మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఫుల్ పంచ్ లు, మహేష్ కున్న కామెడీ టైమింగ్… వెరసి ఫుల్ ఫన్ తో ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారనేది ఇప్పటి వరకూ ఉంది. అతడు, ఖలేజ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. పక్కా మాస్ లుక్ తో టీజర్, ట్రైలర్లలో కనిపించిన మహేష్… మరి సినిమాలో అదే రేంజ్ లో ఆడియన్స్ ని అలరించాడో లేదో చూద్దాం పదండి.
కథ: రమణ అలియాస్ భోగినేని వీర వెంకటరమణ(మహేష్) ఓ మిర్చి యార్డు ఓనరు. తన జోలికి వస్తే… అంతు చేసే రకం. అలాంటి రమణని ఓ పేరుమోసిన రాజకీయ నేపథ్యం ఉన్న వైరా వెంకటస్వామి(ప్రకాశ్ రాజ్), అతని కూతురు న్యాయ శాఖామాత్యులు వైరా వసుంధర(రమ్యకృష్ణ) ఓ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని రకరకాలుగా భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకు రమణ ససేమిరా అంటూ… ఎంతకైనా తెగించేస్తుంటాడు. ఇంతకు ఆ అగ్రిమెంట్ లో ఏముంది? రమణకి, వసుంధరకి ఉన్న మధ్య బంధం ఏమిటి? రమణ సంతకం పెట్టారా? లేదా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలతో ఫుల్ మాస్ లో వెళుతున్న మహేష్… ఇసారి కూడా ఫుల్ మాస్ తో ఎంటర్టైన్ చేయడానికి ఈ సంక్రాంతికి వచ్చాడు. త్రివిక్రమ్ సినిమా అంటే అందరూ ఎమోషన్స్, పంచ్ డైలాగులు ఉంటాయని ఎలా అయితే ఊహించుకుని సినిమాకి వస్తారో… వాటికి ఇందులో కొదువలేదు. పైగా త్రివిక్రమ్ స్టైల్ కి భిన్నంగా మాస్ ఆడియన్స్ కోసం ఇందులో సంభాషణలున్నాయి. కుటుంబ కథలలో ఎలాంటి చిన్నపాటి లైన్ తో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయో… ఇందులోనూ అలాంటి దాని చుట్టూనే కథ… కథనాలను అల్లుకుని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మహేష్ మార్క్ మేనరిజంతో ఆడియన్స్ అలరించి… సెకెండాఫ్ లో కాస్త ఎమోషన్స్ ను క్యారీ చేసి… క్లైమాక్స్ లో దాన్ని మరింత పండించేశాడు త్రివిక్రమ్. ఇందులో ఫస్ట్ హాఫ్ లో వచ్చే గోడౌన్లో సీన్… పీక్స్. మహేష్, శ్రీలీల పలాస చిత్రంలోని ‘నక్కిలీసు గొలుసు’ పాటకు చేసే డ్యాన్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది. అలాగే సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్… కుర్చీ మడతబెట్టి సాంగ్ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని ఎక్కడా తగ్గనీయకుండా ముగించారు. అయితే… ఎత్తుగడే కాస్త… కనెక్ట్ అయ్యేలా లేదనే విమర్శలు లేకపోలేదు. తండ్రీ కూతుళ్ల మధ్య, తల్లి కొడుకుల మధ్య, భార్య భర్త మధ్య ఉన్న ఆ చిన్న పాటి గ్యాప్… ఎమోషనల్ గా పెద్దగా టచ్ అవ్వదు అనేది సగటు ప్రేక్షకుల భావన. అయితే మహేష్… రమణగా వన్ మ్యాన్ షో చేశారు. అతనికి తోడు శ్రీలీల కూడా అముక్త మాల్యద(అమ్ము)గా ఎప్పటి లాగే తన అమాయకపు మాటలు, చూపులతోనూ, ఫుల్ ఎనర్జితో డ్యాన్స్ ఇరగీదేసింది. జూనియర్ ప్రభుదేవ లాంటి ట్యాగ్ లైన్ డైలాగులు ఇందులో త్రివిక్రమ్ కలం నుంచి శ్రీలీల కోసం జాలువారాయంటే… ఆమె డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నక్కిలీసు గొలుసు పాట… థియేటర్లో మహేష్ అభిమానులను అలరిస్తుంది. ప్రకాశ్ రాజ్ పాత్రలో అంత పవర్ ఫుల్ నెస్ కనిపించదు. రమ్యకృష్ణ పాత్ర కూడా అంతే. ఎప్పటిలాగే జయరాం కూడా ఓ సైలెంట్ తండ్రిగా కనిపించాడు. అతని చెల్లిలిగా ఈశ్వరీరావు గయ్యాళి పాత్రలో కనిపించింది. జగపతిబాబు పాత్ర ఓకే. అజయ్ పాత్ర నవ్విస్తుంది. క్లైమాక్స్ డైలాగ్స్ తో రావు రమేష్ తనదైన శైలిలో చెప్పి… ఆకట్టుకుంటాడు. మురళీ శర్మ పాత్ర కూడా ఓకే. వెన్నల కిశోర్… ఆద్యంతం శ్రీలీల పక్కన ఉంటూ నవ్వించారు. అజయ్ ఘోష్ పాత్ర పర్వాలేదు. రవిశంకర్ పాత్ర కూడా అంతంత మాత్రమే. థమన్ అందించిన బీజీఎం చాలా వైవిధ్యంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఫైలన్ గా గుంటూరు కారం… ఈ పొంగల్ కి పక్కా ఎంటర్ టైనర్ మూవీ. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.25