమాను నమ్మి స్ట్రాంగ్ గా నిలబడిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు మా లాంటి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఇలాంటి మంచి మూవీలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మంచి కథ ఉంటే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మీ ఆదరణ పొందుతుంది. ఈ నెల 18న థియేటర్స్ కు రండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.

హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ – ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఒక జంట తమ బంధాన్ని విడిపోకుండా చూసుకోవాలి అనే మంచి పాయింట్ తో మా సినిమాను డైరెక్టర్ రవి గారు తెరకెక్కించారు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ఇది. మంచి కథ, కథనం, మ్యూజిక్, పర్ ఫార్మెన్స్ లు, టెక్నికల్ గా క్వాలిటీ అన్నీ మా సినిమాలో చూస్తారు. నేను కెమెరామెన్ ను. కెమెరామెన్ హీరో కావడం ఏంటి అని కొందరు అన్నారు. కానీ నేను కెమెరా, ఎడిటింగ్, కలరింగ్..ఇలా అన్ని నేర్చుకున్నది హీరో కావడం కోసమే. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ నెల 18న థియేటర్స్ లో మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు : ఖాన్ దురాని, సాహితీ అవంచ , ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, ధనలక్ష్మి బల్ల తదితరులు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: విజయ్ దేవరకొండ

Next Post

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

Next Post
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: కథానాయకుడు ఆనంద్ దేవరకొండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

JAAN ఫస్ట్ లుక్: ప్రేమ, అనుబంధంతో కూడిన హృదయస్పర్శ కథ

by Maari
September 25, 2026
0

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

దోబుచులాటేలరా మూవీ రివ్యూ.. ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే మూవీ

by Maari
September 23, 2026
0

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

జాతీయ అవార్డులు అందుకున్న’కమిటీ కుర్రోళ్లు’బృందం

by Maari
September 23, 2026
0

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ వాయిదా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

by Maari
September 22, 2026
0

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

by Maari
September 22, 2026
0

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

by Maari
September 22, 2026
0

అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’

అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’

by Maari
September 21, 2026
0

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

హీరో శ్రీ నందు నటించిన మగాళ్లు జిందాబాద్ టైటిల్ లాంచ్

by Maari
September 18, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.