• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఆదికేశవ’ నుంచి ‘లీలమ్మో…’ అనే మాస్ పాట విడుదల

admin by admin
October 25, 2023
in Cinema
0
‘ఆదికేశవ’ నుంచి ‘లీలమ్మో…’ అనే మాస్ పాట విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్‌ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది.

‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది.” అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తుంది. ‘లీలమ్మో’ నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. వైష్ణవ్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది. అంతా బాగుంటుంది ఈ పాట” అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రథమార్థం అంతా వైష్ణవ్ గారు, శ్రీలీల గారు, సుదర్శన్ గారితో ఎంతో సరదాగా సాగిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమాఖచ్చితంగా అలరిస్తుంది” అన్నారు.

‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ ప‌తాకాల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో ఆదికేశవ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అందం, అభినయం, నాట్యంతో తక్కువ సమయంలోనే యువత అభిమాన కథానాయికగా మారిన శ్రీలీల ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని మూడో పాట ‘లీలమ్మో’ అంటూ ఆమె పేరుతో సాగడం విశేషం. ఈ పాటతో పూర్తి మాస్ ట్రీట్ ఇవ్వాలని ఆదికేశవ టీమ్ నిర్ణయించింది.

డ్యాన్స్ మూవ్‌మెంట్‌లు, నాయకానాయికల జోష్ ‘లీలమ్మో’ పాటను మాస్ మెచ్చే పాటగా మలిచాయి. ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు ‘ఆదికేశవ’ మరిన్ని అద్భుతమైన మాస్ మూమెంట్స్‌తో రాబోతోంది.

జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘లీలమ్మో’ పాట అంతకుమించి ఉంది.

గీత రచయిత కాసర్ల శ్యామ్ తన మాస్ పదాలతో పాటను తప్పక వినేలా చేశారు. నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహాన్ అద్భుతమైన గాత్రంతో మాస్ లిరిక్స్‌కు ఎనర్జీని ఇచ్చారు. మాస్, ఎనర్జీ కలిసి ఈ పాటను మాస్ బ్లాస్ట్ గా మలిచాయి.

పాటలు, ప్రోమోలు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు లీలమ్మో పాట ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఆదికేశవలో జోజు జార్జ్, అపర్ణా దాస్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేస్తున్నారు. ఆదికేశవ చిత్రం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

Panja Vaisshnav Tej, Sreeleela starrer Sithara Entertainments’ Aadikeshava gives a Mass Blast with Leelammo song!

It is apparent to use popular actors’ names and write lyrics to give Mass audiences and fans, a different treat. Aadikeshava team is following the same trend and brought out a Massy Blast kind off a song, Leelammo, as third single.

Panja Vaisshnav Tej, after debut with a blockbuster like Uppena, has decided to touch variety of genres and prove his versatility. He is now coming up with a mass actioner, Aadikeshava.

Srikanth N Reddy is debuting as writer-director with the film. Suryadevara Naga Vamsi and Sai Soujanya, of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing Aadikeshava on a grand scale.

Current Sensational leading lady, Sreeleela, is starring in the film and the third single, has her name coined in the lyrics as Leelammo. Aadikeshava team has decided to make this song, a complete mass blast and treat.

The dance movements from the song and agility shown by both the leads along with mind-blowing grace, makes this song, a perfect massy moment of the film. Aadikeshava is coming up with many more great mass moments to entertain audiences for this Diwali.

Already makers have released Sittharala Sithravathi, Hey Bujji Bangaram songs from the album composed by national award winning composer GV Prakash Kumar.

With his massy words Kasarla Shyam, made the song a must listen. Nakash Aziz and Indravathi Chauhan with the vocals lent Energy to the massy lyrics making it a MASS+ENERGY Blast in Synergy of Aadikeshava theme.

The songs and promos have created huge buzz for the film and Leelammo song is expected to maximize the impact. Aadikeshava has Joju George and Aparna Das in important roles as well.

Dudley and Prasad Murella handled Cinematography while AS Prakash handled production design. Navin Nooli is editing the film. Aadikeshava is scheduled to release on 10th November, worldwide.

Previous Post

నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” సినిమా ప్రారంభం !!!

Next Post

“నరకాసుర” కథ, కథనాల్లోని కొత్తదనం నచ్చడంతో నటించా – చరణ్ రాజ్

Next Post
“నరకాసుర” కథ, కథనాల్లోని కొత్తదనం నచ్చడంతో నటించా – చరణ్ రాజ్

"నరకాసుర" కథ, కథనాల్లోని కొత్తదనం నచ్చడంతో నటించా - చరణ్ రాజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.