• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హీరో సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ‘కృష్ణమ్మ’.

admin by admin
May 11, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
హీరో సత్యదేవ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ‘కృష్ణమ్మ’.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేశాయి. సత్యదేవ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన చిత్రంగా కృష్ణమ్మ మనన్నలు అందుకుంటోంది. సినిమాలో సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి.

సత్యదేవ్ సినీ కెరీర్లో ‘కృష్ణమ్మ’ సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజునే 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా రాబట్టుకుంది. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నేపథ్యంలో విడుదలైన ‘కృష్ణమ్మ’కు మంచి కలెక్షన్స్ రాబట్టుకోవటం మంచి పరిణామం. సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.

‘కృష్ణమ్మ’ సినిమాకు ఇటు ప్రేక్షకుల నుంచే కాదు, అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. మంచి మౌత్ వచ్చింది. దీంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంది. మే నెలాఖరు వరకు పెద్దగా రిలీజెస్ లేనందు వల్ల కృష్ణమ్మ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తుందనటంలో సందేహం లేదు. ప్రేక్షకులను చక్కటి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటూ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది కృష్ణమ్మ.

‘కృష్ణమ్మ’ సినిమాలో స్నేహం, ప్రేమ వంటి అంశాలతో మిళితమైన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నాయి. సత్యదేవ్ తో పాటు లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అతీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.

Krishnamma gets decent collection on Day 1 at box office: Career best opener for Satyadev

Supremely talented Satyadev latest movie, ‘Krishnamma’, is crafted as a raw and rustic backdrop action released in theatres on May 10. The famous distribution companies, Mythri Movie Makers and Prime Show Entertainments, known for distributing many successful films handled the release. ‘Krishnamma’ showcases Satyadev in a new dimension. Satyadev’s rustic action sequences and rugged persona will leave viewers spellbound.

The film sets a new career record for its star with a day one global gross of 1 crore. Produced by Krishna Kommalapati under the Arunachala Creations banner and presented by acclaimed director Koratala Siva. Released amidst a busy season of elections and IPL matches, “Krishnamma’s” decent opening is particularly noteworthy, establishing it as Satyadev’s career best opening till date.

The film has been met with enthusiastic acclaim, bolstered by excellent reviews and a strong word-of-mouth trend, positioning it for continued success at the box office. With no major releases anticipated until the end of May, “Krishnamma” stands out as the leading choice for audiences seeking engaging cinema and actioner, promising an extended successful run in theaters.

The film guarantees a thrilling journey filled with action and emotional moments, highlighting the themes of friendship and love. Laxman Meesala, Raghu Kunche, Athira Raj, and others are introduced in pivotal roles. VV Gopalakrishna directed the movie, which is produced by Krishna Kommalapati under the banner of Arunachala Creations and backed by the renowned director Koratala Siva. Athira Raj stars opposite Satyadev in ‘Krishnamma’. The film features music by Kaala Bhairava and cinematography by Sunny Kurapati.

Previous Post

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Next Post

“అపరిచితుడు”కి క్రేజీ బుకింగ్స్… మే 17న రిలీజ్

Next Post
“అపరిచితుడు”కి క్రేజీ బుకింగ్స్… మే 17న రిలీజ్

"అపరిచితుడు"కి క్రేజీ బుకింగ్స్... మే 17న రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.