• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Thursday, May 7, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

Maari by Maari
May 7, 2026
in Cinema, Latest News, Movies, news, Politics, special, sports
0
సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

Share and Enjoy !

Shares
Twitter

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము
“M4M (మోటివ్ ఫర్ మర్డర్)” మూవీ డైరెక్టర్ మోహన్ వడ్లపట్లతో ఇంటర్వ్యూ

▪️ కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం
▪️ ‘M4M’ ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్
▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు
▪️ మే 8న “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” విడుదల
▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన “M4M” మూవీ

టాలీవుడ్‌లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సారి ద‌ర్శ‌కునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సౌత్ ఇండియా లో PVR Inox Pictures, నార్త్ ఇండియా లో JVEL, ఓవర్సీస్ Tekflix ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మీడియా ప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి, త‌న కెరీర్ గురించి మోహన్ వడ్లపట్ల చెప్పిన‌ విశేషాలు ఇవి..

ప్రశ్న: ఈ “M4M” టైటిల్ వెనుక ఉన్న కథ ఏంటి?
మోహన్ వడ్లపట్ల: అమెరికాలో సీరియల్ కిల్లర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్. “వాట్ ఈజ్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్?” అని ఆలోచించినప్పుడు, “మోటివ్ ఫర్ మర్డర్” (Motive for Murder) అని ఫిక్స్ అయ్యాం. దానికి షార్ట్ కట్ గానే “M4M” అని టైటిల్ పెట్టాం.

ప్రశ్న: కొత్త ఆర్టిస్టులతో చేయడం వల్ల మేకింగ్ లో ఏమైనా ఛాలెంజెస్ ఎదురయ్యాయా?
మోహన్ వడ్లపట్ల: ప్రతి సీన్ ని ఒక చిన్న సినిమా లాగా అంత కేర్ తీసుకొని చేశాను. స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. చాలా ఫుటేజ్ ఉన్నా, దాన్ని క్రిస్ప్ గా ఎడిట్ చేసి హాలీవుడ్ స్టైల్ లో కేవలం 90 నిమిషాల సినిమాగా రెడీ చేశాం. ఇంటర్వెల్ కూడా అవసరం లేదు, కానీ మన వాళ్ళకి అలవాటు కాబట్టి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టాం. ఒక క్లైమాక్స్ సీన్ లో మమ్మీ లాగా కట్టేసే సీన్ ఒకటి హాఫ్ డే పట్టింది, అది కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది.

ప్రశ్న: సినిమా రిలీజ్ కి వచ్చింది కదా, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి?
మోహన్ వడ్లపట్ల: కచ్చితంగా అండి. హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా రిలీజ్ కొద్దిగా డిలే అయింది. దీనికి కారణం కొద్దిగా రీషూట్ చేయాల్సి రావడం. దానికి తోడు భాను మాస్టర్ తో ఒక ప్రోమో సాంగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒకసారి షూట్ చేసి స్క్రాప్ చేశాం, మళ్ళీ ఇంకోటి షూట్ చేసి స్క్రాప్ చేసి, థర్డ్ టైం భాను మాస్టర్ తో ఫైనల్ చేశాం. సారథి స్టూడియోస్ లో కంటిన్యూస్ గా మూడున్న‌ర‌ రోజులు షూట్ చేశాం. ముందు ఓటీటీ వాళ్ళని కూడా ట్రై చేశాం, కానీ పిక్చర్ రిలీజ్ తర్వాత వర్కవుట్ చేద్దామని OTT వాళ్లు అన్నారు. ఇలా ఫస్ట్ ఒక షేప్ కి వచ్చేసింది.

ప్రశ్న: రీషూట్స్ కి ప్రధాన కారణం ఏంటి?
మోహన్ వడ్లపట్ల: Who is the Killer సాంగ్ ఫస్ట్ టైం సాంగ్ చేసినప్పుడు నేను అంతగా శాటిస్ఫై కాలేదు. తర్వాత ఒక మంచి కొరియోగ్రాఫర్ తో చేద్దామని మనసులో పడి, ట్రెండింగ్ లో ఉన్న భాను మాస్టర్ తో చేద్దామని నిర్ణయించుకున్నాం. దానికి తోడు సింగర్ నోయల్ తో ఒక ర్యాప్ కూడా పాడించాం. అది చాలా బాగా వచ్చింది.

ప్రశ్న: రీషూట్స్ వల్ల బడ్జెట్ ఏమైనా పెరిగిందా?
మోహన్ వడ్లపట్ల: డెఫినెట్ గా పెరిగిందండి. దాదాపు మూడున్న‌ర‌ రోజులు, అందులో నైట్ షిఫ్ట్ కూడా చేశాం. 10 డిఫరెంట్ సెటప్స్ వేశాం. భాను మాస్టర్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఫైనల్ గా సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.

ప్రశ్న: సినిమా రిలీజ్ కి ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించారు కదా?
మోహన్ వడ్లపట్ల: అవును, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చాలా వాటికి పంపించాం. మాక్సిమం ఒక 25-30 అవార్డ్స్ వచ్చాయి, కానీ IMDB రికగ్నైజ్ చేసినవి 15 అవార్డ్స్. ఇందులో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ కి అవార్డ్స్ వచ్చాయి.

ప్రశ్న: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గాని, ఇక్కడ గాని ఏమైనా ప్రీమియర్స్ వేశారా?
మోహన్ వడ్లపట్ల: కాన్స్ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత, ఇండియాలో ఇఫీ (IFFI) గోవాలో కూడా ప్రీమియర్ వేశాం.

ప్రశ్న: సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో చెప్తే లక్ష రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారు కదా?
మోహన్ వడ్లపట్ల: అవునండి, ఈ సినిమా ఇండియాలో 8వ తేదీన విడుద‌లైతే, 7వ తేదీన అమెరికాలో రిలీజ్ చేస్తున్నాం. ఎవరైతే సీరియల్ కిల్లర్ ని కనుక్కుంటారో వాళ్లకి లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తాం. అమెరికాలో తెలుగు వాళ్ల‌కు ఎవరో ఒకరు ఇంటి వాళ్లుగానీ, తెలిసిన వాళ్లుగానీ ఉంటారు కాబట్టి కిల్లర్ ఎవరనేది ఈజీగా లీక్ చేస్తారు కదా అని కొందరు అన్నారు. కానీ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను. సినిమాను జాగ్రత్తగా చూసి కిల్లర్ ఎవరో చెప్తే లక్ష రూపాయలు టేబుల్ మీద పెట్టి ఇస్తాను.

ప్రశ్న: ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్రను రివీల్ చేసే విషయంలో మీరు అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారు?
మోహన్ వడ్లపట్ల: ఎందుకంటే ఈ కథను నేను చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో రాసుకున్నాను. కిల్లర్ ఎవరో అనే సస్పెన్స్ సినిమా చివరి వరకు ప్రేక్షకులను వెంటాడుతుంది. అందుకే ఎవరైనా కిల్లర్ పేరు చెప్పినా, వారు పూర్తి కథను గెస్ చేయలేరని నా నమ్మకం.

ప్రశ్న: 90 నిమిషాల నిడివి అనేది తెలుగు సినిమాలకు కొంచెం రిస్క్ అనిపించలేదా?
మోహన్ వడ్లపట్ల: లేదు, ప్రస్తుతం ఆడియన్స్ ట్రెండ్ మారుతోంది. హాలీవుడ్ స్టైల్ లో అనవసరమైన సీన్లు లేకుండా కథను వేగంగా నడిపించడమే నా ఉద్దేశ్యం. అందుకే దాదాపు 3 గంటల ఫుటేజ్ ఉన్నా, ఎడిటింగ్ లో చాలా వరకు తీసేసి కేవలం 90 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా దీనిని మలిచాం.

ప్రశ్న: అమెరికాలో ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేస్తున్నారు?
మోహన్ వడ్లపట్ల: అమెరికాలోని తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్లాన్ చేశాం. అలాగే ఈ సీరియల్ కిల్లర్ ఛాలెంజ్ (లక్ష రూపాయల రివార్డ్) అనేది అక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అక్కడి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు సినిమా చూసి కిల్లర్ ఎవరో లీక్ చేస్తారేమో అన్న భయం ఉన్నా, ఆ ట్విస్ట్ అంత ఈజీగా దొరకదని నేను భావిస్తున్నాను.

ప్రశ్న: ఫేమస్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో చేసిన ప్రోమో సాంగ్ ప్రత్యేకత ఏంటి?
మోహన్ వడ్లపట్ల: భాను మాస్టర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నా, మా రిక్వెస్ట్ మీద ఈ సినిమా కోసం పనిచేశారు. సారథి స్టూడియోస్ లో 10 రకాల డిఫరెంట్ సెట్స్ వేసి, ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఈ సాంగ్ షూట్ చేశాం. నోయల్ పాడిన ర్యాప్ ఈ సాంగ్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రశ్న: ఒకసారి సీరియల్ కిల్లర్ ఎవరో రివీల్ అయిపోతే, నెక్స్ట్ చూసే ఆడియన్స్ కి ఫీలింగ్ ఎలా ఉంటుంది?
మోహన్ వడ్లపట్ల: అదే ఈ సినిమాలోని బ్యూటీ అండి. వీడా, వాడా, ఇంత‌కీ ఎవ‌డు అనే కన్ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ ఆడియన్స్ కి కలుగుతుంది. సెకండ్ టైమ్ చూసినా ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ప్రశ్న: మీరు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాలు ఒక ప్యాటర్న్ లో ఉంటే, దర్శకుడిగా చేసిన ఈ సినిమాను ఇంత డిఫరెంట్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
మోహన్ వడ్లపట్ల: నేను హాలీవుడ్ లో టామ్ హాంక్స్ లాంటి వాళ్ళ వర్క్ ని ఫాలో అవుతుంటాను. నేను నిర్మించిన సినిమాలకు ఒకదానికొకటి సంబంధం ఉండదు. ‘మల్లెపూవు’లో భూమికతో కొత్త కుర్రాడిని పరిచయం చేశాం. ‘మెంటల్ కృష్ణ’ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశాం. బడ్జెట్ విషయంలో ఎప్పుడూ రిస్క్ తీసుకున్నాను. ఈ ‘M4M’ కూడా ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మర్డర్ మిస్టరీగా, ఫుల్ ఆఫ్ ట్విస్టులతో తీశాం.

ప్రశ్న: మ్యూజిక్ గురించి చెప్పండి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా ఎంచుకున్నారు?
మోహన్ వడ్లపట్ల: ఎప్పుడూ కొత్త వాళ్లకి అవకాశం ఇద్దామనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో సెర్చ్ చేశాం. చెన్నైకి చెందిన ఒక అబ్బాయి దొరికాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నాను, కానీ మ్యూజిక్ కి లాంగ్వేజ్ బారియర్ ఉండదు కదా. స్టోరీ చెప్పగానే చాలా అద్భుతంగా చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి దాదాపు 5-6 అవార్డ్స్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్లకే అవకాశాలు ఇస్తాను.

ప్రశ్న: థియేటర్లలో పర్సంటేజీల గొడవ నడుస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి?
మోహన్ వడ్లపట్ల: నేను ఎప్పుడూ పర్సంటేజ్ సిస్టమ్ కే మద్దతు ఇస్తాను. 98% ప్రొడ్యూసర్స్ దీనికి అంగీకరించారు. ఇప్పుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓటీటీల వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గింది. కాబట్టి ప్రొడ్యూసర్స్, థియేటర్ ఓనర్స్ పర్సంటేజ్ విధానం పాటిస్తే అందరికీ లాభదాయకం. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్స్ లో కూడా చెప్పాను.

ప్రశ్న: భవిష్యత్తులో మీరు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలే చేస్తారా?
మోహన్ వడ్లపట్ల: నా కెరీర్ లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’ లాంటి విభిన్నమైన సినిమాలను నిర్మించాను.ఒక మేకర్ గా నాకు కొత్తదనం అంటే ఇష్టం. అందుకే ఈ “M4M” సినిమాను కూడా ఒక యూనిక్ పాయింట్ తో తీశాను, మున్ముందు కూడా విభిన్నమైన కథలతోనే సినిమాలు వస్తాయి.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

Next Post

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

Next Post
జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో "ఆపరేషన్ అరుణారెడ్డి" చిత్రాన్ని రూపొందించాను - దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

by Maari
May 7, 2026
0

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

by Maari
May 7, 2026
0

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

by Maari
May 7, 2026
0

‘అగధ’ టీజర్ విడుదల

‘అగధ’ టీజర్ విడుదల

by Maari
May 7, 2026
0

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది… అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

by Maari
May 6, 2026
0

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

by Maari
May 6, 2026
0

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

నితిన్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో కొత్త సినిమా ప్రారంభం

by Maari
May 6, 2026
0

అమెజాన్ ప్రైమ్ లో మరియు  ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

అమెజాన్ ప్రైమ్ లో మరియు ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ చిత్రం

by Maari
May 4, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.