సిద్ధా క్రియేషన్స్ బ్యానర్‌పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వంలో నీరజ లక్ష్మి సాకే నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి వంటి వారు ఇతర పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న విడుదలై పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకెళుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు దర్శకనిర్మాతలు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘ప్రేమలో రెండోసారి’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాకే. చిన్నతనంలో హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం, పెద్దయ్యాక ప్రేమ కాదని తెలుసుకోవడం కోసం.. హీరోయిన్ హీరోకి టెస్ట్ పెడుతుంది. అది ప్రేమ అనేది తెలుసుకునే సరికి పెద్దలు వాళ్ళ ప్రేమను అడ్డుకోవడం, అన్ని అడ్డంకులను ఛేదించి.. చివరికి వాళ్ల ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు అనేదే ఈ సినిమా కథాంశం. గ్రామీణ నేపథ్యంలో, రియల్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం. రమణ సాకే మ్యూజిక్, రియాజ్ ఫొటోగ్రఫీ.. ఇలా టెక్నీకల్‌గా కూడా ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవడం సంతోషంగా ఉంది. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు.
రమణ సాకే, వనితా గౌడ, జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి, విక్టర్.. తదితరులు నటించిన ఈ చిత్రానికి
సమర్పణ: సాకే రామయ్య
కెమెరా: రియాజ్
ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల
స్టోరి, డైలాగ్స్, లిరిక్స్, మ్యూజిక్: రమణ సాకే
నిర్మాత: నీరజ లక్ష్మి సాకే
దర్శకత్వం: సత్య మార్క










