అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మా రాముడు అందరివాడు. శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో చిత్రబృందం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి సంగీత మాట్లాడుతూ – ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. మా రాముడు అందరివాడు సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. థియేటర్స్ లో ప్రేక్షకులు మా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుందంటూ చెబుతున్నారు. వారి రెస్పాన్స్ చూస్తుంటే మా టీమ్ అందరికీ హ్యాపీగా ఉంది. ఇంకా చూడని వారుంటే థియేటర్స్ కు వెళ్లి చూడాలని కోరుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్, యాక్టర్ అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ – మా సినిమాను కొత్తగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్లాలనే ప్రయత్నం మొదటి నుంచీ చేస్తూ వస్తున్నాం. ఏపీలోని వివిధ నగరాల్లో ఈవెంట్స్ చేశాం. నెల్లూరులో ఈవెంట్ తో పాటు డ్రోన్ షో చేశాం. అది ట్రెండ్ సెట్టర్ అయ్యింది. మా సినిమా తర్వాతే అందరూ డ్రోన్ షోస్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా మా మూవీ గురించే ప్రచారమైంది. మా మూవీ ఆద్యంతం బాగుంది, ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఉందనే టాక్ వస్తోంది. ప్రతి సెంటర్ నుంచీ సినిమా బాగుందనే చెబుతున్నారు. సుమన్ గారు విజయవాడలో సినిమా చూసి చాలా నచ్చిందని చెప్పారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టించాం. అయితే తగినన్ని థియేటర్స్ దొరకలేదు. స్టార్ హీరోల సినిమాలతో పాటు మాలాంటి కొత్త వాళ్ల మూవీస్ కు కూడా థియేటర్స్ దొరికితే అన్ని సినిమాలూ బాగుంటాయి. మంచి కథా కథనాలతో, ఐదు సూపర్ పాటలతో మా మూవీ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుని విజయం సాధించింది. మాకు బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చింది. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగిస్తూ మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాం. నటుడిగా, నిర్మాతగా నా జర్నీ కొనసాగుతుంది. నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. మా సినిమాకు ఇంత ఘన విజయం అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.
హీరో, ప్రొడ్యూసర్ శ్రీరామ్ మాట్లాడుతూ – మా రాముడు అందరివాడు సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ వారం రిలీజైన సినిమాల్లో మిగతా అన్ని చిత్రాలకు రేటింగ్ 2 మించలేదు. మా సినిమాకు మాత్రం 2.5 నుంచి 3 స్టార్స్ వరకు రేటింగ్ వచ్చింది. సోషల్ మీడియాలోనూ మా మూవీ కంటెంట్ వైరల్ అయ్యింది. అదే మా సినిమా సక్సెస్ కు నిదర్శనం. అన్ని కేంద్రాల నుంచి మా సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. మంచి ప్రేమ కథ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, పాటలు అన్నీ ఉన్న సినిమా ఇది. ఎక్కడా బోర్ కొట్టదు. మేము చెప్పింది నిజమా కాదా తెలుసుకోవాలంటే ఒక్కసారి థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడండి. మా సినిమాకు టాక్ వచ్చినంత బాగా థియేటర్స్ దొరకడం లేదు. అదొక్కటే నిరాశకు గురిచేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సినిమా మాది. తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి చూడండి. మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి కొత్త వాళ్లం మరిన్ని మూవీస్ చేసే అవకాశం ఉంటుంది. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొని సినిమా విజయం పట్ల తమ సంతోషాన్ని పంచుకున్నారు.
నటీనటులు – శ్రీరామ్, స్వాతి మందాడి, అనుముల లక్ష్మణరావు, సుమన్, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, అప్పారావు, సమ్మెట గాంధీ, గడ్డం నవీన్, ఆనంద్ భారతి, చిట్టి బాబు, గోల్డ్ రెడ్డి, బేబీ గనిష్క, తదితరులు
టెక్నీషియన్స్
——————–
డీవోపీ – వినోద్
మ్యూజిక్ – బొల్లా వెంకటేష్
బ్యానర్స్ – అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ – అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు
డైరెక్షన్ – యద్దనపూడి మైకిల్
పీఆర్ఓ – బి.వీరబాబు










