కోటబొమ్మాళి పి. ఎస్… ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ వేడిని మరింత పెంచే విధంగా ఉన్న ఈ చిత్రం ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ మెయిన్ రోల్ లో కనిపించిన ఈ మూవీ ఆసక్తికరమైన కథనంతో పాటు మంచి మాస్ డైలాగ్స్ తో ప్రజలని ఆకట్టుకుంటుంది.ఈ మూవీలో రాహుల్ విజయ్, శివాని, వర లక్ష్మీ శరత్‌కుమార్, మురళీ శర్మ తదతరులు నటించారు. GA2 పతాకంపై బన్ని వాసు నిర్మించారు. ‘నాయట్టు’ అనే మలయాళ చిత్రంకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో తెలుగు నేటివిటీ కి తగ్గటుగా కొన్ని మార్పులు చేశారు. ఈ మూవీలో రాజకీయానికి సంబంధించి హై డ్రామాతోపాటు పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన లింగిడి.. లింగిడి..లింగిడి.. సాంగ్ సోషల్ మీడియాలో బాగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: రామకృష్ణ (శ్రీకాంత్) నిజాయితీ గల పోలీసు. మావోయిస్టులను, సంఘ విద్రోహ శక్తులను ఎన్ కౌంటర్ ర్లతో తుదముట్టించన రికార్డ్ అతనిది. అతనితో పాటు రవి(రాహుల్ విజయ్) కుమారి (శివాని) సహచరులు. ముగ్గురూ ఓ పెళ్ళి వేడుకకు హాజరై వస్తుండగా అదే పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన యువకుడిని యాక్సిడెంట్ చేస్తారు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని వైద్యులు నిర్ధారిస్తారు. దాంతో ఆ యాక్సిడెంట్ కారణమైన రామకృష్ణ అండ్ రవి, కుమారిని గ్రామస్తులు వెంబడిస్తారు. వారి నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎలా పనిచేశాయి? చివరకు రామకృష్ణ ఈ ఇన్సిడెంట్ నుంచి ఎలా బయట పడ్డారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: ఈ మూవీలో శ్రీకాంత్ పర్ఫామెన్స్ అతని కెరియర్ లోనే అత్యుత్తమమైన పర్ఫామెన్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ మురళీ శర్మ, బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ మొత్తంలో బోల్డ్ డైలాగ్స్ , పవర్ఫుల్ పొలిటికల్ సెటైర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఇది రీమేక్ వెర్షన్ అయినప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే కథనంతో ముందుకు సాగుతుంది. నిర్దోషుల జీవితాలు ఎలా అణిచివేతకు గురికాబడతాయి అనే విషయాన్ని ఈ మూవీలో బాగా హైలైట్ చేశారు. మొత్తానికి మూవీ కంప్లీట్ గా మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది.. ప్రస్తుత సమాజంలో ప్రజల కోసం కాక తమ కోసం రాజకీయం చెలాయించే నాయకులు.. వృత్తికి న్యాయం చేయాలి అనుకునే పోలీసు అధికారులు.. డబ్బు కోసం ,కులం కోసం, మతం కోసం ఆలోచించి ఓట్లు వేసే ఓటర్లు. ప్రస్తుతం మీరు తెలుగు రాష్ట్రాలలో నెలకొని ఉన్న రాజకీయ హడావిడి కి ఈ మూవీ బాగా సెట్ అవుతుంది. మరి ముఖ్యంగా ఎన్నికల గురించి వివరిస్తూ ఈ చిత్రంలో ఉన్న పాట అద్భుతంగా ఉంటుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ కోటబొమ్మాళి వీటన్నిటికీ భిన్నంగా ఉంది. పొలిటికల్ డ్రామా.. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3