రవి తేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగాసి తార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: లక్షణ్ భేరి (రవితేజ) ఓ రైల్వే పోలీస్. వరంగల్‌లో ఓ పొలిటీషియన్ కొడుకుని కొట్టి అడవివరం అనే ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ శివుడు (నవీన్ చంద్ర) గంజాయి పంట పండిస్తూ.. కలకత్తాకి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ప్రభుత్వ పెద్దల అండదండలూ.. పోలీస్ వ్యవస్థ అతని కనుసన్నల్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా శివుడు కంట్రోల్‌లోనే ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్లి.. శివుడ్ని మట్టుపెట్టడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి రిస్క్ చేశాడన్నదే మిగతా కథ.
విశ్లేషణ: దర్శకుడు భాను భోగవరపు తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమవుతూ ప్రయోగాలకు సిద్దపడలేదనే విషయం సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే అర్ధం అవుతుంది. రవితేజ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథ, కథనాలను అల్లుకొన్నాడనిపిస్తుంది. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా, స్టోరి, స్క్రీన్ ప్లే పరంగా ఎలాంటి సాహసం చేయకుండా రెగ్యులర్, రొటీన్ మాస్ మసాల, యాక్షన్ ఎపిసోడ్స్‌తో మాస్ జాతరను నింపేశాడనిపిస్తుంది. రొటీన్ కథలో కూడా డైలాగ్స్‌తో పెన్ పవర్ చూపించే ప్రయత్నం చేశాడు.
ఇక రవితేజకు కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేకపోయింది. తాను ఇంతకు ముందు చేసిన విక్రమార్కుడు, క్రాక్ తరహాలోనే ఉండే పాత్రను చాలా సులభంగా, తన మేనరిజాన్ని మిక్స్ చేసి అలా చేసుకోంటూ పోయాడు. పాటలు, ఫైట్స్‌లో అదే ఎనర్జీని చూపించాడు. కొత్తగా తన అభిమానులకు అందించే సాహసం చేసినట్టు అనిపించడు. ఇక శ్రీలీలది కూడా అదే పరిస్థితి. నటించాలని ఉన్నా.. నటించడానికి స్కోప్ లేని పాత్రలో కనిపించారు. అక్క (నవ్య స్వామి)తో ఉన్న ఎమోషనల్ సీన్‌లో ఆకట్టుకొన్నది. కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే పరిమితమయ్యారు. గ్లామర్‌తో స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చింది.
ఇక మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. పవర్‌ఫుల్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించినట్టు అనిపించారు. విలన్‌గా వైవిధ్యం ప్రదర్శించలేని సాదాసీదా పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. హైపర్ ఆది, అజయ్ ఘోష్, వీటీవీ గణేష్ అలా చాలామంది కమెడియన్లు ఉన్నా వెరైటీ కామెడీ కనిపించదు. నవ్యస్వామి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. దర్శకుడే రచయిత కావడం కొంత ఊరట కలిగించే అంశం. డైలాగ్స్ మాస్ ఎలిమెంట్స్, కామెడీని పండించేందుకు శ్రమపడ్డారు. ఇక సినిమాకు భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్, పాటలు ప్లస్ పాయింట్స్. విధూ అయన్న సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లు, పాటలను కలర్‌ఫుల్‌గా చిత్రీకరించాడు. ఇక నాగవంశీ తదితరులు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా రవి తేజ మార్క్ మాస్, యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియెన్స్‌కు మాస్ మహారాజ్, శ్రీలీల కాంబో అలరించే అవకాశం ఉంది. .గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3










