• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అప్పుడు లెజెండ్.. ఇప్పుడు రుద్రంగి- జగపతి బాబు

admin by admin
July 6, 2023
in Cinema, news
0
అప్పుడు లెజెండ్.. ఇప్పుడు రుద్రంగి- జగపతి బాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన “రుద్రంగి” అనే సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమల రామన్‌లు నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జులై 7న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులేంటంటే..

జగపతి బాబు మాట్లాడుతూ.. “రుద్రంగి మూవీ ప్యాషన్‌తో చేశాను. డైరెక్టర్ కథ చెప్పిన విధానం.. కాన్ఫిడెంట్ నచ్చింది. మనసులో ఓకే అనుకున్నా. కానీ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ చేయగలరా అని అనుకున్నా. చేయలా వద్దా అని అనుకున్నా. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువగా ఉన్న మూవీ. నేను అనుకున్నదాని కంటే ఎక్కువ అయింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ రేంజ్‌లో అజయ్ తీశాడు. క్యాస్టింగ్ కూడా దొర, దొరసానిల లుక్‌ కూడా వేరుగా ఉంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్‌గా సామజవరగమన మూవీని చూశాం. ఈ సినిమా పోరాటానికి సంబంధించినది కాదు. వాయిలెంట్ ఫ్యామిలీ డ్రామా. మహిళల మధ్యన.. భర్తల మధ్యన.. భార్యల లవర్స్ మధ్యన ఎలా జరుగుతుందనేది కథ. కొత్తగా ఉంటుంది. సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో విలన్‌ అని కూడా చెప్పలేను. కానీ ఈ విలన్ కూడా నచ్చుతాడని అనుకుంటున్నా. నాది వైల్డ్ క్యారక్టర్. ఆ రోజుల్లో ఆ దొరలు.. ఆ బానిసలు ఎలా ఉంటారనేది ఉంటుంది. మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు లెజెండ్ అవకాశం వచ్చింది. బోయపాటి శ్రీను సాలీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. బాలయ్య గారు నాయకుడు ఎవరు..? ప్రతి నాయకుడు ఎవరు అని పట్టించుకోరు. ఆయన కాన్ఫిడెంట్‌తో వెళ్లిపోతుంటారు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అది అందరూ సెకెండ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టారు. ఈ మూవీతో నేను థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నా. క్యారక్టర్‌లో దమ్ము ఉంటుంది. కచ్చితంగా మాట్లాడుకోవాలి. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు.. మంచి పాత్ర చేయాలన్నప్పుడు రుద్రంగి వచ్చింది. ఈ సినిమా అందరికీ ఉత్సాహాన్నిచ్చింది. మా అందరికీ ఈ సినిమాలోని ఆత్మ కనెక్ట్ అయింది. అజయ్‌లో చాలా ప్యాషన్ ఉంది. తప్పకుండా పైకి వస్తాడు” అని అన్నారు.

దర్శకుడు అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ.. “రుద్రంగి సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగుతున్నా ఇందులో చూపించే సమస్యలు, బాధలు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కానీ అక్కడి విధానాలు, పేర్లు వేరుగా ఉండొచ్చు. తెలంగాణలో ఇంకా ఎన్నో అద్భుతమైన కథనాలు ఉన్నాయి. రీసెంట్‌గా సినిమాలను చూస్తుంటే..తెలంగాణ కల్చర్ అంటే మందు చుక్క.. మటన్ ముక్క.. నల్లి బొక్క అంటున్నారు. కానీ దీని వెనుక వెళ్లి చూస్తే.. కొన్ని వేల.. లక్షల.. కోటి రక్తపు చుక్కల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ అంటే నల్లిబొక్కలు.. మాంసపు ముక్కలు.. మందు చుక్కలు కాదు. ప్రస్తుతం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలే ఎక్కువగా హిట్ అవుతున్నాయి. బాహుబాలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌ సినిమాలే ఉదాహరణ. మనషులు తమ ఆత్మలతో జీవించడం లేదు. టెక్నాలజీతో జీవిస్తున్నారు. ఆర్టిఫీషియల్‌గా జీవిస్తున్నారు. ఆర్టిస్టిక్‌గా జీవించడం లేదు. చాలామంది తమ జీవితాలను పరిపూర్ణంగా జీవించడం లేదని నేను నమ్ముతున్నా. తెలంగాణ వాస్తవ చరిత్రలో జరిగిన కొన్ని పాత్రలను గుర్తించి చేసిన కథ రుద్రంగి. బలమైన పాత్ర కావాలని అనుకున్నా. దొరలు నార్మల్‌గానే ఉంటారు. కానీ నాకు వేరేలా చూపించాలని ఉంది. ఉన్నది ఉన్నట్లు తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. ఈ కారెక్టర్ అనుకున్నప్పుడు నా మైండ్‌లోకి మొదటగా వచ్చిన వ్యక్తి జగపతి బాబు. అక్కడి నుంచి ముందుకు వెళ్లాం.. తెలుగులో రెస్పాన్స్ బట్టి.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తాం.” అని చెప్పారు.

నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. “రుద్రంగి ట్రైలర్ చూసి అనేక మంది తప్పకుండా విజయవంతం అవుతుందని చెబుతున్నారు. ట్రైలర్ సూపర్ డూపర్‌గా ఉందని అంటున్నారు. ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు. నేను పెద్ద ప్రొడ్యూసర్‌ను కాదు. కేవలం సినిమా ప్రేమికుడిని. సినిమా కళారంగాన్ని ప్రేమించే వాడిని. జగతిబాబు గారి ప్రోత్సాహం నాకు చాలా బలాన్ని ఇచ్చింది. నిజానికి ముందు మేము ఒక లిమిట్ అనుకున్నాం. కానీ జగపతి బాబు పర్ఫామెన్స్ చూసిన తరువాత ఎంతైనా పర్వాలేదని అనిపించింది. ఇందుకు కారణం జగపతి బాబు గారే అని చెప్పుకుంటాం. ఆ ధైర్యమే మమ్మల్ని నడిపించింది. బాలకృష్ట గారు ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో మాటలు బలాన్ని ఇచ్చాయి. ఈ సినిమా చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినదే అనుకుంటున్నారు. కథలు, కన్నీళ్లు, దుఃఖాలు అన్ని ప్రాంతాలకు ఉంటాయి. ఆంధ్రలో పల్నాటి యుద్ధాలు, రాయలసీమలో విజయనగర సామ్రాజ్యాలు మనం చూశాం. అక్కడ యాస, భాష, సంస్కృతుల్లో తేడా ఉండొచ్చు. కానీ దుఃఖం ఒక్కటే. తిరుగుబాటు ఒక్కటే. జీవితం ఒక్కటే. అద్భుతమైన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే రుద్రంగి. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన యాధార్థ కథ ప్రేమ కథనే ఇది. రామయణంలో సీతపై ఆశపడిన రావణసురుడి లంక దహనమైపోయింది. అలాంటి కథ ఇది. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా. నేను కళాకారుడిగా కథలు ప్రేమించే వాడిని. ఇలాంటి కథలు భవిష్యత్ తరాలకు తెలియాలని తీశా. అంతేగానీ నేను ఎమ్మెల్యే అని తీయలేదు. లెజెండ్ తరువాత రుద్రంగిలో జగపతి బాబు గారి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన అంగీకారమే మాకు బలం. అన్ని పాత్రలకు పర్ఫ్‌ఫెక్ట్‌గా కుదిరాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. ఊహించని కథనం, మలుపులు, ముగింపు చాలా బాగుంటుంది” అని అన్నారు.

Previous Post

రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునే ‘భాగ్ సాలే’- చిత్రయూనిట్

Next Post

ఎంగేజింగ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘సర్కిల్’

Next Post
ఎంగేజింగ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘సర్కిల్’

ఎంగేజింగ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘సర్కిల్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.