యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు యూత్ నుంచి మంచి ఆదరణ వుంటుంది. అందుకే ఇప్పటికీ నిర్మాతలు ఇలాంటి కథలకు ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇలాంటి కథలకు వెల్ నోన్ స్టార్ కాస్ట్ లేకున్నా… కథ… స్క్రీన్ ప్లే బలంగా వుంటే… కొత్తవాళ్లతోనైనా సినిమాని తీసి… బాక్సాఫీస్ వద్ద నిలబడొచ్చు. అందుకే ఎప్పుడూ కొత్తవారిని… యూత్ ను ఎంకరేజ్ చేస్తూ… సినిమాలను నిర్మించే నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఇసారి… ‘రోటీ కపడా రొమాన్స్’ అనే ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తీశారు. దాదాపు ఓ నెల రోజుల నుంచే యూత్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ వేస్తూ… వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ… అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్ కు రప్పించేలా ఈ సినిమాను ప్రమోషన్ చేశారు. ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన నలుగురు స్నేహితులు రాహుల్(సందీప్ సరోజ్), విక్కీ(సుప్రాజ్ రంగ) సూర్య(తరుణ్ పొనుగంటి), హర్ష(హర్ష నర్రా)లు లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీరి హ్యాపీ లైఫ్ లోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు ప్రియా(సోనియా ఠాకూర్), శ్వేత(మేఘ లేఖ) అలాగే దివ్య(నువేక్ష), సోనియా(ఖుష్బూ చౌదరి) మూలాన ఎలా వారి లైఫ్ లు టర్న్ అయ్యాయి. వీళ్ల ప్రేమ కథలు ఎలా ముగిశాయి? యూత్ కు ఈ ప్రేమకథలు ఎలాంటి సందేశం ఇచ్చాయనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో చాలా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అలాగే ఓ నలుగురు ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన డీసెంట్ చిత్రాల్లో దీనిని కూడా చేర్చవచ్చు అని చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడు మెయిన్ లీడ్ లో నాలుగురి ఫ్రెండ్స్ కథని వారి పాత్రలని బాగా, పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దడం బాగుంది. అలాగే ఆ రోల్స్ లో ప్రతీ ఒక్కరు సెట్ అయ్యి వారి పాత్రలకి నలుగురు యువ హీరోలు కూడా న్యాయం చేకూర్చారు. వీరి నలుగుర్ని తెరపై చూస్తున్నపుడు డెఫినెట్ గా ఓ బ్యాచ్ ఫ్రెండ్స్ తమని వారిలో చూసుకున్నట్టు అనిపించవచ్చు. దర్శకుడు ఫ్రెండ్షిప్ అనే బ్యూటిఫుల్ ఎమోషన్ బాగా చూపించారు. అలాగే వీరితో పాటుగా వీరికి జోడిగా నటించిన యువ హీరోయిన్స్ కూడా అందరూ తమ నటన వారికి ఏవైతే పాత్రలు ఇవ్వబడ్డాయి వాటిలో తాము పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి వాటిని రక్తి కట్టించారని చెప్పాలి. ఈ మెయిన్ లీడ్ అంతా మాత్రం పెర్ఫామెన్స్ పరంగా మంచి ఎమోషన్స్ కామెడీ టైమింగ్స్ అలాగే సినిమాలో పరిస్థితిని బట్టి పలికించిన హావభావాలు బాగా ఇచ్చారు. ఇంకా సినిమాలో విక్కీ శ్వేతా ట్రాక్ అలాగే సూర్య దివ్య ట్రాక్ లు ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. వీటిని దర్శకుడు బాగా రాసుకున్నారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా వీరిపై బాగుంది. ఇంకా ప్రేమ కథల విషయంలో ఎవరినీ నిందించడానికి లేదు పరిస్థితులు కారణం అని చెప్పే ఎండింగ్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇది యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్లయింది.
చిన్న సినిమానే అయినా నిర్మాతలు మాత్రం సాలిడ్ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పాలి. పరిస్థితికి కావాల్సిన రిచ్ నెస్ సినిమాలో కనిపిస్తుంది. అలాగే సాంకేతిక టీంలో సన్నీ ఎం ఆర్, హర్ష వర్ధన్ రామేశ్వర్ అలాగే ఆర్ ఆర్ ధృవన్ ల స్కోర్, పాటలు బాగున్నాయి. అలాగే సంతోష్ రెడ్డి సినిమాటోగ్రఫి కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. ఇక దర్శకుడు విక్రమ్ రెడ్డి విషయానికి వస్తే.. తాను ప్రేమ, స్నేహం అనే రెండు బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని తీసుకున్నారు. తన కామెడీ రైటింగ్ పలు డైలాగ్స్ అలాగే నటీనటుల నుంచి మంచి నటనలను రాబట్టారు. కొన్ని ట్రాక్స్ ని అయితే యూత్ విజిల్ కొట్టేలా డిజైన్ చేశారు. నిర్మాతలు సృజన్ కుమార్, బెక్కం వేణు గోపాల్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను ఎంతో ఉన్నతంగా నిర్మించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మంచి ఎంటర్టైన్ చేసే సినిమా ఇది. పైసా వసూల్ పక్కా. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3