• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ : ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

admin by admin
February 28, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, special
0
థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ : ప్రెస్ మీట్ లో చిత్ర బృందం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నార్నే నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్-1 కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి మ్యాడ్-2 దానికి మించి ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “మీరు టీజర్ లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం (నవ్వుతూ). మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.

రామ్ నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మొదటి సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియాకి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “మంచి సినిమా తీశాము. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. మార్చి 29న విడుదలవుతున్న మా సినిమాని చూసి ఆదరించండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది.” అన్నారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేము. మ్యాడ్ స్క్వేర్ కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల విడుదలైన టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మ్యాడ్ స్క్వేర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ టైటిల్ కి తగ్గట్టుగానే రెట్టింపు వినోదం ఉంటుంది. మార్చి 29న థియేటర్లలో ఈ సినిమా చూసి హ్యాపీగా నవ్వుకోండి.” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, “మ్యాడ్ ను పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దానిని మించి ఉండబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను. కళ్యాణ్ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. మునుముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి, చినబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలూ భవిష్యత్ లో పెద్ద స్టార్ లు అవుతారు. పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మార్చి 29న విడుదలవుతున్న మా మ్యాడ్ స్క్వేర్ సినిమాని చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.” అన్నారు.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

‘MAD Square’ is 10 Times the Fun of ‘MAD’: Director Kalyan Shankar

The highly anticipated MAD Square, boasting a vibrant and talented young cast, is set for a grand theatrical release worldwide on March 29. With filming wrapped and post-production in full swing, the team shared their enthusiasm at a press meet in Hyderabad. Producers Suryadevara Naga Vamsi and Harika Suryadevara, Music Director Bheems Ceciroleo, Director Kalyan Shankar, and actors Ram Nithin, Sangeet Sobhan, and Narne Nithin expressed unwavering confidence in the film’s blockbuster appeal.

Producer Suryadevara Naga Vamsi said, “We’ve crafted an exceptional film, and we’re hopeful it’ll strike a chord with all of you. Get ready for two hours of pure, hearty laughter—bring your friends and join us for an unforgettable joyride.”

Harika Suryadevara, producer, added, “We are overwhelmed by the incredible response to the teaser. MAD Square carries huge expectations, and we are committed to not only meeting but exceeding them. True to its title, this film will be a mad square.”

Music Director Bheems Ceciroleo stated, “I’m confident that MAD Square is going to be a massive blockbuster. The energy of the film is unmatched, and it’s poised to take the careers of all three leads to new heights.”

Actor Ram Nithin, reflecting on his journey, shared, “I’m forever grateful to the audience for the love they showed my previous film, MAD. I owe this opportunity to my director and producers, and I’m thrilled to be part of MAD Square.”

Director Kalyan Shankar promised a larger-than-life experience, stating, “I assure you, MAD Square is 10 times the fun of MAD. I’m confident that when the audience watches it on March 29, they’ll agree.”

Actor Sangeet Sobhan teased, “What you saw in the teaser is just 1% of what’s in store. MAD Square doubles the entertainment quotient, and we can’t wait for you to experience it.”

Rounding off the enthusiasm, Narne Nithin said, “MAD Square is a full-length laugh riot. I swear the audience won’t be able to stay seated—it’s that entertaining!”

With its high-energy vibe, stellar cast, and promise of non-stop entertainment, MAD Square is gearing up to take audiences by storm on its grand release date, March 29.

About MAD Square

MAD Square is the sequel to the blockbuster movie MAD, which was released in October 2023. A coming-of-age comedy-drama, the film revolves around the antics of three college friends and the hilarious situations surrounding them. The sequel promises to deliver double the fun and double the madness!

Title: Mad Square
Release Date: March 29, 2025
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas & Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan, Narne Nithin, Ram Nithin
Director: Kalyan Shankar
Presenter: Suryadevara Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music: Bheems Ceciroleo
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

Previous Post

ఫాల్స్ ప్రెస్టీజికి పోయి లోన్ యాప్స్ ఉచ్చులో అష్టకష్టాలు పడే కుర్రాడి కథ “తకిట తధిమి తందాన”

Next Post

అమృతేశ్వరునికి అభిషేకిస్తూ పరవశించిపోయా !

Next Post
అమృతేశ్వరునికి అభిషేకిస్తూ పరవశించిపోయా !

అమృతేశ్వరునికి అభిషేకిస్తూ పరవశించిపోయా !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.