కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం K Ramp. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషన్స్ తో ఆది నుంచి ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: జీవితం మీద ఏమాత్రం సీరియస్ నెస్ లేకుండా…. జాలీగా తిరుగుతూ… లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకునే కుమార్ (కిరణ్ అబ్బవరం)… చదువుల్లో ప్రతి సారి ఫెయిల్ అవుతూ ఉంటాడు. దాంతో తన తండ్రి (సాయి కుమార్) … మంచిగా చదువుకోవాలని కేరళకి పంపుతాడు. అక్కడ తన క్లాస్ మేట్ క్రిస్టీ జాయ్ (యుక్తి తరేజా)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమెకి Post-traumatic Stress Disorder అనే మానసిక వ్యాధి ఉందని కుమార్‌కి తెలుస్తుంది. ఈ మానసిక రుగ్మత వల్ల కుమార్ ఎలా ఇబ్బంది పడ్డాడు? చివరికి ఆ వ్యాధి నయం అయ్యిందా? లేదా? తెలియాలంటే ‘K-ramp’ మూవీ చూడాల్సిందే…
విశ్లేషణ: ఇంతకు ముందు అమ్మాయిలు, అబ్బాయిల్లో ఉండే డిజార్డర్స్ మీద చాలా సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా హీరోయిన్ కు ఉండే ఓ సీరియస్ మానసిక రుగ్మతని తీసుకుని, దాని చుట్టూ కామెడీ లవ్‌స్టోరీగా మలచడంలో డైరెక్టర్ జైన్స్ నాని బాగానే సక్సెస్ అయ్యాడు. కథనాన్ని ఎక్కడా బోర్ కొట్టించకుండా… కామెడీని వర్కవుట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు జైన్స్ నాని.. సెకండాఫ్ మరింత కనెక్ట్ అయ్యేలా కథనాన్ని నడిపించాడు. ప్రతి ఒక్కరూ తమ తమ దైనందిన జీవితాన్ని ఆయా పాత్రల్లో చూసుకుంటారు.
కిరణ్ అబ్బవరం, చిత్తూరు యాసలో చెప్పే డైలాగులకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘K-ramp’ మూవీలో కూడా తన స్టైల్ డైలాగ్ డెలివరీ, పంచ్‌లు, సింగిల్ లైనర్స్‌తో చితక్కొట్టేశాడు కిరణ్ అబ్బవరం. ‘రంగబలి’ మూవీలో కనిపించిన హీరోయిన్ యుక్తి తరేజా, రెండేళ్ల తర్వాత ఈ సినిమాలో నటించింది. తన గ్లామర్‌తో యూత్‌కి నచ్చేసింది. సీనియర్ నరేష్ సెకండాఫ్ లో మరింత నవ్వించారు. తండ్రి పాత్రలో సాయికుమార్ ఎప్పటిలాగే నటించి మెప్పించాడు. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. హీరోయిన్ అంకుల్ పాత్రలో మురళీధర్ రావు మెప్పించాడు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. కేరళ అందాలను తెరపై మరింత అందంగా చూపించడంలో కెమెరామెన్ సతీశ్ రెడ్డి పనితనం కనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను చాలా క్వాలిటీగా తెరకెక్కించారు.
ఓవరాల్‌గా ‘K-ramp’ మూవీ, యూత్‌కి బాగా నచ్చే యూత్‌ఫుల్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్. మూవీని ఓ సారి సరదాగా చూసేయండి.
రేటింగ్: 3









