• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, July 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఒక పథకం ప్రకారం…. ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Maari by Maari
February 7, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, Reviews, special, sports
0
ఒక పథకం ప్రకారం…. ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Share and Enjoy !

Shares
Twitter

పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఇటీవల దరువెయ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. మళ్లీ ఈరోజు  ‘ఒక పథకం ప్రకారం’ అంటూ ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చాడు. హిట్ చిత్రాల మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని, కమెడియన్ సుధాకర్… తదితరులు నటించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ చేసిందో చూద్దాం పదండి.

కథ. సిద్దార్థ్ (సాయి రామ్ శంకర్) ఒక మంచి లాయర్. సీత(ఆషిమా నర్వాల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక రోజు సీత కనిపించకుండా పోతుంది. దీంతో సిద్దార్థ్ తన భార్యని వెతుకుతూ, బాధపడుతూ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతాడు. దాంతో అతన్ని సస్పెండ్ చేస్తారు. ఓ రోజు అనుకోకుండా దివ్య(భానుశ్రీ) మర్డర్ కేసులో సిద్దార్థ్ ని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి మర్డర్ దగ్గర సిద్దార్థ్ కి సంబంధించి ఏదో ఒక క్లూ ఉంటుంది. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు?  సిద్దార్థ్ కి సంబందించిన క్లూస్ ఎందుకు దొరుకుతున్నాయి?  సిద్దార్థ్ భార్య సీతను ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ.. ఇప్పటి వరకు పాటలు… ఫైట్లు… కామెడీ సినిమాలను చేసిన సాయిరామ్ శంకర్… ఈసారి ఓ డిసెంట్ క్రైమ్ జానర్ లో నటించారు. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న అనేక రుగ్మతల్లో డ్రగ్స్, చైల్డ్ అబ్యుజ్ లు ప్రధానంగా వున్నాయి. అలాంటి ఎలిమెంట్స్ ను బేస్ చేసుకుని…  సాయి రామ్ శంకర్ మొదటిసారి ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేసారు. దీని ప్రమోషన్స్ లో ఇంటర్వెల్ లోపు విలన్ ని పట్టుకుంటే పదివేలు ఇస్తాం అని ప్రకటించడంతో సినిమాపై మరింత అంచనాలు పెంచాయి.. ఫస్ట్ హాఫ్ సిద్దార్థ్ గురించి, అతని ప్రేమ కథ, సిద్దార్థ్ సస్పెండ్ అవ్వడం, అమ్మాయిల సీరియల్ మర్డర్స్ జరగడం… ఈ నేపథ్యంలో సిద్దార్థ్ ని అరెస్ట్ చేయటం… అతని నిజాయితీ చూసీ మర్దర్స్ సస్పెన్స్ ను చేధించడానికి  సిద్ధార్థ్ సహాయం చేసే సీన్స్ అన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు విలన్ ని గెస్ చేసేయొచ్చు. అయితే అతనే విలన్ ఎందుకు, ఎలా అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు. దానికి సపరేట్ ట్రాక్ రాసుకోవడంతో సినిమాకు ప్లస్ అయింది. ఆ మర్డర్స్, దానికి వదిలే క్లూస్, ఆ క్లూస్ తో కనిపెట్టడం చాలా బాగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ లో విలన్ ని రివీల్ చేసే దగ్గర్నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటు అనిపించినా ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ పరిగెడుతుంది.

సాయి రామ్ శంకర్ కంప్లీట్ డిఫరెంట్ పాత్రలో కనిపించి ఎలాంటి పత్రలైన చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.
ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో కనిపించి ఆకట్టుకున్నాడు. సాయి రామ్ శంకర్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలుస్తుంది. అషిమా అగర్వాల్ క్యూట్ గా కాసేపు మెప్పిస్తుంది. పోలీసాఫీసర్ పాత్రలో శృతి సోది ఆకట్టుకుంది. సీనియర్ పోలీస్ పాత్రలో సముద్రఖని ఉత్తరాంధ్ర యాసలో నవ్విస్తారు. విలన్ గా నటించిన నటుడు కూడా క్లైమాక్స్ లో చాలా బాగా నటించాడు. చాలాకాలం తర్వాత ఒకప్పటి కమెడియన్ సుధాకర్ ఓ కీలక పాత్రలో కనిపించారు. భానుశ్రీ పాత్ర పర్వాలేదు. మిగిలిన నటీనటులు  తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 సినిమాటోగ్రఫీ ఒక క్రైంథ్రిల్లర్ కి ఎలా వుండాలో అలా వుంది. క్రైమ్ సీన్స్ ను చాలా డీటెయిల్డ్ గా కనబడేంత
విజువల్స్ ను..  నైట్ సీన్స్, డార్క్ సీన్స్  చూపించారు . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ ఆయింది. ఆసక్తికర కథతో ఫస్ట్ హాఫ్ కాస్త కమర్షియల్ అంశాలు కలిపినా ప్రీ ఇంటర్వెల్ నుంచి స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. డైరెక్టర్ ఆల్రెడీ మలయాళంలో రెండు హిట్స్ కొట్టాడు. ఈ ఒక పథకం ప్రకారంని కూడా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కావాల్సినంత ఈ సినిమాకు ఖర్చుపెట్టారు. ఫైనల్ గా ఒక పథకం ప్రకారం…. ఆడియెన్స్ ను బాగా ఎంగేజ్ చేసే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. గో అండ్ వాచ్ ఇట్….!!!

రేటింగ్: 3

Share and Enjoy !

Shares
Twitter
Tags: Movie Review RatingOka Pathakam Prakaaram Movie ReviewSairam SankarTelugu EntertainmentTelugu ReviewTollywood movie Review
Previous Post

షైన్ టామ్ చాకో రొమాంటిక్ కామెడీ డ్రామా ‘వివేకానందన్ వైరల్’ రేపటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

Next Post

అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు

Next Post
అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు

అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ఘనంగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
July 14, 2026
0

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రంలోని మూడో పాట ‘అడుకున్న దిక్కడే’ లిరికల్ సాంగ్ విడుదల

by Maari
July 13, 2026
0

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
July 12, 2026
0

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం  – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

“సావిత్రి” గారంటే తెలుగుతనం, అమ్మతనం – ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

by Maari
July 10, 2026
0

రివ్యూ: ‘వసుదేవసుతం’ – భక్తి, మిస్టరీ, యాక్షన్ కలయికలో ఆకట్టుకునే థ్రిల్లర్

రివ్యూ: ‘వసుదేవసుతం’ – భక్తి, మిస్టరీ, యాక్షన్ కలయికలో ఆకట్టుకునే థ్రిల్లర్

by Maari
July 10, 2026
0

‘లెనిన్’.. పక్కా మాస్ అంశాలతో మెప్పించే ఆధునిక మహాభారతం

‘లెనిన్’.. పక్కా మాస్ అంశాలతో మెప్పించే ఆధునిక మహాభారతం

by Maari
July 10, 2026
0

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –  – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ – – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

by Maari
July 9, 2026
0

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

by Maari
July 9, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.