• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, February 20, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హృదయాన్ని హత్తుకునే మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ “కాలమేగా కరిగింది”

Maari by Maari
March 22, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
హృదయాన్ని హత్తుకునే మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ “కాలమేగా కరిగింది”

Share and Enjoy !

Shares
Twitter

బాల్యంలో చేసే స్నేహాలు కానీ… ఆ వయసులో చిగురించే ప్రేమలు కానీ జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ వయస్సులో స్వచ్ఛమైన ప్రేమతో మనస్సంతా ఉప్పొంగిపోయి వుంటుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫస్ట్ క్రష్ అనేది ఓ మధురమైన జ్జాపకం. అలాంటి మధుర స్మ్రుతులతో తెరకెక్కిన చిత్రమే ‘కాలమేగా కరిగింది’. అరవింద్ ముదిగొండ, నోమిన తార స్కూల్ డేస్ లో ప్రేమించుకునే టీజనేజర్స్ పాత్రలో నటించగా… వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి పెరిగి పెద్దవారై జీవితంలో స్థిరపడిన వారిగా కనిపించారు. శింగర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మరే శివశంకర్ నిర్మించారు. డెబ్యూ దర్శకుడు శింగర మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం కావడంతో మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: ఫణీంద్ర(అరవింద్ ముదిగొండ), బిందు(నోమిన తార) ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకుంటూ వుంటారు. బిందు అంటే ఫణీంద్రకు పంచప్రాణాలు. మొదట్లో బిందు హేట్ చేసినా… ఆ తరువాత ఫణీంద్ర నిజయతీని చూసి అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఇద్దరూ కలిసిమెలిసి తిరుగుతూ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ స్కూలింగ్ లైఫ్ ను గడిపేస్తూ వుంటారు. ఫైనల్ పబ్లిక్ పరీక్షల్లో ఫణీంద్ర త్రుటిలో ర్యాంకును కోల్పోతాడు. తనకు ర్యాంకు రాకపోవడానికి కారణం బిందునే అనుకుని… ఆ తరువాత వచ్చే ఇంటర్ లో మంచి మార్కులు సాధించాలని బిందుతో మాట్లాడటం మానేయడానికి సిద్దమవుతాడు . అలా విడిపోయిన వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలిశారు? అసలు బిందుకు పెళ్లి వగైరా ఏమైనా అయ్యాయా? ఫణీంద్ర జీవితంలో స్థిరపడిపోయి ఎలాంటి పొజిషన్లో జీవిస్తున్నాడు? తదితర వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే
కథ… కథనం విశ్లేషణ: చైల్డ్ హుడ్ మెమోరీస్ ఎప్పుడూ తీపి గుర్తులుగానే మిగిలిపోతాయి. అది స్నేహమైనా… ప్రేమ అయినా. బాల్యంలో చిగురించిన ప్రేమలు మాగ్జిమం ఫలించవు. అందుకు మనం ఎన్నో ఉదాహరణలు చూపించొచ్చు. అయితే తాలుకు గురుతులు మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలా నిత్యం ప్రేమలో తలమునకలై జీవించిన జంట యొక్క తాలూకు చిత్రమే ఇది. సినిమా మొదలైంది మొదలు… కవితాత్మకంగా హీరో, హీరోయిన్ల నోటి నుంచి జాలు వారే సంభాషణలు ప్రేక్షకుల మనస్సును తాకుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు తమ బాల్యంలో జరిగినే సంఘటనలను ఈ చిత్రంలో చూసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
టీనేజ్ లో చిగురించే ప్రేమలు… జీవితంలో స్థిరపడిపోయిన తరువాత కూడా మనల్ని వెంటాడుతూనే వుంటాయి అనేదానికి ఉదహరణగా వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి పాత్రలు. కల్మషంలేని స్వచ్ఛమైన ప్రేమను మది నిండా నింపుకుని ఎన్నో ఏళ్లు గడిచినా ఏమాత్రం ప్రేమ విషయంలో విశ్రాంతి తీసుకోకుండా జీవించిన జంట గురించి ఇందులో చూపించారు. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

బాల్యంలో అరవింద్ ముదిగొండ, నోమిన తార జంట చాలా బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేలు మనస్సును హత్తుకుంటాయి అంటే… దానికి కారణం ఈ జంటే. అంత బాగా నటించారు. అలాగే పెద్దవారైన తరువాత పాత్రల్లో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి వున్నది కాసేపే అయినా ప్రేక్షకుల మన్ననలను పొందారు. ముఖ్యంగా చివర్లో వీరిద్దరి పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

డైరెక్టర్ శింగర మోహన్ కి ఇది నాలుగేళ్ల కళ. అన్నీ తానై ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చూసుకున్నారు. ఇందులో దర్శకుడు ప్రతి పాత్రను కవితాత్మకంగా మాట్లాడించి ఆకట్టుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ ఒక స్టోరీని చెబుతంది. దాన్ని దర్శకుడు ఎంతో చాక చక్యంగా తెరపై ఆవిష్కరించారు. ఈ కథను తన సంగీతంతో మరింత బ్యూటిఫుల్ గా తయారుచేశారు సంగీత దర్శకుడు గుడప్పన్. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్లకు, ట్రైలర్లకు మంచి సంగీతం కుదరింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ప్రతి పాత్రను ఎంతో బాగా చూపించారు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చివరగా… కాలమేగా కరిగింది అనేది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కలహాలే లేని ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. ఇది ఎంతో పొయెటిక్ గా తెరకెక్కింది. దాంతో అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఓసారి సరదాగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ లో ఓ లుక్కేసేయండి.

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Tags: Kaalamega karigindi Telugu Review ReviewKaalamega Telugu movie Rating
Previous Post

ప్రేక్షకులను డివోషనల్ థ్రిల్ కు గురిచేసే ‘షణ్ముఖ’

Next Post

యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

Next Post
యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

యువన్ సూర్య ఫిలిమ్స్ ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… నవాబ్ కేఫ్

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… నవాబ్ కేఫ్

by Maari
February 20, 2026
0

హే బల్ వంత్… ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్

హే బల్ వంత్… ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్

by Maari
February 20, 2026
0

“ప్రభాస్ నిమ్మలతో కలిసి “మిరాకిల్” చేద్దాం రండి” అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్!!

“ప్రభాస్ నిమ్మలతో కలిసి “మిరాకిల్” చేద్దాం రండి” అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్!!

by Maari
February 19, 2026
0

సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త చిత్రం ప్రారంభం

సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త చిత్రం ప్రారంభం

by Maari
February 18, 2026
0

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

by Maari
February 18, 2026
0

హే బల్‌వంత్‌… ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మూవీ: సుహాస్‌

హే బల్‌వంత్‌… ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్స్ మూవీ: సుహాస్‌

by Maari
February 17, 2026
0

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా  ‘నిలవే’ నిలిచింది: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ దర్శకులు వి.సముద్ర

డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా ‘నిలవే’ నిలిచింది: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ దర్శకులు వి.సముద్ర

by Maari
February 17, 2026
0

3రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

3రోజుల్లో వరల్డ్ వైడ్ 5.42 కోట్ల వసూళ్లు దక్కించుకున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

by Maari
February 17, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.