సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన చిత్రం “కిల్లర్ ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్.జె.కె. ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించారు. ఈ చిత్రంలో ఇంకా ఇతర పాత్రల్లో సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి.కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహమాధురి శర్మ, తదితరులు నటించారు. ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకత్వం వహించారు. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేశారు. మీడియాకోసం ఈ చిత్రాన్ని ప్రివ్యూ ప్రదర్శించారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ను ప్రధానంగా బేస్ చేసుకుని… రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకున్నాడో చూద్దాం పదండి
కథ: పిచ్చ రవి(బాహుబలి ప్రభాకర్) వరుసగా అమ్మాయిలను అత్యాచారం చేయడం… కిరాతకంగా చంపేయడం జరుగుతూ వుంటుంది. అతన్ని సి.ఐ.ప్రకాశ్(సత్యం రాజేష్) చాక చక్యంగా పట్టుకుని జైలుకు తరలించే క్రమంలో అతడు సి.ఐ.ప్రకాశ్ తో సహా… మరో ఆరుగురు పోలీసులపై దాడి చేసి తప్పించుకుని పారిపోతాడు. అదే సమయంలో విక్కీ(సంతోష్ కల్వచెర్ల), తన ప్రేయసి జాను(క్రిషేక పటేల్)ను అమితంగా ప్రేమిస్తుంటాడు. అయితే ఇది జాను తల్లికి రుచించదు. ఇది ఇలా వుండగా విక్కీ చెల్లెలు(స్నేహా మధురిశర్మ) దారుణ హత్యకు గురవుతుంది. ఈ హత్యతో విక్కీ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి… ఎలాగైనా తన చెల్లిని చంపిన కిరాతకులను పట్టుకుని పగ తీర్చుకోవాలని చూస్తూ వుంటారు. మరి విక్కీ తన చెల్లిని చంపిన హంతకులను పట్టుకున్నాడా? పిచ్చ రవి ఎందుకు సీరియల్ కిల్లర్ గా మారాడు? చంపడమే కళగా భావించిన పిచ్చ రవి హత్యోదంతాలకు అడ్డుకట్ట పడిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఈ సినిమా హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. నిత్యం మన చూట్టూ వున్న సొసైటీలో జరిగిన… జరుగుతున్న వాస్తవ ఘటనల ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నారు డైరెక్టర్ రతన్ రిషి. సంచలనం రేకెత్తించిన పరువు హత్యలు లేదా సైకోయిజంతో మానభంగాలకు పాల్పడి… కిరాతంగా అమ్మాయిలను హతమార్చిన హంతకుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ కథను రాసుకుని… దాని చుట్టూ ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో స్క్రీన్ ప్లేను నడిపించిన దర్శకుడు… మరోవైపు సీరియల్ మర్డర్స్ ను ఒకరు చేస్తున్నారా? ఇద్దరు చేస్తున్నారా? అనే అనుమానాలను కలిగేంచే విధంగా మొదట చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అసలు కథ ఆరంభం అవుతుంది. అయితే విపరీతమైన హింసను చూపించడంతో పాటు… ఓ అందమైన అన్నా చెల్లెళ్ల స్టోరీని కూడా ఇందులో ఎంతో ఎమోషనల్ గా చూపించారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నుంచి ఈ కథ మొదలై.. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా టర్న్ తీసుకుంటుంది. ఆద్యంతో ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ పోతుంది. ఈ కిల్లర్ ఆర్టిస్ట్… ఆడియన్స్ కు ఓ కొత్త సినిమాటిక్ ఫీల్ ను కలిగిస్తాడు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడేవారికి ఇది ఓ ఫుల్ మీల్ లాంటి సినమా అని చెప్పొచ్చు.
హీరో సంతోష్ రగ్ డ్ లుక్ లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వున్నాడు. లవర్ బాయ్ గా… మరోవైపు రివేంజ్ తీర్చుకునే మాస్ హీరోగా ఇందులో కనిపిస్తాడు. మంచి భవిష్యత్తు వుంది హీరోకి. హీరోయిన్ పాత్ర పర్వాలేదు. ఆమె తల్లి పాత్రలో పులి సీత మహిళా పారిశ్రామిక వేత్త స్వరూప పాత్రలో నటించి మెప్పించారు. గయ్యాళిగా కనిపించే పాత్ర అయినా… ఆమె పాత్రకూ ఓ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. చెల్లి పాత్ర పోషించిన మధురి శర్మ బాగా నటించారు. పులి సీత భర్తగా నటించిన వినయ్ వర్మ పాత్ర కూడా బాగుంది. ఇక బాహబలి ప్రభాకర్ పాత్ర గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమా మొత్తం అతని మీదనే నడుస్తుంది. సైకో కిల్లర్ గా బాగా నటించాడు. సత్యం రాజేష్ పాత్ర కూడా బాగుంది. మిగతాపాత్రలన్నీ తమతమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సంచలనం కలిగించిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు చివరి వరకు సస్పెన్స్ ను కొనసాగిస్తూ ప్రీ క్లైమాక్స్ లో రివీల్ చేయడం ఆడియన్స్ ఎంతో థ్రిల్ కు గురవుతారు. అందుకు దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. నిర్మాతలు ఖర్చకు వెనుకాడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3