• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, April 27, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఓ భామ అయ్యో రామ’ రివ్యూ.. l

Maari by Maari
July 11, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special
0
‘ఓ భామ అయ్యో రామ’ రివ్యూ.. l

Share and Enjoy !

Shares
Twitter

సుహాస్, మాళవిక మనోజ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఓ భామ అయ్యో రామ’. వీ ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల నిర్మాణంలో రామ్ గోధల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్ హరీష్ శంకర్, మారుతీలు సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఒకప్పటి హీరోయిన్ అనిత హాసనందిని, అలీ, రవీంద్ర విజయ్, బబ్లూ పృథ్వీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఓ భామ అయ్యో రామ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ: రామ్(సుహాస్)చిన్నప్పుడే అమ్మ మీనాక్షి(అనిత) చనిపోవడంతో మేనమామ(అలీ) దగ్గర పెరుగుతాడు. ఓ యాక్సిడెంట్ లో సత్యభామ(మాళవిక మనోజ్) పరిచయం అవుతుంది. సత్యభామని జాగ్రత్తగా ఇంటిదగ్గర డ్రాప్ చేశాడని తెలియడంతో రామ్ పై ఇష్టం పెంచుకొని అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఏ అమ్మాయిని పట్టించుకోని ఎంబీఏ చదువుతున్న రామ్ సత్యభామని ఇష్టపడతాడు. రామ్ కి చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా సినిమాలు చూడడు, నీళ్లు అంటే భయం. సత్య రామ్ ని తీసుకెళ్లి డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరుస్తుంది. ఓ రోజు రామ్ వాళ్ళ నాన్నని చూడటం, అదే సమయంలో సత్యకు యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. సత్యకి ఏమవుతుంది? అసలు రామ్ చిన్నప్పుడు ఏం జరిగింది? సినిమాలు అంటే ఇష్టం లేని రామ్ డైరెక్టర్ అవుతాడా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాస్ ఇప్పుడు ఓ భామ అయ్యో రామ అనే కమర్షియల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా రామ్ పాత్ర, అతని ఫ్రెండ్స్ కామెడీ. రామ్ చుట్టూ హీరోయిన్ తిరగడంతో సాగుతుంది. హీరోయిన్ యాక్సిడెంట్ తో ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ రామ్ చిన్నతనం, రామ్ సినిమా వర్క్, మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ తో సాగదీశారు.

ప్రతి కథలోనూ కొత్తదనం చూపించే సుహాస్ ఇలాంటి కథ ఎలా ఒప్పుకున్నాడు అనే సందేహం రాకమానదు. చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యారు. 25 ఏళ్ళ క్రితం కూడా ఇప్పటి అడ్వాన్స్‌డ్ టీవీలు, ఫ్రిడ్జ్ లు చూపించే అంత లాజిక్స్ మిస్ అయ్యారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఇంటర్ కట్ సీన్స్ రిపీటెడ్ గా పడటం, చూపించిందే మళ్ళీ చూపించడం చేసారు. ఫ్లాష్ బ్యాక్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు. మేనమామ సెంటిమెంట్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో కథని వెనక్కి తీసుకెళ్తూ కొన్ని ట్విస్ట్ లు ఇచ్చారు. అవి ఆకట్టు కుంటాయి.

మొత్తంగా డైరెక్టర్ కొంత ఫిక్షన్ జోడించి తన సొంత కథనే సినిమాగా మలిచాడేమో అని సందేహం రాకమానదు. గుంటూరు కారం సినిమాలో మహేష్ హైదరాబాద్ – గుంటూరుకు ట్రిప్స్ వేసినట్టు ఇందులో సుహాస్, హీరోయిన్ కలిసి హైదరాబాద్ – వరంగల్ ట్రిప్పులు వేయడం గమనార్హం.

సుహాస్ ఎప్పట్లాగే ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. సుహాస్ డ్యాన్సర్ గా ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాట పాడి తన డ్యాన్స్ ట్యాలెంట్ ని చూపించాడు. మలయాళ భామ మాళవిక మనోజ్ తెలుగులో ఎంట్రీ ఇస్తూ క్యూట్ గా కనిపిస్తూనే తన నటనతో మెప్పించింది. చాన్నాళ్లకు అలీకి ఒక మంచి పాత్ర పడింది.

హీరో ఫ్రెండ్స్ గా మోయిన్, సాత్విక్ ఆనంద్ ఓకే అనిపించారు. బబ్లూ పృథ్వీ కాసేపు హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించాడు. ఒకప్పటి హీరోయిన్ నువ్వు నేను ఫేమ్ అనిత హాసనందిని తల్లి పాత్రలో పర్వాలేదనిపించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ తన రియల్ లైఫ్ పాత్రలోనే నటించారు. మారుతీ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ మాత్రం వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ లో రిపీటెడ్ సీన్స్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. హీరోయిన్ డామినేటెడ్ పాత్రతో రొటీన్ కథ కథనంతో తెరకెక్కిచాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’

Next Post

‘VISA – వింటారా సరదాగా’ టీజర్ విడుదల

Next Post
‘VISA – వింటారా సరదాగా’ టీజర్ విడుదల

'VISA - వింటారా సరదాగా' టీజర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
April 26, 2026
0

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

by Maari
April 25, 2026
0

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

by Maari
April 25, 2026
0

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

by Maari
April 25, 2026
0

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

by Maari
April 25, 2026
0

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

by Maari
April 25, 2026
0

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

by Maari
April 25, 2026
0

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

by Maari
April 25, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.