మౌళి తనుజ్ …. `90’s మిడిల్ క్లాస్ బయోపిక్` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. తాజాగా `లిటిల్ హార్ట్స్` చిత్రంతో మళ్ళీ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ETV Win ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీవాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ లిటిల్ హార్ట్స్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ:అఖిల్(మౌళి)కి చదువు అబ్బదు, పెద్ద అవారా బ్యాచ్. కానీ అఖిల్‌ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చూడాలనేది వాళ్ళ నాన్న గోపాల్ రావు (రాజీవ్ కనకాల)కల. చదువు ఎక్కక అత్తెసరు మార్కులతో ఇంటర్ పాస్ అవుతాడు. కానీ ఎంసెట్‌లో తప్పుతాడు. దీంతో అప్పటి వరకు ఉన్న లవర్ కూడా హ్యాండిస్తుంది. ఇంజనీరింగ్ చేసి, సాఫ్ట్ వేర్ కావాలని వాళ్ల నాన్న బలవంతంగా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తాడు. కోచింగ్ సెంటర్లో కాత్యాయని(శివాని) పరిచయం అవుతుంది. ఆమెకి తొలి చూపులోనే పడిపోతాడు అఖిల్. కాత్యాయనికి బైపీసీ ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ కావడంతో వారి ఒత్తిడి మేరకు తను కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కాత్యాయని మధ్య క్లోజ్ నెస్ పెరగడంతో తనకి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ తను అఖిల్ కంటే మూడేళ్లు పెద్ద అని అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. అఖిల్ హార్ట్ బ్రేక్ అవుతుంది. మరి నచ్చిన పిల్ల కోసం, నచ్చని ఇంజనీరింగ్ కోసం అఖిల్ ఏం చేశాడు? కాత్యాయనిని పడేయడం కోసం అఖిల్ ఏం చేశాడు? చివరికి వీరి లవ్ ట్రాక్ ఎలాంటి టర్న్ లు తిరిగింది. నచ్చిన కెరీర్ కోసం ఈ ఇద్దరు ఏం చేశారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: టీనేజ్ కుర్రాళ్ల కథలతో వచ్చే సినిమాలకు కథలతో సంబంధం లేదు. సిచ్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయితే చాలు… ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్… సరదా .. సరదా సంభాషణలు చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది. ఇలాంటి సినిమాలు యువతని బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి కామెడీతో వచ్చిన సినిమానే `లిటిల్ హార్ట్స్`. నేటి యువతరాన్ని బేస్ చేసుకుని…. వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది… వారి చదువులు, ప్రేమలు, friendship ఎలా ఉంటుందనేది ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ ఎక్కువగా జియో నెట్ వర్క్ రాక ముందు నడుస్తుంది. వాట్సాప్ అప్పట్లో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఇద్దరు యువతి యువకుల మధ్య సంభాషణ జరగాలంటే అటు ఫోన్ అయినా ఉండాలి లేదా facebook చాటింగ్ అయినా ఉండాలి. లిటిల్ హార్ట్స్ లో హీరో హీరోయిన్ మధ్య సంభాషణ ఇలానే ఉంటుంది. దానికి తోడు ఇంటర్ విద్యార్థులు ఎలా ఉంటారో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా ఫన్నీ గా చూపించారు. సిటీ బస్సులో టికెట్ తీసుకోకుండా పాస్ అని చెప్పడం.. చాక్లెట్స్ దొంగిలించడం… ప్రియురాలతో రాయబారాలు… ఇలా చాలా విషయాలను సరదాగా చూపించారు. అలాగే చదువు సంధ్య లేని ఓ ఇంటర్మీడియట్ కుర్రాడు… తల్లి తల్లిదండ్రుల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మాయిల కోసం తిరగడం. వారిని లైన్లో పెట్టడం… తండ్రి సాఫ్ట్ వేర్ అని కలలు కంటుంటే… అవేమీ పట్టించుకోకుండా తనకు ఇష్టమైన పనులు చేస్తూ అఖిల్ పాత్ర చేసే డ్రామాలు…. వేషాలు, లవర్స్ కోసం అబద్దాలు చెప్పడం, చదువుతున్నట్టుగా యాక్ట్ చేయడం వంటి అంశాలను ఇందులో చాలా సహజంగా చూపించారు. చాలా మంది స్టూడెంట్స్ కి ఈ అంశాలు బాగా కనెక్ట్ అవుతాయి. అదే సమయంలో లవ్ స్టోరీ కూడా చాలా సహజంగా ఉంది. కోచింగ్ సెంటర్లలో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గో అండ్ వాచ్ ఇట్.
అఖిల్ పాత్రలో మౌళి తనుజ్ అఖిల్ పాత్రకి బాగా సూట్ అయ్యాడు. కామెడీతో బాగా ఎంటర్టైన్ చేశాడు. కాత్యాయని పాత్రలో శివానీ కూడా ఒదిగిపోయి నటించింది. మౌళి ఫ్రెండ్ మధు పాత్రలో నటించిన కుర్రాడుకూడా బాగా చేశాడు. తన పంచ్ డైలాగ్‌లు, సెటైర్లతో నవ్వులు పూయించాడు. మౌళి తండ్రిగా రాజీవ్ కనకాల పాత్ర కూడా బాగుంది. ఇక హీరోయిన్ తండ్రిగా కాంచి ఎప్పటి లాగే తన సహజ నటన తో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలు కూడా బాగానే ఉన్నాయి.
దర్శకుడు సాయి మార్తాండ్ ఎంచుకున్న కథ, కథనం బాగుంది. మంచి హిలేరియస్ కామెడీ ని తెరపై చూపించాడు. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉంది. ఎడిటింగ్ ఒకే. సంభాషణలు బాగున్నాయి. మేకింగ్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.
రేటింగ్: 3