• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

స్టన్నింగ్‌ పోస్టర్‌తో దసరా శుభాకాంక్షలు చెప్పిన నందమూరి కల్యాణ్‌రామ్‌ డెవిల్‌ టీమ్‌!

admin by admin
October 23, 2023
in Cinema, Latest News, news
0
స్టన్నింగ్‌ పోస్టర్‌తో దసరా శుభాకాంక్షలు చెప్పిన నందమూరి కల్యాణ్‌రామ్‌ డెవిల్‌ టీమ్‌!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో కల్యాణ్‌రామ్‌ ప్రతిభావంతుడనే విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. పాత్రలను, కథలను ఆయన ఎంపిక చేసుకునే విధానం అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచే ప్రయోగాలకు వెనకాడకుండా, ఆత్మస్థైర్యంతో తనదైన అభిరుచిని ప్రదర్శిస్తూ స్కిప్ట్ లు సెలక్ట్ చేసుకుంటుంటారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఇప్పుడు డెవిల్‌తోనూ ఆ విషయాన్ని మరోసారి నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. డెవిల్‌ అనే ఫెరోషియస్‌ టైటిల్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించేశారు కల్యాణ్‌రామ్‌. ద బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకొచ్చేస్తోంది డెవిల్‌. అభిషేక్‌ నామా నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్‌.
ఇటీవల విడుదలైన డెవిల్‌ టీజర్‌కి సర్వత్రా మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంచనాలు పెంచేసింది టీజర్‌. ఈ ఏడాది నవంబర్‌ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నరౌజి పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రతి పోస్టరూ ఆకట్టుకుంటోంది.

దసరా శుభసందర్భంగా అభిమానులను స్పెషల్‌ పోస్టర్‌తో విష్‌ చేశారు నందమూరి కల్యాణ్‌రామ్‌.
ఈ తాజా దసరా పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. పార్టీకి రెడీ అయినట్టు స్పెషల్‌ టుక్సెడోలో అదుర్స్ అనిపిస్తున్నారు. ”చెడుపై మంచి సాధించిన విజయాన్ని పర్వదినంగా జరుపుకుందాం. అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ ఆనందాలు, శుభాలు వెల్లివిరియాలి” అని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.
అభిషేక్‌ పిక్చర్స్ పేరు చెప్పగానే అందరికీ అత్యద్భుతమైన నిర్మాణ విలువలు కళ్ల ముందు మెదులుతాయి. డెవిల్‌లోనూ అద్భుత ప్రమాణాలు కళ్లకు కట్టినట్టు ఉంటాయి. సినిమా చూసే ప్రేక్షకులకు నయనానందం కలిగించడానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ గాంధీ నడికుడికార్‌ క్రియేట్‌ చేసిన విజువల్స్ స్టన్నింగ్‌గా అనిపిస్తాయి. అత్యద్భుతమైన దృశ్యాలను చూసిన అనుభూతి కలుగుతుంది ప్రేక్షకులకు. సౌందర రాజన్‌.యస్‌. కెమెరా పనితనం, తమ్మిరాజు ఎడిటింగ్‌ సినిమాకు సిల్వర్‌ స్క్రీన్‌ మీద గొప్ప జీవం పోసేలా ఉంటాయి.
శ్రీకాంత్‌ విస్సా రాసిన కథ, స్క్రీన్‌ ప్లే, మాటలకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కితీరుతాయి. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి మాటనూ అద్భుతంగా మలిచారు శ్రీకాంత్‌. పీరియడ్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది డెవిల్‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలను ప్రేక్షకులకు పంచుకుంటామని అంటున్నారు మేకర్స్.
ఎ ఫిల్మ్ బై అభిషేక్‌ పిక్చర్స్

నటీనటులు: నందమూరి కల్యాణ్‌ రామ్‌, సంయుక్త తదితరులు

సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్
సమర్పణ: దేవాంశ్‌ నామా
నిర్మాత, దర్శకత్వం: అభిషేక్‌ నామా
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్‌ విస్సా
కెమెరా: సౌందరరాజన్‌
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: గాంధీ నడికుడియార్‌
ఎడిటర్‌: తమ్మిరాజు
సీఈఓ: పోతిని వాసు
కథ విస్తరణ: ప్రశాంత్‌ బారది
కో డైరక్టర్‌: చలసాని రామారావు
కాస్ట్యూమ్‌ డిజైనర్: విజయ్‌ రత్తినమ్‌ ఎంపీఎస్‌ఈ
రీ రికార్డింగ్‌ మిక్స్: ఎ ఎం రహమతుల్లా, ఎం.రహమతుల్లా
స్టంట్స్: వెంకట్‌ మాస్టర్‌
ప్రొడక్షన్ డిజైన్స్: కన్ని స్టూడియోస్‌
డిజిటల్‌ మార్కెటింగ్‌: వాల్స్ అండ్‌ ట్రెండ్స్
పీఆర్‌ఓ: వంశీకాకా

Nandamuri Kalyan Ram’s Devil team wishes everyone auspicious Dussehra with a stunning poster

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The film is directed and produced by Abhishek Nama.

The film’s teaser was released recently and it made us all to anticipate more from the film. The film will be released in theatres on November 24, 2023. After surprising audience with character poster of Malavika Nair a d Bollywood beauty Elnaaz Norouzi, makers today wished everyone a Happy Dussehra with a special poster.

In the poster, Kalyan Ram looks dynamic and party ready in a special Tuxedo. Wishing audience, makers wrote “Celebrate the victory of good over evil. Team #DevilMovie wishes everyone a Happy Dasara. Wishing you a day filled with positivity and joy. “

Abhishek Pictures, known for their remarkable productions, presents Devil. The production designer Gandhi Nadikudikar has diligently worked to create a visually stunning experience for the viewers. Cinematography by Soundar Rajan.S and editing by Tammiraju are expected to bring the story to life on the silver screen.

The talented team of Srikanth Vissa has beautifully crafted the story, screenplay, and dialogues, ensuring a gripping and engaging narrative for the audience. More details regarding this said-to-be period spy thriller will be out soon.

A film by Abhishek pictures

Cast: Nandamuri Kalyan Ram, Samyuktha and others

Banner: Abhishek Pictures
Prelsented by: Devansh Nama
A Film By Abhishek Pictures
Producer & Director : Abhishek Nama
Story, Screenplay, Dialogues: Srikanth Vissa
Cinematography: Soundar Rajan.S
Music: Harshavardhan Rameshwar
Production Designer: Gandhi Nadikudikar
Editor: Tammiraju
Ceo : Potini vasu
Story Development : Prashanth baradi
Co Director : chalasani ramarao
Costume Designer :Vijay Rathinam MPSE
Re-Recording Mix : A M RahmathullaA. M. Rahmathulla
Stunts : Venkat Master
Poster designs : Kanni Studios
Digital Marketing: Walls & Trends
Pro : vamsi kaka

Previous Post

“బాగుంది” టీజ‌ర్ విడుదల చేసిన వేణు ఉడుగుల

Next Post

అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్, ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు

Next Post
అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్, ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు

అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్, ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100  డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ వారి సింధూర సంజీవని “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్”

by admin
July 1, 2025
0

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

ఘనంగా “అలలు లేని సముద్రం” మూవీ ట్రైలర్ లాంఛ్

by admin
June 29, 2025
0

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

“Maargan: A Gripping Crime Thriller with a Unique Twist and a Message”

by admin
June 27, 2025
0

కన్నప్ప… ఎమోషనల్ హిట్

కన్నప్ప… ఎమోషనల్ హిట్

by admin
June 27, 2025
0

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

నా రీ ఎంట్రీకి “తమ్ముడు” సరైన మూవీ, ఈ చిత్రంలో ఒక కొత్త తరహా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు – నటి లయ

by admin
June 26, 2025
0

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

by admin
June 26, 2025
0

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉండే విజయ్ ఆంటోని గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. ‘మార్గన్’ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు

by admin
June 26, 2025
0

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి

by admin
June 24, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.